శంకరార్యుల వారి శంకరాభరణం కొలువు జగజ్జేగీయ మానం గా కవి పండితాద్యులతో వెలుగొందుతోంది.
మహామహులైన పండితులు , నిష్ణాతులు , గ్రాంధికం , గ్రామ్యం కాచి వడబోసిన పెద్దల కొలువు అది.
ఆర్యులవారు చిరునగవుతో వీక్షించు చూ , తమ సహ పండితులని అష్ట దిగ్గజములై న వారిని ఒక మారు కలయ జూసినారు
కొలువులో
పండిత నేమాని వారు,
చింతా వారు
సుబ్బారావు గారు
శ్యామలీయం గారు
లక్కాకుల వారు
గోలీవారు
శ్రీపతి గారు,
రాజేశ్వరీ అక్కయ్య గారు
లాంటి అష్ట దిగ్గజములను గాంచి ఆ పై నను వున్న మీదు మిక్కిలి పండిత లోకమును గాంచి, ఆ నాటి కొలువు విశేషములు వారు మొదలు బెట్ట బూనినారు.
ఈ శంకరాభరణము కొలువు కు శ్యామలీయం గారు మంజరీ ద్వార పాలకులై ( ఆంగ్లములో గేటు కీపరు అందురు) కొలువుని కడు జాగ్రత్తగా కాపాడుకొంటూ తమ అసామాన్య ప్రతిభా పాటవాలతో ఒక వైపు ఐటీ రంగమును మరొక వైపు కవితా వెల్లువలను సమ పాళ్ళలో 'క్రోడీకరించి' న వారై , ఒక కన్ను ను ఎప్పుడు మంజరీ ద్వారముపై పెట్టి ఉందురు - ఏల అన ఎవరైనా తుంటరులు అనానిమస్సులై అక్కడ ప్రవేశించి ఏమైనా సభా భంగము గావించిన వారికి వెంటనే వారు ఝాడూ చూపించి తరిమి వేయుదురు.
అటువంటి గురుతరమైన భారముతో వారు శంకరార్యుల కొలువును గాపాడుచూ, ఒక వైపు గ్రాంధి క మా , మరో వైపు గ్రామ్యమా అన్న లక్కాకుల వారికి సమానముగా తమ బ్లాగ్కామెంట్ ఫటిమ లో నెగ్గుకుని వస్తూ, మంజరీ ద్వారమున ఒక్క మారు వీక్షించినారు శ్యామలీయం వారు.
(బుజ్జి పండు ప్రవేశం)
శ్యామలీయం మాష్టారు - తనలో
ఎవరో ఒక బుడతడు ఇటు వస్తున్నాడే ! ఈ సభా ప్రాంగణములో ఈ బుడతడికి పని ఏమి ?
ముక్కుపచ్చలారని ఈ పసిబాలుడికి ఈ ప్రబంధ ప్రదేశమున పని ఏమి ? అనుకున్న వారై,
(ప్రకాశముగా)
ఓరీ బాలకా, ఎవరవు నీవు ఎచట నుంచి నీ రాక ? అని గంభీరముగా చూసినారు. వారు గంభీర స్వరూపులు. వారి చూపులు నిశితమైనవి.
బుజ్జి పండు కొంత బెదిరి,
మలీ అండీ, మలీ అండీ... మలీ అండీ ....
ఈ మలీ మలీ ఏమిటి ? స్ప్రష్టముగా చెప్పుము ! నీ పెరేమిటోయీ ?
మలీ మలీ అండీ, నేను మా మాత పంపగా వచ్చినానండీ !
శ్యామలీయం మాష్టారు గారు అబ్బురు పడి పోయారు. ! ఈ బాలుడు మాత అన్న పదమును ఎంత స్వచ్చముగా స్వేచ్చెగా పలికినాడు సుమీ ! ఈ మమ్మీ ల కాలములో వీడు మాత అని పలకటం గొప్ప విషయమే !
వారు ఈ మారు కొంత స్వాంతన స్వరముతో బాలకా, నీ పేరు ఏమి ? అని నిదానముగా అడిగినారు
నా పేలండీ , నా పేలండీ, ...
ఓహో ఈ బాలకునికి సాధు రేఫములు పలకడం కష్టమైనట్టున్నది ! అని భావించి శ్యామలీయం వారు, పోనీ, మనమే వేరు విధముగా అడిగి చూతము అని,
బాలకా, నీ నామమేమి ? అని రేఫములు లేక సాధు గా అడిగారు ఈ మారు .
మీలు పెద్ద వాలండీ, నామమేమి అనకూడదు. నీ నామమెక్కడ అని అడగ వలె ! నా నెత్తిపై వున్నది చూడుడు , అని ఒక చెణుకు మన బుజ్జి పండు వేసి,
స్వామీ, నా నామము బుజ్జి పండు అని తనను పరిచయము చేసుకున్నాడు.
హార్నీ, బుజ్జి పండు , ఏమి ఈ తెలుగు పేరు ! ఈ కాలములో పిల్లలకి ఇంత మంచి స్వచ్చమైన పెరెట్టిన తల్లులు గారు వున్నందువల్లే కదా, ఈ శంకరాభరణము వంటి కొలువులు ఇంకనూ వర్దిల్లుచున్నవని వారు సంతోషపడి,
బుజ్జి పండూ, నీ చెణుకు కి నేను మైమరిచితిని. ! నీ విక్కడి కి వచ్చిన కారణం బెద్ది ? అని వారు ప్రశ్నించారు.
"మా మాత, జ్యోతిల్మాయీ వాలు, నన్ను మలింత తెలుగు నేల్చుకొనుటకు మీ శంకలాభలనము కొలువుకి నన్ను పంపినాలు మా మాత నన్ను అమలికా నిండి ఇక్కడి కి పంపించినాలు మీ వద్ద అంతల్జాల వాసము చేయమని ' అన్నాడు బుజ్జి పండు.
శ్యామలీయం మాష్టారు, ఈ అబ్బాయి ని గాంచి ముచ్చట పడి, వీడికి ఒక్క రేఫమే కదా సమస్య ! ఈ తెలుగు లోకం లో ఎంత మందికి అసలు తెలుగే రాదు. అటువంటి కాలములో వున్న ఎందరికో కన్నా, ఈ బుడతడి ఉత్సుకతకి ఆ రేఫలోపము ( ఇది దుష్ట సమాసమా అని రేపు ప్రశ్న టపా లో వేయవలెనని గుర్తు పెట్టుకుని ) ఒక్కటే కదా, మన్నించి, శంకరాభరణం కొలువలో ఈ బుడతడికి ప్రవేశము కలిపించి ఈ బుజ్జి పండుకి తెలుగు నేల్పుదము ( హమ్మో, నాకు రేఫలోపము వస్తున్నదే సుమీ!, జాగ్రత్త గా వుండవలె అని మనస్సులో అనుకున్న వారై) అని తీర్మానించి,
బాలకా, బుజ్జి పండు, వేచి వుండుము, నేను సభా ప్రాంగణములో మా పండితుల వారి అనుమతి గైకొని వచ్చి నిన్ను తోడ్కొని పోవుదునని వాక్రుచ్చి, వారు సభా ప్రాంగణంలోనికి వెళ్ళారు !
(సశేషం)

C-1:
ReplyDelete౧. ఇప్పుడే చదవటం మొదలెట్టాను
౨. 8 దిగ్గజాలు ఆశ్చర్యం కలిగింది
౩. మధ్యలో నవ్వు వచ్చింది (నామం case )
C:2
ReplyDeleteSecond half @"మా మాత, జ్యోతిల్మాయీ వాలు "
శ్రీరామదాసు లో sunil గుర్తొచ్చాడు
C:3
ReplyDeletesunil సీన్ లో నవ్వాక
@ "అంతల్జాల వాసము చేయమని" doubt ?
ఏమంటే నేను కూడా ఈ మధ్యన స్వప్నం లో కుడా అంతర్జాల బ్లాగు వాసం చేస్తున్నా !
ఈ బ్లాగుటా ఇంకా కామేంటిడుటా వంటివి - not only జగదావస్థ including స్వప్నావస్థ
ఈ విషయం తెలిసి రాశారా? లేక వీడి చదువు ఎటుతిరిగి స్వప్నం లో నే కాబట్టి (ఏకలవ్యుడి మాదిరి) అని అలా సర్ది పుచ్చరా?
(u must rectify it-u )
C:4
ReplyDeleteహు హు హు
అంతా అయ్యిపోయింది
1st లోజే నేను క్లాసు మిస్సు
తొండి, నన్ను స్వప్నము మీద ఎక్కిన్చుకుంటా నని చెప్పి
తానె ఎల్లి పోయాడు బుజ్జి పండు గాడు
బుజ్జి పండు తో ఈ ఎందుకో ఏమో "చిన్ను గాడు" (నా పేలు ఇది)
పచ్చి
?!
వలూదిని కి
ReplyDelete"చిన్ను గాడు"
విన్నపము లేపు నేనే ముందు వచ్చెదను
శంకలాబలనం గారికి శంక కలుగ కుండా పూర్వపు విధ్యార్ది గా
పలిచయం చేయవలెను
వీలైనచో "బుజ్జి పండు కి రేఫ లోపము"
"చిన్ను గాడికి లేఫ రోపము"
ఎందుకో ఏమో మొత్తం మీ చేతుల మా కల లోనే ఉన్నది
ఇప్పటికే తెలంగాణా బందుల వలన సిలబస్సు లేటు
త్వరగా సాగిమ్పవలెను
చీల్స్
జిరేబి
?!
చెప్పటం మరిచాను
ReplyDeleteసుభ గారి పుట్టిన రోజు పడుగకు వెళ్ళటం వల్ల
ఇవాళ "లారేక" పోయాను
కావాలంటే పది గుంజీలు తీస్తాను
అంతే కాని తోడ పాశం వగైరా వద్దు గాక వద్దు
చాలా బాగుంది.
ReplyDeleteఎదురుచూసిన మలిభాగం ఎదురుచూడనంత బాగుంది. భేషో!! :)
ReplyDelete"స్ప్రష్టముగా చెప్పుము"...శ్యామలీయం మాష్టాలు గాలు తలబడ్డాలు...తలబడ్డాలు..! మన బుజ్జిపండు మాటలు తెలుగు యాంకర్లు వింటే అది రేఫలోపము అని తెలియక ఫ్యాషన్ అనుకుని వల్లెవేస్తారేమో సుమీ!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteబుడతని రాకకు కన్నులు
ReplyDeleteకడు వేచిన వేండ్లు పూండ్లు కనబడగానే
తడబడితి నబ్బురంబున
వడివడిగా బుజ్జి పండు వచ్చెను పిడుగై.
జిలేబిగారూ..మా బుజ్జిప౦డుకి ప్రవేశము లభించినదో, లేదోయని ఉత్క౦ఠగా ఎదురు చూస్తున్నాము.
ReplyDelete@ఎందుకో ఏమో ?! గారు,
ReplyDeleteనాకు సి తెలుసు,
సి ప్లస్ తెలుసు,
సి డబల్ ప్లస్ తెలుసు,
చార్మీనార్ తెలుసు,
కానీ మీ సి చార్ ప్లస్ గురించి ఇదే మొదటి మారు వినడం ! ఇది ఏదో కొంగొత్త భాష యా ? బుజ్జి పండు కు ప్రవేశము దొరుకునో లేదో అని మీరు మీ చదువును ఆపి వేయవలదు ! జగదావస్థ, (?!) స్వప్నావస్థ, మరి ఏ ఏ అవస్థలు వున్నాయో అవన్ని మీకు కలబోసి ప్రవేశము కలుగునట్లు చూతము !
చీర్స్
జిలేబి.
@శర్మ గారు,
ReplyDeleteనెనర్లు. బుజ్జి పండు చదువు బాగుగానే కొనసాగుతోందని భావించెదము!
చీర్స్
జిలేబి
కొత్తావకాయ గారు,
ReplyDeleteబహుకాల దర్శనం ! భేషో! నెనర్లు
జిలేబి.
శ్యామలీయం మాష్టారు గారికి,
ReplyDeleteబుజ్జి పండు ని మీరే రెకమెండు చేయ్యవలె ! చూతము ఆ పిడుగు బుజ్జి పండు సభా ప్రవేశము గావిన్చునో లేదో అని !
చీర్స్
జిలేబి.
మాతా జ్యోతిల్ మాయీ వారు,
ReplyDeleteమీ లాగే నేను కూడా వేచి వున్నాను. బుజ్జి పండు సభా ప్రాంగణం ప్రవేశము గురించి నాకును తెలియదు. శ్యామలీయం మాష్టారు పండితుల అనుమతి కై వెళ్లి వున్నారు. ఏమవుతుందో వేచి చూడవలె.
చీర్స్
జిలేబి.
@బాలు గారు,
ReplyDeleteనెనర్లు. యాంకర్లు బుజ్జి పండు భాషని ప్రచారము గావించదరెని ఆశించెదము!
చీర్స్
జిలేబి.
c-1 ,2,3,4 అంటే కామెంట్ 1 ,2,3,4 అని అర్ధం అనుకుంటా
ReplyDeleteమీ బ్లాగ్ కి నేను వీరాభిమానిని అయిపోయాను
@అప్పా రావు శాస్త్రీ గారికి,
ReplyDeleteనెనర్లు, దీని వెనుక మీ ప్రోత్సాహం వున్నది. కొన్ని రోజుల మునుపు మీరు ఆ గూగుల్ వాడి ime సలహా చెప్పినందువల్ల కొంత వెసులు బాటు అయ్యింది రాయడానికి. మీకు నా డబెల్ చీర్స్ !
జిలేబి.