यहाँ हाट हाट जिलेबी मिलेगी
ఆల్ఫ్ పర్వత శ్రేణులలో హిమవత్పర్వతం లా ధవళ కాంతులతో విరజిల్లుతోన్న యంగ్ ఫ్రౌ పర్వత పరిసర ప్రాంతలో
ఒక ఇండియన్ హోటలు బయట పెద్ద బోర్డు పెట్ట బడి ఉంది.
డిసెంబరు నెల చలి వణికిస్తోంది. చలికాలం కావడం తో ఇండియా నించి ఊడి పడే స్విస్సు యాత్రికులు అస్సలు ఎవ్వరూ లేరు.
కౌంటరు ముందు కూర్చుని చలికి వణుకుతూ శివ శివా అని స్మరణ చేస్తున్న జమ్బూనాధాన్ కృష్ణ స్వామీ అయ్యరు ట్రింగ్ ట్రింగ్ అంటూ పాత కాలపు ఫోను రింగు అవటం తో ఫోను రిసీవరు తీసి 'హలో' అన్నారు.
ఆ వైపు వున్న ఆసామి 'నేను హంగేరీ నించి మాట్లాడుతున్నా. జిలేబీ గారున్నారండీ ' అన్నాడు వచ్చీ రాని హిందీ అక్సెంటు లో.
"జిలేబీ నీ కోసం ఎవరో ఫోన్ హంగేరి నించి " అని జంబూ వారూ లోపలి కేక పెట్టి మళ్ళీ శివ శివా అంటూ నామ జపం లో పడ్డారు. అప్పటి దాకా ఆ రోజు వెయ్యాల్సిన జిలేబీలకి పిండి కార్య క్రమం లో వున్న , కస్సు బస్సు మంటున్న జిలేబీ , హమ్మయ్య ఈ పిండి రుబ్బే కార్యక్రమం కట్ట బెట్టి ఫోన్ లో టైం పాస్స్ చెయ్యొచ్చు అని సంతోష పడి పోయి, "ఇదిగో అయ్యరు వాళ్ - ఈ పిండి కార్యక్రమం చూడండీ " అని వారికి పని పురమాయించి ఫోన్ దగ్గరికి వెళ్ళింది జిలేబీ.
అయ్యరు గారు, శివ శివ అంటూ "ఈ జిలేబీ తో వచ్చిన చిక్కే ఇది, ఫోన్ వచ్చిమ్దనో, అదనో ఇదనో ఏదో ఒక నెపం తో మనకి పని పెట్ట కుండా వుండదు సుమా " అని గొణుక్కుంటూ సణుక్కుంటూ పిండి కార్యక్రమాన్ని చూడడానికి లోనికి వెళ్ళారు.
జిలేబీ ఫోన్ దగ్గరికి వచ్చి తీరిగ్గా ఓ గంట సేపు మాట్లాడింది. ఆవిడ గంట సేపు మాట్లాడిన సమాచారం ఏమిటంటే -
ఈ హంగేరీ ఆసామీ ఆయుర్వేద ఇన్స్టిట్యుట్ నడుపుతున్న హంగేరీ ఆసామి. ఈతను అప్పుడెప్పుడో యంగ్ ఫ్రౌ మౌంటైన్ కి వచ్చిన సమయం లో ఈ ఇండియన్ హోటలు కి వచ్చినాడు. జిలేబీ తో పరిచయం అప్పుడే. ఈ మధ్య ఆ హంగేరీ ఆసామీ ఆయుర్వేదా రిసెర్చ్ చేస్తూ 'పరహిత వైద్యం ' గురించి చదివాడట చూచాయిగా. అందుకని తన కేమైనా దీని గురించి తెలుసా , ఆ విషయమై ఎవరైనా హంగేరీ వచ్చి లెక్చర్ ఇవ్వగలరా అని కనుక్కోవడానికి ఫోను చేసాడు.
జిలేబీ మరీ ఖుషీ అయి పోయింది. తనకు తెలియని విషయం అని ఏదైనా ఈ లోకం లో ఉందా ? ఆయ్ అని 'ఓ బ్రహ్మాండం గా తెలుసు, ఓ పెద్దాయన పరహిత వైద్యం గురించి రాసారు. శర్మ గారని. వారిని పిలుద్దాం ' అని హంగేరీ వాడికి , కష్టే ఫలే శర్మ అనబడు మాచన వఝుల వేంకట దీక్షితులు గారైన చిర్రావూరి భాస్కర శర్మ గారికి మధ్య అటు వైపు ఒక ఫోను, ఇటు వైపు ఒక ఫోను మాట్లాడి, మొత్తం మీద శర్మ గారు హంగేరీ వచ్చేటట్టు ఒప్పించి 'హుష్' ఎంత కష్ట పడి పోయాను సుమా అని నీరస పడి పోయి, హైరాన్ పడి, మళ్ళీ ఒక మారు 'అయ్యరువాళ్' ఒక మంచి కాఫీ పట్టుకు రండీ అని జంబూ అయ్యరు గారిని పనికి పురమాయించింది జిలేబీ.
'ఈ జిలేబీ కి అందరికీ పని కట్ట బెట్ట కుంటే పొద్దే గడవదు సుమా ' అని మళ్ళీ గొణుక్కుంటూ అయ్యరు గారు ఫిల్టరు కాఫీ ప్రయత్నం లో పడ్డారీ మారు.
(ఇంకా ఉంది)
చలిగా ఉందండీ బాబూ.....
ReplyDeleteకూల్ కూల్ స్విస్ పర్వతాల్లో హాట్ హాట్ జిలేబి బావుందండీ...
ReplyDeleteజిలేబీగారూ, మీ బుజ్జిపండు కథ నంతా ఒకసారి జాగ్రత్తగా చదవాలండోయ్. మీరు కాస్తా నన్ను గేటు కీపరుగా రిటైరు చేసి యే కందసామినో చేసెయ్యలేదు కదా కొంప దీసి. మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న మాట. ఒళ్ళు మండితే రుబ్బురోట్లో వేసెయ్యగలరు!
ReplyDeleteఓహొ! జిలేబీ విజయ రహస్యం పిల్టర్ కాఫీ నా !? మరి మేము పిల్టర్ కాఫీ నే ఎల్లప్పుడు ఆస్వాదించేదిమే! కానీ.. మాకు ఇలాటి ఆలోచనలు రావు సుమీ!! జిలేబి మీ బుర్ర పాదరసంలా ఉండు రహస్యమేమో.. చెప్పకూడదూ!?
ReplyDelete@కష్టే ఫలే శర్మ గారు,
ReplyDeleteవిపరతీమైన చలి అండి! ఇక చలో హంగేరీయం !!!
నెనర్లు, సహృదయం తో మీరు ఈ కథలో పాత్ర వహిస్తున్నందులకు !!
చీర్స్
జిలేబి.
@జ్యోతిర్మయీ గారు,
ReplyDeleteధన్యవాదాలు! స్విస్సు చాకోలేటు ఆన్ ది వే ఎలా అని ఇప్పుడు కథకి ఇక మార్గం కనిబెట్టాలి!!
చీర్స్
జిలేబి.
@శ్యామలీయం మాష్టారు,
ReplyDeleteనెనర్లు మీరు పూర్తి కథ ని చదువుతామని అనుకున్నందులకు!
ఇక మీరు "శ్రీ కంద మహాస్వామీ" వారు ! శతకానికి అతి దగ్గిరలో ఉన్నారు !!
చీర్స్
జిలేబి.
@వనజ వనమాలీ గారు,
ReplyDeleteసరిగ్గా కనిబెట్టేశారు!
కాని ఒట్టి ఫిల్టరు కాఫీ కాదండోయ్, మా జంబూ అయ్యారు వారి చేయి తిరిగిన ఫిల్టర్ కాఫీ ! అదీ వారి మేజిక్ !!
(ఇక నా మాజిక్ అంటారా, అట్లా పని బెట్టేసి ఇట్లా వారిని ఉబ్బెస్తో వుంటే వారూ మరీ పని కష్టాలు మరిచి పోయి మళ్ళీ జిలేబీ రూటు లోకి వచ్చేస్తారు పని చెయ్యడానికి !)
నెనర్లు
చీర్స్
జిలేబి.
కం. శివ శివ యనుచును కాఫీ
ReplyDeleteనెవరైనను చేయునెడల నీశ్వరకృపచే
నవలీలగ నమృతంబగు
చవితో లోకంబు లేల జాలు జిలేబీ.
కం. నీరసపడితే మంచి హు
షారిచ్చే పొగలసెగల చక్కని కాఫీ
సారందీయగ హాయిగ
ఊరికి పను లప్పగించుండు జిలేబీ
sorry for the Typo. సరిజేసాకః
ReplyDeleteఊరికి పను లప్పగించు చుండు జిలేబీ
@శ్యామలీయం వారు,
ReplyDeleteముచ్చట గా ఇక మూడు ముత్యములే శతానికి ! శతకం లో వంద లేక వంద ఎనిమిదా?
జిలేబి.
కం. ఇన్నని నియమము గలదా
ReplyDeleteయెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ.