నయనతారానందం
భూనభో బాలకృష్ణ నాగేశ్వరుల
తో బాపు రమణీయ
నవ్య దృశ్య కావ్యం
భవ్య ఇళయ హంగేరీయం, జొన్నవిత్తుల
విరచిత గీతాలాస్యం, సాయి సినీ లోక భవి
ష్యత్తు వెలుగుల లో ప్ర
తిష్టాపితం
బాపు రే రమణీయం - శ్రీ రామ రాజ్యం !
చీర్స్
జిలేబి.
భూనభో బాలకృష్ణ నాగేశ్వరుల
తో బాపు రమణీయ
నవ్య దృశ్య కావ్యం
భవ్య ఇళయ హంగేరీయం, జొన్నవిత్తుల
విరచిత గీతాలాస్యం, సాయి సినీ లోక భవి
ష్యత్తు వెలుగుల లో ప్ర
తిష్టాపితం
బాపు రే రమణీయం - శ్రీ రామ రాజ్యం !
చీర్స్
జిలేబి.
నిజమేనండి నభూతో నభష్యతి.
ReplyDeleteఈ సినిమా మీద ఎన్నో సమీక్షలండీ.ఇప్పటి వరకు ఎప్పుడూ ఏ సినిమా ఇన్ని సమీక్షలకి నోచుకుని ఉండదు.అందరూ ఎన్నో రాసారు.మీరేమో చక్కగా కట్టె కొట్టె తెచ్చె అనేసారు.బాగుందండి.నేను కూడా ఈ రోజు చూసేద్దామని వెళ్తున్నాను.చీర్స్ చెప్పేయండి మరి :)
ReplyDelete@భారారె
ReplyDeleteన భూతో న పశ్యతి
న భూతో న భవిష్యతి !
@సుభ
చీర్స్ చెప్పేసాను, వెంటనే వెళ్ళండి, శ్రీ రస్తు, శుభమస్తు, సర్వ మంగళాని భవంతు ! శ్రీ రామ కరుణా కతాక్ష
చీర్స్ చెప్పేసాను, వెంటనే వెళ్ళండి, శ్రీ రస్తు, శుభమస్తు, సర్వ మంగళాని భవంతు ! శ్రీ రామ కరుణా కటాక్ష ప్రాప్తి రస్తు !
ReplyDeleteశ్రీ బాపు రమణీయంగా సృష్టించిన శ్రీరామరాజ్యం ఎన్ని సార్లు చూసిన తనివితీరదు. ప్రతి దృశ్యం నయనానందం !! చిత్రమంత చక్కగా చెప్పిన మీకు ధన్యవాదాలు .
ReplyDeleteనా జీవితంలో ఒక సినిమాని మూడురోజులు వరసగా థియేటర్లో చూట్టం ఈ సినిమాతోనే జరిగింది. మూడోసారి కూడా నాకు టైము తెలీకుండా సినిమాలో లీనమైపోగలిగాను. మొదటిసారి చూసినప్పుడు కనిపించిన చిన్న లోపాలు రెండోసారినుంచి కనిపించడం మానేశాయి. ఏమో.. నాకు రామాయణమంటే, బాపూరమణలంటే, ఇళయరాజా అంటే ఉన్న ప్రేమ దానికి కారణం కావచ్చేమో...
ReplyDelete@ అప్పారావు(సురేఖ) గారు,
ReplyDeleteనెనర్లు. బాపోరేఖానందం కూడానూ !
@ నాగమురళీ గారు,
చాలా బాగా చెప్పారు. ఎన్ని మారులైనా చూడవచ్చు. మాయా బజార్ లా ఈ చిత్రమూ ఎవెర్ గ్రీన్ అవుతుందేమో చూడాలి. ! భవిష్యత్తోపనిషత్ తెలిసుంటే బాగుండు !
చీర్స్
జిలెబి.
మీరిలా చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా! పల్లెటూరికీ సినిమా అప్పుడే రాదు. పట్నం వెళ్ళి చూసే వోపిక లేదు. ఎలా?
ReplyDeletegood writing
ReplyDeleteసీతా రామయ్యగారి మనవరాలి తరువాత వరుసగ మూడు రోజులు ఈ సినేమాను చూశాను. మొదటి సారి కన్నా రేండో సారి మూడవసారి చూసినపుడు సినేమా బాగుంది. సీతా రాముల కథ మీద చాలా రోజుల తరువాత వచ్చిన సినేమా కనుక మొదట్లో వారి ప్రేమను ఎస్టాబ్లిష్ చేసేందుకు కనీసం ఒకటి రేండు సీన్స్ ఉంటే ప్రేక్షకులు మరింత కనేక్ట్ అయ్యేవారేమోఅని పిచ్చింది. అదీ కాకా సినేమా చాలా తొందరగా అయిపోయినట్లు ఉంట్టుంది. ఎక్కడ ఒక్క అదనపు అనవసర సన్నివేశం ఉన్నట్లు అనిపించదు.
ReplyDeletesarmaji,
ReplyDeleteసాయి,బాపు గార్లతో ఇప్పుడే మాట్లాడా. రామరాజ్యం గ్రామాలలో ఇంకా సురక్షితం గా ఉంది కాబట్టి కొంచం లేటాలాస్యం గా చిత్రం మీ గ్రామం లో విడుదల చెయ్యాలని మొదట అనుకున్నారట. కాని, మీ కోరికని మన్నించి వెంటనే అన్ని గ్రామలకీ బాక్సులని పంపిస్తున్నారహో !
చీర్స్
జిలేబి.
పల్లా కొండల రావు గారికి
ReplyDeleteనెనర్లు .
Mr. Unknown!
కొంత కాలం తరువాత Director's ఛాయస్ అని మరో వెర్షన్ రావచ్చేమో ఈ చిత్రానికి. అప్పుడు మీరు కోరిన వి ఆ వెర్షన్ లో ఉండవచ్చు. నెనర్లు !
వాల్మీకి పురాతన కాలం లో వేల కొలది శ్లోకాలతో రామాయణాన్ని అందించారు. వాటిని పూర్తి గా మనలో చాలా తక్కువ మందే చదివి ఉంటారు. ఎక్కువగా మనకు తెలిసిన రామాయణం శ్రుతం, హరికథ ల ద్వారానో, పుస్తకాలలో చిన్ని వెర్షన్ ల ద్వారానో, కాకుంటే హిందీ సీరియల్ రామాయణ్ ద్వారానో. కాబట్టి మన ఇమేజినేషన్ పరి పరి విధాల ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ ఉండవచ్చు. ఉదాహరణకి జిలేబి , జమబలకడి పంబ లో జగదానంద తారక స్విజ్జేర్లాండు లో హిమవత్పర్వతముల వద్ద ఒక సీన్ గా ఉండి ఉండవచ్చు లాంటివి. !
కామేన్టిన అందరికీ నెనర్లు.
చిత్రం బాపురే చిత్రం భళారే విచిత్రం !
బ్లాగ్ లోకం లో ఈ చిత్రం పై ఇన్ని టపాలు , వంద ల కొద్దీ కామెంటులు!
ఈ మధ్య కాలం లో నాకు తెలిసి ఒక చిత్రం మీద తెలుగు బ్లాగ్లోకం లో ఇన్ని టపాలు రావడం ఈ చిత్రం మీద మనకున్న expectation ని చూపెడుతోంది. అంతే గాక బాపూ రమణల మీద , చిత్రం లో తారా గణం మీద మనకున్న అభిప్రాయాలు , వాటికి ఈ చిత్రం లో వారి వేరైన నటన అన్నీ కలగలపి ఈ తపాల రూపేణ వెలువడి ఉండవచ్చని నా ఊహ.
ఎంతైనా ఈ చిత్రం కొత్త వరవడి సృష్టి స్తుందేమో చూడాలి. మళ్ళీ పౌరాణికం తెలుగు చిత్ర సీమలో కి వస్తుందా? దానికి ఆదరణ ఉంటుందా? వేచి చూడ వలసినదే !
నెనర్లతో
జిలేబి.