Thursday, January 19, 2012

మసాలా 'దోషా'

ఒక తాతయ్య మాంచి దోసాలు వేసే వాడు.
ఆ దరిదాపుల్లో ఎగిరే కాకి ఒకటి
అప్పుడప్పుడు దోసల వాసనల్ని పసిగట్టేది
కాకి కి అవ్వ వేడైన వడలు వేసిన కథలు తెలుసు కానీ
దోసలు వేసే తాత దగ్గిర నించి 
దోసలు  ఎలా లాగాలో తెలీలేదు.
తాతా, తాతా , ఐ హేట్ దోసలు
అవి ఆరోగ్యానికి మంచి వి కావు అంది కాకి
కాకీ కాకీ నీ కెందుకు దోసలు నప్పలే
అడిగాడు తాతయ్య
చెప్పాగా , దోసలు ఆరోగ్యానికి
మంచివి కావని అంది మళ్ళీ కాకి
కాకులకు పట్టని దోస వేయ నేల
అని ఊరుకున్నాడు తాతయ్య
'కావు కావు' మన్నది మరో కాకి,
దానికి జవాబుగా.

కాలం మారినా కథలు మార కూడదు,
వాడెవడో దారిన పోయే దానయ్య ఏదో
అన్నాడని సీతమ్మ అడవులు పట్టింది.
దారిన పోయే కాకులు ఏదో అన్నా యని
ఈ తాత దోసలు వెయ్యడం ఆపేసాడు
ఈ సమీకరణం లో మిగిలింది ఏమిటి ?
కథ కంచికి , మనమింటికి.
నో చీస్, దోషా,
జిలేబి.
(కామెంటిన కనకాంగి కోక కాకెత్తు కు పోయిందని బ్లాగ్విత)

9 comments:

  1. Okkamukka (Chinna bit ayina) kooda lopaliki vellaledu........emitooooo.

    ReplyDelete
  2. @శ్రీ రాం గారు,

    ఇట్లాంటి వాటినే పిచ్చి గీతలు పచ్చి నిజాలు అంటారు !
    అర్థం అవక పోవడమే మంచిది ! అర్థం అయితే వచ్చు తంటా !!

    జిలేబి.

    ReplyDelete
  3. నా కర్డంయ్యింది ఏంటంటే
    కుక్కలు మొరుగు తున్నాయని
    ఏనుగు తన పయనం ఆపకుడదని అన్యాప దేశం గా
    జిలేబి గారి సందేశం అంద వలసిన వారికి అందే వుంటుంది .

    ReplyDelete
  4. రవి గారు,

    అలాగనే అనుకుంటాను. ఈశ్వరో రక్షతు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. ఇతరులు చెప్పిన మాట వినాలి. అలా అని వారేం చెప్పినా గుడ్డిగా తల ఉపాల్సిన అవసరం లేదు బుర్ర ఉంది కాబట్టి ఇతరులు చెప్ప్పిన దానిలో వాస్తవం ఏమిటో ఆలోచించాలి

    ReplyDelete
  6. ఓహో ఇది శర్మగారి కోసం చెప్పినా కథనా ?

    ReplyDelete
  7. బుద్ధ మురళి గారు,

    ఇది ఒక్కరి కోసం చెప్పిన కథ కాదు. ఇన్ జనరల్ కథ. అప్పుడప్పుడు, అవ్వ,తాత, వడ జిలేబి ఇట్లా కథా వస్తువులు మారుతూ కథ మళ్ళీ మళ్ళీ చెప్ప బడుతుంది ! విశేష మేమిటంటే ఈ కథ సర్వ సభ్య సమాజం లో ఎల్లప్పుడూ హిట్ ఐన కథే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. सब्का सुन्ना अप्ना कर्ना.....
    (సబ్ కా సున్ నా అప్నా కర్నా .....) అంటున్నారు Zilebi గారు....

    ReplyDelete
  9. మాధవి గారు,

    అయ్య బాబోయ్, మీ కలం కదిలితే ఇంత పవర్ఫుల్ అనుకోలేదు సుమండీ !

    మొత్తం మీద వరసబెట్టి చెదివి కామెంటు మీద కామెంటు ఇచ్చి నన్ను ఉబ్బి తబ్బిబ్బు అయ్యేటట్టు చేసారు !

    తెలుగులో థాంక్ యు
    అరవం లో నెనర్లు
    అంగ్రేజీ లో షుక్రియా
    అస్సామీ లో అరిగతో !

    అమ్మయ్యో అంతా తడబాటే !

    వెల్కం అండీ !

    ఇక బుజ్జి పండు చదువు కూడా ఇప్పటి దాక మీరు చదివినందులకు.

    వచ్చే వచ్చే సరికొత్త ఎపిసోడ్ ఒకటీ రెండూ రోజుల్లోనే - 'గ్లూ వైన్ ' ఎపిసోడ్ !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete