Monday, January 30, 2012

పరుగు ఆపడం ఒక కళ

మానేజ్మెంట్ గురువులు, మానసిక శాస్త్ర నిపుణులు చెప్పే సులువైన మాట - పరుగు ఆపడం ఒక కళ.

అసలు పరుగు లో వున్న వాడు పరుగు ఆప గలడా అని ?

పరుగంటేనే డైన మిజం. అంటే ఎల్ల వేళలా పరిణితి. అట్లాంటి నాన్-స్టాటిక్ డై మేన్షన్ లో వున్న వాడు పరుగు ఆపాడంటే వాడు స్టాటిక్ స్టేట్ కి రావాలి.

స్టాటిక్ కరెంట్ షాక్  మనం అప్పుడప్పుడు చవి చూస్తూంటాం. సో, స్టాటిక్ స్టేట్ లోనూ కొంత పాటి డై న మిజం వుంది. అంటే సకల చరమూ ఆచరమైనా అందులో రవ్వంత చరత్వం ఉంటుందను కుంటాను.

సో, చరాచర సృష్టి అన్నది ఆచరత్వం, చరత్వం కాని దాని నించి వచ్చిందని చెప్పటం లో కొంత సూక్ష్మం  వున్నట్టు ఉంది.

ఆచరమైనంత మాత్రాన చరం గొప్పదని కాదు. అట్లాగే చరమైనంత మాత్రాన అచరం గొప్పదని కాదు.

దీంట్లో ని మర్మ మెరిగి, చర అచర లో దేనిని ఎ పద్ధతి లో ఉపయోగించు కోవాలో అన్న దానిని గ్రహిస్తే ఓ మోస్తరు జీవితం సాఫీ అని భావిస్తాను.

కాకబొతే ఈ చర అచర ల లో ఏది ఎప్పుడు ఉపయోగించాలి అన్నది మాత్రం ప్రతి ఒక్కరి అనుభూతి కి , వారి వారి ప్రయత్నాలకి లోబడి ఉంటుందను కుంటాను.

అచర స్థితి లో ఉండి చర మార్గాన్ని కర్మ సిద్దాంతం గా చేసి చూపించిన ఓ మరిచి పోతూన్న 'గాంధీ' కి నివాళు లతో !

జిలేబి.

8 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. స్టాటిక్ కరెంట్ షాక్ లో కొంతపాటి డైనమిజం ఉందన్నారు.దానిగురించి నాకు సరిగా తెలియదు!

    ఈ మధ్య చలి కారణంగా ఉలెన్ స్వెటర్ వేసుకొని తిరుగుతున్నాను. దానితో షాకులే షాకులు నాకూ, నన్ను పొరబాటున యెవరైనా తగిలారా వాళ్ళకూ.

    దీని మీద కందపద్యం వ్రాస్తే అది కాస్తా మీకు ఫెడేల్మని షాక్కొడుతుందేమోనని మానేసా!

    ReplyDelete
  3. sarma గారు,

    నెనర్లు.

    జిలేబి.

    ReplyDelete
  4. శ్యామలీయం మాష్టారు,


    జిలేబి షాక్ ప్రూఫ్ !

    కాబట్టి మీరు కంద కామెంటు నిరభ్యంతరం గా వేయ వచ్చు !

    ఇప్పటి కి కౌంటు రెండు పదులు అయినాయి !

    మీదే ఆలస్యం !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  5. కం. చరమచరంబుల బేధము
    చరమచరంబులకు మధ్య సామ్యంబును ఆ
    చరమున కచరంబునకును
    నెరవగు తత్వమును గూర్చి నేర్పు జిలేబీ

    కం. వినుడని ఘన తత్వంబును
    కనుడని సూక్ష్మంబు తెలిసి గాంధీ రీతిన్
    మనుడని కర్మిష్ఠులరై
    జనులకు నెలుగెత్తి చాట జాలు జిలేబీ

    కం. నరులార చరాచరముల
    చరాచరేతరపరమవిషయతత్వములన్
    పరుగాపి పట్టుకొమ్మని
    మరిమరి బోధించు చుండె మనకు జిలేబీ

    ReplyDelete
  6. శ్యామలీయం వారు,

    నెనర్లు.

    చరాచరేతరపరమవిషయతత్వములన్
    కడు రమ్యమైన కందము న జెప్పుట
    ఔరా , వీరి సూక్ష్మత పద బంధమున
    అనుబంధమై ఆ పరంధాముని తలపించె!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. >>>కాకబొతే ఈ చర అచర ల లో ఏది ఎప్పుడు ఉపయోగించాలి అన్నది మాత్రం ప్రతి ఒక్కరి అనుభూతి కి , వారి వారి ప్రయత్నాలకి లోబడి ఉంటుందను కుంటాను.

    లెస్స బలికితిరి జిలేబిగారూ..

    ReplyDelete
  8. @జ్యోతిర్మయీ గారు,

    నెనర్లు మీకు నచ్చినందులకు !

    జ్యోతి మయం సర్వత్ర !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete