మంచు పువ్వులు ముత్యాల్లా రాలుతూ మ్యూనిక్ మహా నగరం వింత శోభలతో క్రిస్మస్సు ఈవ్ కి ముస్తాబవు తోంది.
మ్యూనిక్ మహా నగరం సాయం కాలం.
మారియన్ ప్లాట్జ్ దగ్గర ముగ్గురు ఇండియన్లు నిలబడి ఉన్నారు. స్మార్ట్ గా వారితో బాటే బుజ్జి పండు కూడా ఉన్నాడు.
"అమ్మాయ్ మధురా, మీ మహా నగర శోభ మరీ తేజోమయం గా ఉంది " అన్నారు బులుసు వారు. తలపై పడుతున్న మంచు పువ్వులని మెల మెల్లన తోసేసు కుంటూ.
మారియన్ ప్లాట్జ్ మునిచ్ మహా నగరానికి నడి బొడ్డు. సమయం ఆరు కావస్తోంది.
అంతకు ముందే వాళ్ళు ఆ మధ్యాహ్నం దరి దాపుల్లోనే ఉన్న గ్లోకేన్స్పీల్ గంట ల కార్యక్రం చూసేరు.
దాన్తోటే కడు రమ్యం గా ముప్పై రెండు బొమ్మలు, ఆసాంతం అవి మానవుల అంత పొడువాటి ఉన్నాయి, అవి బవేరియా లోని ముఖ్య ఘట్టాలని తెలియ జేసేయి. ఒక హరిత వర్ణ పక్షి ఈవెంటు ముగియ గానే మూడు మార్లు కుకూ కుకూ కుకూ అంటూ ముద్దు గా చెప్పింది షో అయి పోయినట్టు.
ఆ పై లంచ్, ఆ పై మళ్ళీ సిటీ దర్శనం అంతా అయ్యేక క్రిస్మస్సు మార్కెట్ లో గ్లూ వెయిన్ కోసం ఇప్పుడు మారియన్ ప్లాట్జ్ వద్ద వాళ్ళు నిలబడి ఉన్నారు ఆ నగర శోభలని ఆనందిస్తూ.

ఎక్కడ చూసినా క్రిస్మస్ కళ కనిపిస్తూ ఉంది . బాగా అలంకరించిన క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ తాత బొమ్మలు, ఈ సమయంలోనే ప్రత్యేకంగా వచ్చే ఎన్నో రకాల చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇంకా ఎన్నెన్నో... విశేషాలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది.
ఈ క్రిస్మస్ మార్కెట్లో.. చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి.
చిన్ని చిన్ని కొట్లలో బొమ్మలు, ఊలుతో తయారు చేసిన దుస్తులు, చాక్లెట్ పూత పూసిన పండ్లు, ఇంకా మామూలు శాండ్ విచ్ లాంటి తిండి పదార్థాలు అమ్ముతూ ఉన్నారు. మన వూరి తిరనాళ్ళ సంత లా ఉంది మార్కెట్టు.
అన్నిటికంటే ప్రత్యేకమైన ఐటెం .. ఇప్పుడు మన కథ లోని పాత్రలు ప్రత్యేకంగా వెళ్ళేది దేనికోసం అంటే.. అదే Glühwein (గ్లూ వైన్).
బాగా మంచు పడుతోంది. వాతావరణం చాలా చలిగా ఉంది.
"ఈ సమయంలో వేడి వేడిగా Glühwein తాగితే దాని మజా వేరు" చెప్పారు మధుర. "అసలు వైన్ వేడి వేడిగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా.. అదే మరి దీని ప్రత్యేకత. ఈ వైన్ ని ఈ పండగప్పుడు మాత్రమే తాగుతారు".
దగ్గరలోనే ఉన్న ఒక చిన్న స్టాలు దగ్గిరికి నడిచారు వాళ్ళు.
ఈ వైన్ ని అమ్మే స్టాల్లో అప్పటికప్పుడు తయారు వైన్ చేసి కప్పుల్లో పోసి ఇస్తూ ఉన్నాడు షాపతను.
ఒక చిన్న సైజు గంగాళం లాంటి దాంట్లో రెడ్ వైన్ పోసి సన్నని మంట మీద వేడి చేసి, కాస్త వేడి అయ్యాక అందులో చక్కరతో పాటుమసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మనం బిర్యానిలో వేసే జాజి పువ్వు, లాంటివి వేసి ఇంకాసేపు మరిగిస్తూ ఉంటె అవి ఓ లాంటి మత్తు వాసన లని వెదజల్లుతూ సుమధురం గా మంచు లో తేలి పోతోన్నాయి.
అలాగే నారింజ పండు, నిమ్మ కాయలని తొక్కతో పాటే ముక్కలుగా కోసి అవి కూడా . కొంచెం tangy flavor రావడానికన్నట్టు వేశాడా షాపతడు.
బాగా వేడి చేసాక వేడి వేడి పొగలు కక్కుతున్న Glühwein ని కప్పులో పోసి బులుసు వారికి అందించాడు ఆ షాపతను.
"ఇక్కడి ఈ షాపు బయట ఈ గ్లూ వైన్ తాగుతూంటే, మా ఏలూరు లో టీ కొట్లో నిలబడి చాయ్ తాగుతున్నట్టు ఉందమ్మాయ్, మధురా " చెప్పారు బులుసు వారు ఆ వేడి వేడి వైన్ కప్పుని చేతులతో కప్పు కుని దాని వేడిని ఫీలవుతూ, మరో చేత్తో పైపు కొనసాగిస్తూ.
"బుజ్జి పండూ నీకోసం నాకోసం, రాజీ వారి కోసం కిండర్ పంచ్ ఇదిగో " చెప్పారు మధుర. "Kinder-punsch అచ్చం Glühwein లాగానే చేస్తారు.. కాకపోతే ఇందులో వైన్ కి బదులుగా ఆపిల్ రసం కానీ, ద్రాక్ష రసం గానీ వేసి చేస్తారు. kinder-punsch అంటే Child-punch అన్నమాట! అలా అని పిల్లల కోసం మాత్రమే అనుకునేరు రాజీ గారు, .. మనం కూడా తాగొచ్చు అన్నమాట. కాకపోతే.. పిల్లలు కూడా తాగగలిగింది అన్నమాట "

"రుచి మరీ గొప్పగా ఉంది మధురా " .. ఆ చలిలో.. వేడి వేడిగా.. తీయ తీయగా.. స్పైసీ గా వెరయిటీ గా ఉన్న ఆ కిండర్ పంచ్ ని సిప్ చేస్తూ చెప్పారు రాజీ గారు "మధురా, మా హైదరాబాదీ ఈరానీ చాయ్ కొట్టు వాడు ఇక్కడ ఒక షాప్ పెడితే ఇక వాడు మల్టీ మిలినర్ అయి పోతాడు సుమా " అన్నారు రాజీ వారు.
"Totaal lecker frau madhuraa" చెప్పాడు బుజ్జి పండు కిండర్ పంచ్ ఆస్వాదిస్తూ.
"మన అందరి కోసం ఇక్కడ బాదం పప్పులకి చక్కర పూత వేసి.. వేయించి నవి కూడా కొన్నా నండీ" చెప్పారు మధుర.
"అమ్మాయ్ మధురా, నీ అతిధి సత్కారం మంచి పువ్వుల మధురం మధురాతి మధురం " బులుసు వారు గ్లూ వైన్ టెష్టు చేస్తూ మెచ్చు కున్నారు.
ఆ వాల్టి ఆ మధురమైన సాయంత్రాన్ని మరీ శోభాయమానం గావిస్తూ మంచు పువ్వులు మధుర బ్లాగ్ టెంప్లేట్ పువ్వుల్లా ముసి ముసి నవ్వులతో, మ్యూనిక్ నగరాన్ని ముద్దెట్టుకుని తమ సంతోషాన్ని తెలియ జేసేయి.
*****
మరు సటి రోజే బలుసు వారి పారీసు పయాణం, రాజీ వారి హైదరాబాదు పయనం, బుజ్జి పండు అమెరికా ఫ్లైటు.
మధుర బేలగా ముఖం పెట్టి ఉంది.
"ఫ్రౌ మధురా, ఏమిటి మీరు మరీ మౌనం గా ఉన్నారు" అడిగాడు బుజ్జి పండు.
"అవును బుజ్జీ. బులుసు వారు పారీసు వెళ్లి పోతున్నారు. రాజీ వారు హైదరాబాదు వెళ్లి పోతున్నారు. నువ్వేమో మరి అమెరికా వెళ్లి పోతున్నావు. అందుకే " చెప్పింది మధుర.
"అదేమిటమ్మాయ్, అలా బేల పడి పోతావు. శ్రీ కృష్ణుల వారు నీ చెంతనే వుండగా అంత బేల తనమెందుకు ?" రాజి గారు బుజ్జగించారు మధురని.
"అవును రాజి గారు మీరు చెప్పింది నిజం" మధుర ఆనంద భాష్ఫాలని తుడుచు కుంటూ చెప్పింది.
శ్రీ కృష్ణుల వారు మళ్ళీ ప్రత్యక్ష మైయ్యారు.
అక్కడ ఉన్న అందరూ మాయమై ఫ్రాన్క్ఫర్టు మెయిన్ స్టేషన్ లో ప్రత్యక్ష మైయ్యారు.
బులుసు వారి టీ జీ వీ పారీసు ట్రైను కూత పెట్ట కుండానే నిశ్శబ్దం గా ఫ్రాన్కుఫర్టు హాఫ్భాన్ హాఫ్ స్టేషన్ వదిలి పెట్టింది. రాజీ, మధురా, బుజ్జి పండు చెయ్యి ఊపారు బాయ్ బాయ్ అంటూ బులుసు వారికి.
బులుసు వారి కళ్ళు చెమేర్చేయి..
ఏమిటీ అనుబంధాలు బ్లాగ్ బంధాలు? . ఎక్కడి వాళ్ళం ఎక్కడి వాళ్ళం అంతా ఈ పంచ దశ లోకం లో మిత్రులమై బ్లాగ్ బంధువుల మై ఈ మైత్రీ బంధాలు గల వారం అనుకున్నారు వారు.
శ్రీ కృష్ణుల వారు చక్రం తిప్పారు. రాజీ వారు జర్మనీ నగరం నించి మాయమై హైదరాబాదు లో వున్నారు !
"చ్యూస్, బిస్ స్పాటర్ " మధుర బుజ్జి పండు కి బాయ్ బాయ్ చెప్పింది.
(బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం ఇంతటి తో సమాప్తం )
*****
బుజ్జి పండు ఫ్రాన్కుఫర్టు ఏర్పోర్టు లో ట్రాన్సిట్ ఏరియా లో ప్రత్యక్షమై , అమెరికా ఫ్లైటు లో నింపాదిగా కాలు పెట్టాడు.
తన సీటు కి వెళ్లి కూర్చుంటూ తల తిప్పి చూసాడు పక్క వున్న దెవరా అని.
"ఆయుష్మాన్ భవ బుజ్జి పండూ, నన్ను చిర్రావూరి భాస్కర శర్మ అంటారు " చెప్పారు పక్క సీటు పెద్దాయన.
"అంతా విష్ణు మాయ బుజ్జి పండూ " చెప్పారు కష్టే ఫలే శర్మ గారు.
(ఇంకా ఉంది)

"నమస్కారం తాతయ్య గారు !!! " బుజ్జి పండు ఆశ్చర్య పోతూ "మాచనవఝుల వేంకట దీక్షితులు గారూ... మీరేనా. మీరేలా ఇక్కడ ప్రత్యక్షం ?" అడిగాడు బుజ్జి పండు!
"అంతా విష్ణు మాయ బుజ్జి పండూ " చెప్పారు కష్టే ఫలే శర్మ గారు.
(ఇంకా ఉంది)