Tuesday, January 24, 2012

బాలయ్య vs జిలేబి !బాపురే రమణీయం !

బాపురే రమణీయం !

బెష్టు మట్టి బుర్ర !

ఈ మధ్య బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం వారి అర్ధ శత (వందకి పరుగులిచ్చేందుకు కొంత పుష్ అప్ ) వేడుకలని  తీరిగ్గా 'నిల్చొని' చూసాను. నిల్చొని అనడం ఎందుకంటే , standing ovation అన్న మాట. ఒక్కింత మర్యాద.

ఈ తీరికైన వ్యాపకం లో ఆఖరున (బాలయ్య మొదటే మాట్లాడితే ఆ పై జనాలు ఎవరూ ఇక ఉండరని తను ఆఖర్లో మాట్లాడను కున్నారో, కాకుంటే, మట్టి బుర్రలు ఆఖర్న మాట్లాడడమే బెష్టు అనుకున్నారో తెలీదు గాని ) బాలయ్య మాట్లాడాడు.

స్టేజీ ని ఈ వైపు నించి ఆ వైపుకి 'జానా' పెడుతూ సింహం లా తిరుగుతూ ఒక్కింత గ్రాంధికమూ, గ్రామ్యమూ కలిపి మాట్లాడడం మొదలెట్టాడు, సామి రంగా, జిలేబి కి కాంపిటీషన్ కోచ్చేసాడే సుమా బాలయ్య కూడా అని నేను హాశ్చర్య పోయాను సుమా.

ఎందుకంటే, ఆ మధ్య మా భారారే (ఇంకా 'మా' భారారే వారే అను కుంటున్నా, !) ఆయ్ అందరూ హారం పత్రికకి సంక్రాంతి లోపే కథలూ గట్రా పంపించండి అంటే, నేనూ సై అని, భారారే , ఏప్రిల్ ఒకటో తారీకులో గా సంక్రాంతి కి ఆర్టికల్ పంపిస్తానని వాక్రుచ్చాను. వారు ఓ కోడా జాడిన్చేరు, ఆయ్ జిలేబి రమ్ము ఏమైనా తాగారా, ఏప్రిల్ లో ఏమిటి సంక్రాంతి అని !

ఇట్లాగే మా బాలయ్య కూడా, ఈ శ్రీ రామ రాజ్య అర్ధ శత మహోత్సవ వేడుకలలో, 'రాబోయే ఉగాది కి, గొబ్బిళ్ళు, నవ ధాన్యరాసులూ. అంటూ 'వాక్రుచ్చడం ' తో ముచ్చటేసి, బాలయ్యా , శభాష్, నువ్వూ జిలేబి కి సరి సమానమైన వాడవే నోయి అని నేను ముచ్చట పడి పోయా ! మొత్తం మీద, జిలేబి కి 'టెలీపతీ' ఉందండోయ్ !


బాలయ్య 'గొబ్బిళ్ళ ఉగాది' !!



say cheers to
జిలేబి !

15 comments:

  1. భలే చెప్పారు జిలేబి గారూ...!!!

    ReplyDelete
  2. వారు సర్వపండగ సమానత్వం పాటిస్తారన్నమాట. సంక్రాంతి, ఉగాది ఇంకా మాట్లాడితే క్రిస్మస్ కూడా ఒకే లాగా సెలెబ్రేటు చేసుకుంటారు.

    ReplyDelete
  3. అదేదో సినిమాలో బ్రహ్మానందంగారు తనకు తోచినప్పుడు తోచిన పండగ సెలిబ్రేట్ చేసేస్తూ హడావుడి చేస్తారు పాపం మన హీరో బాలయ్యగారికి గొబ్బిళ్ళంటే యిష్టమేమో.

    కం. ఏడాది పొడవు నావులు
    దూడలునుం గడ్డి తినవె దుందుడు కొప్పన్
    పేడను వేయవె గొబ్బి
    ళ్ళాడుట కేమొచ్చె దోష మనగ జిలేబీ

    ....................(జిలేబీ శతకం నుండి)

    ReplyDelete
  4. పాపం అంత స్పీచ్ గుర్తుంచుకోవాలంటే కష్టం కదా..

    ReplyDelete
  5. బాలయ్య ఉపన్యాసం అర్ధం చేసుకున్నందుకు జిలేబికి రెండు వీరతాళ్ళు!

    ఈ జిలేబిని రాబోయే ఎన్నికల్లో బాలయ్య ఎన్నికల స్పీచ్ లని తెలుగు టు తెలుగు translation చేయుటకు ఎన్నిక చేయుచున్నాము!

    ReplyDelete
  6. పోస్ట్ ఏ బాగుంది అనుకుంటే యరమణ గారి కామెంట్ ఇంకా బాగుంది . telugu to telugu translation !!!!!!!!

    ReplyDelete
  7. డాక్టర్ ఆవుల గారు,

    నెనర్లు.

    మనవ(వా)డు బాగున్నారాండీ ! ఏమిటో ఈ మధ్య వారి కుశలం కామెంట్లలో టపాలలో కనుక్కోవాల్సి వస్తోంది!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. బులుసు వారు,

    ఆయ్! అలాగే కాబోలు! మొత్తం మీద వీరు జిలేబీ కి సరి జోడు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. శ్యామలీయం మాష్టారు,

    ధన్యోస్మి!

    మీ చేతిలో గొబ్బిళ్ళూ గోమేధకాలవుతాయి ! చైనా బంగారమూ సువర్ణాక్షరాలవుతాయి ! అంతా విష్ణుమాయ !


    జిలేబీ శతకానికి నమో నమః !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. @బోనగిరి వారు,

    ఆయ్ చాలా లేట్ న్యూస్. కాని మా లా బాలయ్యా కూడా లేటెస్టు మట్టి బుర్ర !

    @రాజకుమార్ గారు,

    నెనర్లు. హాయ్ హాయ్ హాయ్

    జ్యోతిర్మాయీ వారు,

    కరెక్టు గా చెప్పారు. భట్టీయం కొంత కష్టమే. ఇరవై నిముషాల పై భాషణం. !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. యా రమణ గారు,

    యా! హూ వీర తాళ్ళకి !

    ఇక నేను వారి తెలుగు ని తెలుగు లోకి అనువదిస్తే, ఇక బాలయ్య కి ఉన్న సినెమా మార్కెట్టు కూడా హుష్ కాకి - ఎలక్షన్ లో సీటు మాట దేవుడెరుగు !

    @వంశీ కృష్ణ గారు,

    తెలుగు తో తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే అది అంగ్రేజీ అగును !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  12. నాకూ, బులుసు గారికీ ఆయ్.
    మిగతా వాళ్ళకి హాయ్.

    ఇది అన్యాయం.

    ReplyDelete
  13. బోనగిరి వారు,

    హా,యి పక్క పక్క అక్షరాలూ.

    ఆ,య్ అక్షరం మొదలు నించి ఆఖరు దాక కలపబడ్డ పదం.

    చూడండీ, ఎంత గొప్ప గా అంత పొడుగాటి అనుసంధానం గావించి మీకు ఆయ్ అని చెప్పానో !

    దీనికే నన్ను మీరు మెచ్చు కోవాలి.


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete