Tuesday, January 24, 2012

బాలయ్య vs జిలేబి !బాపురే రమణీయం !

బాపురే రమణీయం !

బెష్టు మట్టి బుర్ర !

ఈ మధ్య బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం వారి అర్ధ శత (వందకి పరుగులిచ్చేందుకు కొంత పుష్ అప్ ) వేడుకలని  తీరిగ్గా 'నిల్చొని' చూసాను. నిల్చొని అనడం ఎందుకంటే , standing ovation అన్న మాట. ఒక్కింత మర్యాద.

ఈ తీరికైన వ్యాపకం లో ఆఖరున (బాలయ్య మొదటే మాట్లాడితే ఆ పై జనాలు ఎవరూ ఇక ఉండరని తను ఆఖర్లో మాట్లాడను కున్నారో, కాకుంటే, మట్టి బుర్రలు ఆఖర్న మాట్లాడడమే బెష్టు అనుకున్నారో తెలీదు గాని ) బాలయ్య మాట్లాడాడు.

స్టేజీ ని ఈ వైపు నించి ఆ వైపుకి 'జానా' పెడుతూ సింహం లా తిరుగుతూ ఒక్కింత గ్రాంధికమూ, గ్రామ్యమూ కలిపి మాట్లాడడం మొదలెట్టాడు, సామి రంగా, జిలేబి కి కాంపిటీషన్ కోచ్చేసాడే సుమా బాలయ్య కూడా అని నేను హాశ్చర్య పోయాను సుమా.

ఎందుకంటే, ఆ మధ్య మా భారారే (ఇంకా 'మా' భారారే వారే అను కుంటున్నా, !) ఆయ్ అందరూ హారం పత్రికకి సంక్రాంతి లోపే కథలూ గట్రా పంపించండి అంటే, నేనూ సై అని, భారారే , ఏప్రిల్ ఒకటో తారీకులో గా సంక్రాంతి కి ఆర్టికల్ పంపిస్తానని వాక్రుచ్చాను. వారు ఓ కోడా జాడిన్చేరు, ఆయ్ జిలేబి రమ్ము ఏమైనా తాగారా, ఏప్రిల్ లో ఏమిటి సంక్రాంతి అని !

ఇట్లాగే మా బాలయ్య కూడా, ఈ శ్రీ రామ రాజ్య అర్ధ శత మహోత్సవ వేడుకలలో, 'రాబోయే ఉగాది కి, గొబ్బిళ్ళు, నవ ధాన్యరాసులూ. అంటూ 'వాక్రుచ్చడం ' తో ముచ్చటేసి, బాలయ్యా , శభాష్, నువ్వూ జిలేబి కి సరి సమానమైన వాడవే నోయి అని నేను ముచ్చట పడి పోయా ! మొత్తం మీద, జిలేబి కి 'టెలీపతీ' ఉందండోయ్ !


బాలయ్య 'గొబ్బిళ్ళ ఉగాది' !!



say cheers to
జిలేబి !

Monday, January 23, 2012

పట్టు కొట్టు తిట్టు కాని మాట తీసి గట్టు మీద పెట్టు

ఏమోయ్ జిలేబీ, మార్కెట్టు కెళ్ళి  ఏం పట్టు కు రమ్మంటావ్ ?

ఏదో ఒకటి కొట్టు కు రండి.

అదేమిటోయ్, ఆ పరాకు,చిరాకు ?

ఉన్న మాటంటే ఉలుకెక్కువ అంటారు

సరేలే, ఆ బాస్కెట్టు గట్టు  మీద పెట్టు. ఇప్పుడే వస్తా !


చీర్స్
జిలేబి.

Saturday, January 21, 2012

'పద' తాడన కేళీ విలాసం !

రుషం లో

రువు

తాకిడి లో

మరుకం

వ్వుల పువ్వుల

కేకసలు రాదే భ

ళీ తంటా

విను వీధి

లాస్యం

సంగ్రామ కోలాటం !


జిలేబీ ఎందుకె

నీకీ వినువీధుల విహారం ?
మానుమా నీ ఈ

పద తాడన కేళీ విలాసం !


చీర్స్
జిలేబి.

Friday, January 20, 2012

కాలక్షేపం కబుర్లు శర్మ గారికి - విన్నపం

కాలక్షేపం కబుర్లు శర్మ గారికి విన్నపం.

విన్నపాలు వినవలెను వింత వింత లు -  మధ్య లో ధబాల్మని మీ టపాలు ఆపెయ్యడం ఏమీ బాగోలేదు.

కామెంటులు రాసే వారు కోకొల్లలు. కాని సత్తా ఉన్న టపా రాసే వారు కొంత మంది మాత్రమె. అందులో నాకు తెలిసిన ముఖ్యమైన వారు మీరు. మీలాంటి వారు రాసే టపాలని చదవడానికి ఎంతో మంది ఉండవచ్చు.

అర్థం  పర్థం లేని కామెంటు లకి వెరచి మీరు టపా ఆపు చెయ్యడం నాకు బెష్టు బుర్రలు చెయ్యాల్సిన పనిలా అని పించడం లేదు.

సో, మీరు ఈ విషయమై ఆలోచించి సరియైన ఒక నిర్ణయానికి వచ్చి టపాలు మళ్ళీ పునః ప్రారంభించాలని జిలేబీ విన్నపం.

జిలేబి.

Thursday, January 19, 2012

మసాలా 'దోషా'

ఒక తాతయ్య మాంచి దోసాలు వేసే వాడు.
ఆ దరిదాపుల్లో ఎగిరే కాకి ఒకటి
అప్పుడప్పుడు దోసల వాసనల్ని పసిగట్టేది
కాకి కి అవ్వ వేడైన వడలు వేసిన కథలు తెలుసు కానీ
దోసలు వేసే తాత దగ్గిర నించి 
దోసలు  ఎలా లాగాలో తెలీలేదు.
తాతా, తాతా , ఐ హేట్ దోసలు
అవి ఆరోగ్యానికి మంచి వి కావు అంది కాకి
కాకీ కాకీ నీ కెందుకు దోసలు నప్పలే
అడిగాడు తాతయ్య
చెప్పాగా , దోసలు ఆరోగ్యానికి
మంచివి కావని అంది మళ్ళీ కాకి
కాకులకు పట్టని దోస వేయ నేల
అని ఊరుకున్నాడు తాతయ్య
'కావు కావు' మన్నది మరో కాకి,
దానికి జవాబుగా.

కాలం మారినా కథలు మార కూడదు,
వాడెవడో దారిన పోయే దానయ్య ఏదో
అన్నాడని సీతమ్మ అడవులు పట్టింది.
దారిన పోయే కాకులు ఏదో అన్నా యని
ఈ తాత దోసలు వెయ్యడం ఆపేసాడు
ఈ సమీకరణం లో మిగిలింది ఏమిటి ?
కథ కంచికి , మనమింటికి.
నో చీస్, దోషా,
జిలేబి.
(కామెంటిన కనకాంగి కోక కాకెత్తు కు పోయిందని బ్లాగ్విత)

Wednesday, January 18, 2012

కాలక్షేపం కబుర్లు


ఇవ్వాళా  ఖాళీ.   నిశ్శబ్ద అసమ్మతి














నో చీర్స్
జిలేబి.

Tuesday, January 17, 2012

ఛుక్ ఛుక్ బండి - ఆస్సాము ప్రయాణము- 2

మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అని ఎవరో ఒక పెద్దాయన వాక్రుచ్చేరు !


నేను మొదటి మారు అస్సాము కి పోయేటప్పుడు మనం ఈ ఎక్కాల్సిన రైలు సూక్తి చాల బాగా అనుభవం లో కొచ్చింది.


సుతారం గా ముస్తాబై టంచ ను గా రైలు వచ్చే టైం కి మనం ముందే ఉండాలే మరే అని ఆవేశ పడి పోయి హైరానా పడి పోయి  మా వారి తో బాటు హుటా హుటిన మా గ్రామం నించి బయలు దేరి మద్రాసు సెంట్రాలు చేరితే ఓర్నాయనో పదునెనిమిది గంటలు ట్రైను లేటు అన్నాడు రైల్వే వాడు.


'ఆయ్, అది తప్పయ్యి  ఉంటుందండీ , పద్దెనిమిది నిముషాలు అన్నదాన్ని మీరు పద్దెనిమిది గంటలు అని చదివి వుంటారండీ , మీరు మళ్ళీ వెళ్లి కనుక్కొని రండీ అన్నా ' మావారు జమ్బునాధన్ కృష్ణస్వామీ అయ్యరు  వారితో.


మనకెప్పుడూ శ్రీ వారికి పని జేప్పటం అంటే ఒక మజా. ఎంతైనా మా వారే మరీ !
ఆ మాత్రం వారికి పని బెట్టక పోతే ముదురు ఐ పోరూ ! ఆ పై మనమాట వినకుండా పోయే అవకాశాలు ఎక్కువై పోతాయ్నన్న మాట.

అంతే గాక శ్రీ వారలను ఎప్పుడూ మనం 'పని' మీద పెట్టాలే ' అని మా బామ్మ చెప్పేది. మా  బామ్మ మాటల్ని వింటూ  ' నీ బామ్మ మాటలకేమి జిలేబీ,
పట్టించు కోకు , వేళా వేళా కు తిండి పెడు తొందిగా, దానికన్నా  ఇది పెద్ద పనిష్మెంటు ఏమీ కాదులే అనే వారు మా తాతా వారు.

అందుకే మనం ఇప్పుడు కూడా అందరి బ్లాగర్లకీ మన కథల్ చదవండోయ్, మన కవితల్ని చదవండోయ్ అని, ఆయ్ అంటే  ఓ కామెంటు చెండు తో కొట్టి , ఓ పాటి పద తాడన కేళీ విలాసం గావిస్తూ పని అప్పజేప్పుతూ ఉంటామన్న మాట.

వాళ్ళంతా బిజీ ఐపోతే మనం చక్కా మన పనుల్ని, (అంటే షాప్పింగు వగైరా గప్పు చిప్పు గా ) చక్క బెట్టు కోవచ్చు చూడండీ ! అదీ మన తెక్నీకు అన్న మాట.  

మీరు కూడా మీ వారికి కి వంట పని, ఆ పనీ, ఈపనీ అని అప్ప జెప్పి చూడండే, ఆ పై చూడండీ, మీకు ఎంత వెసులు బాటు వుంటుందో ! 

నాలా చక్కా టపాలు బ్లాగులు, అల్లికలూ, కామెంట్లు రాసేసుకుంటూ వేళా వేళా కాఫీ టీ లాగించు కుంటూ కాలం గడిపెయ్యోచ్చు!

సో, అలా మా వారిని పనికి పురమాయించి పక్కనే వున్న ఓ తాత గారిని పలకరించా - ఏమండీ మీరూ అస్సామేనా అని అరవం లో.

మేము అరవం వాళ్ళం కదండీ, కాబట్టి మాకు మద్రాసు పట్టిణమ్ పట్టినంతగా ఆదరాబాదరా హైదరాబాదు ఎప్పుడూ పట్టలే !  మాకు రాష్ట్ర రాజధాని బహు దూరం. ఓ ఆరువందలు కిలో మీటర్లు పై చిలుకు. కాబట్టి మాకు పేద్ద సిటీ అంటే మాద్రాసు పట్టిణమే !

అప్పట్లో నండీ మద్రాసు అనే వారండీ. ఇప్పుడు కూడా మా వూళ్ళో నండీ ' మద్రాసు పోయ్ వారె' అనే అంటా రండీ ! అరవం వాళ్ళు వూరికె అలా పేర్లు మార్చేసుకుంటూ వుంటారండీ - ఇప్పుడేమో చెన్నై సింగార చెన్నై అంటా రండీ, కానీ అందులో ఏమి సింగారం వుందో ఆ పెరుమాళ్ళ కే ఎరుక !

అదేమీ వారీ చోద్యమో, ప్రతి దానికీ ఓ అరవ పేరు అది జిలేబీ లా వుంటుంది కదండీ కాబట్టి తీపిగా వుంటుందని కొత్త కొత్త పేర్లు కని పెట్టేసుకుంటూ అఆయ్, మా అరవం గొప్ప జూడు అంటూ "జాం బజారు జగ్గు నాన్ సైదాపెట్టై కొక్కు" అంటూ అవేవో పాటలు కూడా పాడేసుకుంటూ వుంటారండీ మరీను !

మేము అరవం వాళ్ళమైనా ఈ అరవ దేశపు అరవం వాళ్ళ లా ఇలా అప్పుడప్పుడూ పేర్లు మార్చమండి.

మా చిత్తూరు వాళ్ళకండీ ఒక్క మారు పేరు పెట్టేస్తే అధట్లా నే వుండి పోవాలండీ మరీ.

మా బామ్మ నాకు జిలేబీ అని ముద్దు గా పేరు పెట్టిన్దండీ , అప్పట్నించి ఇప్పటిదాకా నేను జిలేబీ గానే వున్నా నండీ. అదండీ మా గొప్పదనం. ఉద్యోగ రీత్యా మేడం, మేం సాహెబ్ ,మాల్కిన్ ఇట్లా ఎన్నో పేర్లున్నా ఆ జిలేబీ అన్న పేరు ఇప్పటిదాకా అందరికీ మా సర్కిల్ లో ఓ ఝలక్ అండీ.

మా వూరి నించి మా బామ్మ కాలం లో మద్రాసు పట్టణానికి నెంబరు వందా నలభై నాలుగు అరవ బండి పోయేదండీ. ఆ పై మన ఆంధ్రా వాడు కూడా బండి వదిలాడండీ, కానీ చూడండీ  ఆ బస్సుకి వాడు కూడా వందా నలభై నాలుగే నంబరు అన్నాడండీ - చూసారా ఎంత ఖచ్చితం గా వుంటామో ! ఆర్టీసీ వాడు వాడి ప్రకారం నాలుగు సంఖ్యలు , ఐదు సంఖ్యలు నెంబర్లు పెట్టు కున్నా ఈ బండి కి మాత్రం నూటా నలభై నాలుగే పెట్టాడండీ . ఈ నెంబరు చాలా పాపులర్ నమ్బరండీ. ఒన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లా మరీ గట్టి నమ్బరండీ ఇది.

సో, ఆ పక్క తాత గారిని 'ఏమండీ మీరూ అస్సాము కేనా నన్నాండీ. ఆయనేమో హా హా బేటీ అని అరవం లో అన్నారండీ. అంటే నండీ ఆయన జెప్పింది హిందీ లో నే అండీ, నాకు ఆది అరవయాస తో కలిసి అరవం లాగే వుండింది మరి.

"మీరు ఈ వూరి సేట్లా?" అన్నా వారితో.

"అమ్మాయ్ నువ్వు బడా హుషారు , వెంటనే కని బెట్టేసావే " అని మెచ్చు కున్నారాయన. మద్రాసులో నండీ షావు కారు సేట్లు చాలా కాలం మునుపే వచ్చి సెట్టిల్ అయి పోయి వారి ఇప్పటి తరం అరవం మాట్లాడే దాక ఇప్పుడొచ్చిందంటే చూడండీ మరీను.

నాకు హిందీ అండీ చదవడం వచ్చినా అంతగా మాట్లాడ్డం రాదండీ.  మా వూళ్ళో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వుండే దండీ ,  అందులో నేనూ తూ తూ మంత్రం గా కొంత హిందీ లో ప్రవీణు రాలై నండీ అదీనునా ఏడో క్లాసులోనే.

అప్పట్ల్ ఓ అరవమ్మాయ్ హిందీ లో ఏడో క్లాసు లోనే ప్రవీణ్ పూర్తీ చేసిందని మా వారిని నాకు కట్ట బెట్టె ముందు మా బామ్మ మా వారితో చాలా గొప్పగా జేప్పిమ్దండీ.

మా వారు కూడా హెంత ఆశ్చర్య పోయారంటే నమ్మండీ - ఎందు కంటే వారు అరవ దేశం వారు. అక్కడ వారంతా 'అహిందీయలు' అండీ. ఇప్పుడు కూడా హిందీ అంటే వాళ్ళు ఆయ్ మా మీద అథారటీ చేస్తారా అంటా రు కదండీ - అప్పట్లో అయతే పెద్ద వియత్నాం వార్ జరిగే డండీ హిందీ మాటంటే వాళ్ళ మద్రాసు పట్టిణమ్ లో.

కాబట్టి ఈ తాతా వారితో సంభాషణ అంతటి తో కట్టి బెట్టి మనం పని మీద తోలిన మన పెనిమిటి 'ఎంగే' పోయారబ్బా అని ఆశ్చర్య పోయా నండీ.

వారేమో మళ్ళీ తిరిగొచ్చి, 'జిలేబీ, అది పద్దెనిమిది గంటలే లేటు. ఆపై వాళ్ళు చెప్పిమ్దేమంటే కొన్ని గంటలమునుపే ఆ తిరువనందపురం గువాహాతీ గాడీ కేరళ వైపు వెళ్ళింది. అది ఆ వూరు చేరి మళ్ళీ తిరుగు ముఖం ఇప్పుడే పట్టింది కాబట్టి మనం ఇక్కడే మకాం ఫార్ నెక్స్ట్ ఇరవై నాల్గు గంటలు ' అని ముఖం వేలాడదీసారు మా శ్రీ వారు.

వారి ముఖారవిందం చూసి బాధేసి, (ఎంతైనా మా జంబూనే కదా ) 'మీరు అంత గా బాధ పడకండీ, ఆ 'ఏழு ' మలై ఆండవన్' అన్నిటికీ వున్నాడు సుమండీ ' అని వారిని వోదార్చి, ఈ మద్రాసు సెంట్రాలు లో భైటాయించి పక్కనున్న తాత గారిని మళ్ళీ కదిపా 'ఏమండీ ' అని.

Monday, January 16, 2012

అయ్యారే జీవితం 'వావ్' నించి 'వార్' అయిపోయిందే !

బ్లాగ్ వారలు
జాగ్వార్ లో
షికారులు కొడు తూంటే


భం భం భళీ భళీ అని
బండి రాజధానీ లా
దూసుకు పోయింది


బ్లాగ్ వారల కి 
జాగ్ వార్ 
జా వార్
అంటే గుండెలు
ల్యాబ్ ల్యాబ్
అని  దిక్కూ దిక్కూ
మనే

ఏమిటో ఈ-వారలకి  
రాజధానీ లో కూడా
పార్లమెంటు సరిగ్గా
నడపడానికి అడ్డంకి

ఢిల్లీ చలో
రాజ్యం
వదిల్లెయ్
మంత్రి ఐ పో
బెటర్ జిలేబీస్
ఫ్రై నో వార్



చీర్స్
జిలేబి.

Sunday, January 15, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి వనం లో

క్రాంతి  సుమ పధం లో

తియ్యగా సాగే

శుభలక్షణ సమీరం లో

భాసించాలి మీ జీవితం

కాంతులతో సుఖ శాంతులతో - శుభాకాం

క్ష

లు

జిలేబి

Friday, January 13, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - 11 - భామా విజయం - 6

భోజనం కానిచ్చీ కానివ్వకనే , ప్రయాణ బడలిక తో ఉన్న బుజ్జి పండు హారీ పాటర్ కళ్ళద్దాల మధ్య జోగటం మొదలెట్టాడు మధ్య మధ్య లో బులుసు రాజీ మధురల మాట లు వింటూ.



మధుర ఇది గమనించి, "బుజ్జి అప్పుడే చెబ్తా నన్న కథ ఇప్పుడు చెప్పనా " అంది

"ఊ " అన్నాడు వాడు నిద్రలో 'ఊహూ" అనటానికి కుదరక.

మధుర కథ మొదలెట్టింది.
"అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడట. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి చాలా కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాయించి బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడట. మిరపకాయ్ పొట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉంటుందన్నమాట!

బుజ్జీ వింటున్నావా ?

"ఊ"

ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తాడంట.

వింటున్నావా బుజ్జీ ?


"ఊహూ "

ఆ తరవాత ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్తాడన్నమాట! అప్పుడు ఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి. మిరపకాయ్ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పి ఆ ఈతకాయంత ఇంట్లోకి జొరబడిపోయి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని ........

"బుజ్జీ వింటున్నావా?"


ఇంకెక్కడి బుజ్జి, బుజ్జి పండు కథ మధ్యలోనే సోఫాలో అడ్డంగా పడి ఎప్పుడో నిద్రపోయ్యాడు.

మధుర బుజ్జి పండుని చూసి హ్హా హ్హా హ్హా అని నవ్వి మంచి రగ్గు ఒక్కటి కప్పి బులుసు రాజీ లతో ఖబుర్లతో పడింది.

"మధురా సరి లేరు నీకెవ్వరు కథలు చెప్పడం లో " రాజీ గారు మెచ్చుకున్నారు మధురని.

"అమ్మాయ్ మధురా, , మీ మ్యూనిచ్ నగరం లో గ్లూ వైన్ మార్కెట్ చూడాలని దాని టేష్టు చూడాలని ఆరాటం. ఇప్పటికి మీ జర్మనీ రావడం కుదిరింది, కృష్ణ ప్రియ గారి ఆర్ముగం తో బాతా ఖానీ నెపం తో ! రేపే ఆ మార్కెట్ కెళ్లా లమ్మాయ్ " బులుసు గారు వాక్రుచ్చేరు.

"అలాగే మాష్టారు " మధుర చెప్పింది.

ఆ గ్లూ వైన్ కథా క్రమం బెట్టిదనిన.........


(ఇంకా వుంది )