మీరేం చేస్తున్టారండీ అన్నా రా మధ్య ఒకరు.
వంట చేస్తున్టానండీ అన్నా.
అది సరేలే నండీ , అది తప్పించి వేరే ఏమైనా వ్యాపకం ఉందా అన్నారు వారు.
వుందండీ, పనిలేక కాలక్షేపం ఖబుర్లు లాంటివి చదువుతూ ఉంటా నండీ అన్నా.
ఎక్కడండీ సాక్షి లో నా జ్యోతి లో నా అడిగారు వారు.
అబ్బే బ్లాగ్ లోకం నండీ అన్నా.
అంటే అడిగారు వారు.
అదండీ అంతర్జాలం అని ఒకటి వుందండీ అందులో చాలా బాగ రాస్తున్టారండీ అందరూ అవన్నీ అప్పుడప్పుడు చదువుతూ ఉంటా అన్నా
చదివి ఎం చేస్తారండీ ? అడిగారావిడ.
చదివి నచ్చితే కామెంటు కొడ తా నండీ అన్నా.
అదేమిటండీ నచ్చితే కొడత నంటారు అని అడిగారు వారు.
నచ్చక పోయినా కొడుతూ వుంటారండీ అన్నా.
అయ్య బాబోయ్ రాసేవాడు చదివే వాడికి లోకువని చెప్పండి అట్లయితే అన్నారావిడ.
అవునేమో కదా ఇక్కడ బక్కెట్టు బోర్లా పడిందే చెప్మా అనుకున్నా !
చీర్స్
జిలేబి.
సరదాగుంది...
ReplyDeleteహ హా...బోర్లా పడ్డ బకెట్ మీద నచ్చి ఇంకోటి కొడ్తే సరి...;)
ఎలా అయినా దెబ్బలు తప్పవంటారు. అంతేనా?
ReplyDeletemeru bale rastarandi...
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteకం. విపరీతంగా చదవా
ReplyDeleteలపుడప్పుడు తోచినట్లు వ్యాఖ్యానించా
లపుడప్పుడు మౌనాన్నీ
ఉపయోగించాలి తెలివి యొప్ప జిలేబీ.
............... (జిలేబీ శతకం)
కొసమెరుపు: బంధువులింట్లోంచి వ్రాస్తున్నాను. పవర్ కనక్షన్ ఎర్తింగ్ సరిగా లేనట్లుంది. నేను బ్లాగ్లలో కామెంట్లు కొట్టటం అటుంచి నా లాప్-టాప్ కాస్తా షాక్ కొడుతోంది.
చిన్ని ఆశ గారు,
ReplyDeleteమీ 'చిన్ని' ఆశ కి నాకు బెరుకు పుడుతోందండోయ్!!
చీర్స్
జిలేబి.
కష్టే ఫలే వారు,
ReplyDeleteఅంతే ! అంతే!
కష్టే , వినా కష్టే, ఫలే కామెంటు రాయి దెబ్బః అని వూరికే అన్నారా !!
చీర్స్
జిలేబి.
సాయి గారు,
ReplyDeleteనెనర్లు. సరదాకి అంతే !
అప్పుడప్పుడు ఎ మేటరు లేకుంటే ఇలా రాస్తూ వుంటా నన్న మాట !
( ఈ లా అంటే మా బులుసు వారు వచ్చి, జిలేబీ మీ టపాలలో ఎప్పుడు మేటరు వుండింది? అని అడిగినా అడుగుతారు !!!)
చీర్స్
జిలేబి.
శ్యామలీయం వారు,
ReplyDeleteమౌనాన్ని వహించినా , కీబోర్డు మీద టాప టాప వాయించ కూడదని చెప్పలేదు గా మీరు !!
కరెంటు వాడి ప్రభావం కాదండీ మీ లాపు టాపు షాక్ కొట్టడం, అది జిలేబీ షాక్ ! (అబ్బ స్వకుచ మర్దనం అనుకో కుంటే !))
నెనర్లు. ఇవ్వాళ శతక భాగాల వేటలో పడతాను. వేటగాడు లా , వేటూరి అన్న మాట !
చీర్స్
జిలేబి.