ఆచంగ గారి ప్రశ్నలు - జిలేబీ జవాబులు !
1. మగాడు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఆడువారికి సమ్మతమేనా?
తెగేసి నో. మా రాజ్యం లో tresspassers are liable to be prosecuted !
కాదూ, కూడదు, చెయ్యాలని ఆరాట పడితే సమ్మతం. Not instead of ఉద్యోగం but together with outside ఉద్యోగం ఇంట్లో పిల్ల లని చూసుకునే సద్యోగం కూడాను. (ఒకటి చేస్తే ఇంకోటి ఫ్రీ అన్న మాట !)
2. ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే.
అబ్బాయ్, చేసుకున్న వారికి చేసుకున్నంత! ఆ మినహాయింపులు మా జన్మహక్కు! ఆలాంటి అవకాశం అందరికీ రాదు. Its reserved for 50 percent category only! ఈ రీజేర్వషన్ కావాలని ఆశ పడితే మా కొండ దేవరని చాలా తీవ్రం గా ప్రార్థించ వలె మరు జన్మ లో నైనా ఆడ జన్మ గా పుట్టించు స్వామీ అని. ఫో, నీ తంటాలు పడు అని మా కొండ దేవర ఒకింత కరుణ చూపితే, గీపితే, ఆ పై ఆడ జన్మ లభ్యమై తే, ఈ సౌకర్యాలు తో బాటు కొన్ని కష్ట నష్టాలు ఫ్రీ గా వచ్చును! వాటిని భరించ వలసి ఉండును!!!
3. తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు. అలాంటప్పుడు మగాడే స్త్రీ రక్షణ, పోషణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆడువారు పిల్లల పెంపకం చూసుకోవటానికి వచ్చిన బాధేమిటి?
నిన్ననే రాసాను - ఈ తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు విషయం పై:
స్త్రీ వాది సంఘం జరిపిన కలియుగ
'పుత్రికామేష్టి' యాగ విచిత్రము జూతము రారె!
ఈ యాగ మహత్వము వశమున
భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమాయెనే!
ఆయ్, మగాడే స్త్రీ రక్షణ , బాధ్యతలు తీసుకోవాలి. మేము మా జంబు వారిని కాఫీ ఆర్డర్ ఇచ్చి బుట్ట బొమ్మ గా కూర్చుంటాము! అంతే. మా టేబల్ కి కాఫీ రావలె. ఆడు వారు పిల్ల ల పెంపకం అనగా, అయ్యవారు, పిల్లలని బాగుగా తయారు చేసి , జిలేబీ, అబ్బాయి , అమ్మాయి రెడీ అనగా వెంట నే వారిని షికారు కి తీసుకుని వెళ్లి , 'వారిని చూడండి , ఎంత ముద్దుగా పిల్లలని రెడీ చేసి షికారు కి తీసుకెళ్తున్నారో !' అని క్రెడిట్ కొట్టెయ్యడం మా గట్టి దనం!
4. ఒక ఆడది ఏడాదికి పాతిక లక్షలు సంపాదించగలిగినప్పుడు, యాభై లక్షలు సంపాదించే ప్రేమించనివాడిని చేసుకోవటమెందుకు? పనీపాటా లేకుండా ప్రేమించటమే పనిగా పెట్టుకున్నవాడినికి ఒకణ్ణి చేసుకోవచ్చుగా?
అబ్బాయి, పాత కాలం లో వున్నట్టున్నావ్. డబ్బెవరికి చేదు పిచ్చోడా అని జంధ్యాల గారి చిత్రం లో అనుకుంటా ఒక పాట వుంది. కావున... పాతిక లక్షలు వున్నా యాభై పై కన్నులు వెయ్యడం (eye throwing) అనునది ఆడువారి సహజ నైజం ! ఒక కిలో బంగారం కన్నా రెండు కిలోల బంగారం ఎక్కువ అన్నది చాలా సింపల్ మాథ మే ట్రిక్ !!
5. సాధించి చట్లో పెడుతున్నది అత్తా-ఆడపడుచులైనప్పుడు దానికి మగాడిని పూర్తిగా బాధ్యుడిని చెయ్యటం ఎంతవరకూ సబబు? అత్తలు, ఆడపడుచులూ ఆడువారేకదా!
మానేజ్మెంటు ఫండా ప్రకారం ప్రతి వ్రతం తప్పిన ప్రాజెక్టు కి ఒక scapegoat (తెలుగు లో బకరా అందురు) ఉండవలె. ఆ ప్రకారంబు గా...,
7. మగాడి తన్నుల గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు ఆడువారి సణుగుడు గురించి అసలు బయటకు రాదెందుకు? (సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది).
సణుగుడు సైలంటు రెవల్యూషన్! తన్నులు పోలీసు జులుం. రెండిటి కి వున్న వ్యత్యాసం అది ! మీడియా వాడికి మసాలా కావాలి. సైలెంటు వాడికి నప్పుదు!
చీర్స్
జిలేబి.