Tuesday, February 21, 2012

శర్మ కాలక్షేపం కబుర్లు


ర వేగ టపా తో జీవిత మ

ర్మ ముల నెల్ల

కాస్త విలక్షణం గా,

తీఫా చమక్కులతో  

క్షేత్రధారి క్షేత్రాన్ని అందరితో

పంచు కుంటూ

డు రమ్యం గా

బుద్ధి నొసంగె చిన్ని చిన్ని కబు

ర్లు పదుగురు మెచ్చిన

బ్లాగు బాగు బాగు



చీర్స్
జిలేబి. 

14 comments:

  1. లతీఫా అంటే ఏమిటి?కాస్త వివరించరూ!

    ReplyDelete
  2. లవణీ రసజ్ఞ,

    లతీఫా చమక్కులు - లవణీ తీగలువారు ఫాయిదాహకీకీ చమక్కులతో

    ఈ మారు అర్థ మయ్యిందా ?

    ఒట్టి మట్టి బుర్ర మరీ అతతాయి సుమా !)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. @మాధవీ
    @మాలాకుమార్ గారలు

    నెనర్లు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. తెలుగు పాటలు మీద కూడా ఒక పద్యం రాయండి తరించిపోతాము మేము కుడా :)

    ReplyDelete
  5. ఏ విషయమైనా.. మీ స్టైల్ లో రంజుగా అందించడం చాలా బాగుంటుంది. నా మట్టి బుర్రకి ప్రతిది నాలుగు సార్లు చదవాలి. అందుకే నాలుగు స్సార్లు వచ్చిన తర్వాత కానీ కామేంటాను.

    ReplyDelete
  6. నాది నిజంగానే మట్టిబుర్రండీ బాబూ..నాకూ రసజ్ఞ కి వచ్చిన సందేహమే వచ్చింది.. కనీ మీరు చెప్పింది ఇంకా అర్ధమవ్వలేదు.. కానీ తాతగారి బ్లాగు మీద చెప్పిన ఈ పద్యం బహు బాగు బాగు..

    ReplyDelete
  7. why this లతీఫా?

    I too don't know??

    is it really exist before or

    u invented this for ur poem?

    pls reply


    thank-u

    see by blog too

    ?!

    ReplyDelete
  8. @తెలుగు పాటలు గారు,

    మీ పాటల టపా వచ్చేసిందండోయ్!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. @వనజ వనమాలీ గారు,

    నెనర్లు మీ అభిమానానికి ! శర్మ గారి బ్లాగు కదా, కాబట్టి నాలుగు మార్లు చదివినా మరీ మంచిదే! చదివిన కొద్దీ మరీ ఆనందాన్ని ఒసగే బ్లాగు వారిది.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. సుభ గారు,

    అది రసజ్ఞ వారిని కొంత ఆట పట్టించడానికి రాసాను!

    లతీఫా చమక్కులతో - హాస్యోక్తి చమక్కులతో అన్న మాట.

    మరో మాట కూడా సరి అయినదే - అంటే ఆ లవణీ తీగలు వారు ఫాయిలేహకీకీ - కూడాను !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. @ఎందుకో ఏమో గారు,

    పై న రాసాను మీ ప్రశ్న కి జవాబు !

    నెనర్లు మీ అభిమానానికి !

    మీ బ్లాగు ఇప్పుడు మరి కొత్త హంగులు సమకూర్చు కున్నేయి. (ఆ పై సులభం గా ఓపెన్ అవుతోంది కూడాను!)

    వేటూరి వారి తో మీ జ్ఞాపకాలు బాగున్నాయి. వేటూరి వారి గురించి ఎంత రాసినా తక్కువే !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  12. మీరేం వ్రాసినా చాలా విలక్షణంగా ఉంటుంది.

    ReplyDelete
  13. జ్యోతిర్మయి గారు,

    శర్మ గారి బ్లాగు చదువు తున్నాం కదా ! సహవాస దోసిలి లభ్యం !

    నెనర్లు
    చీర్స్
    జిలేబి.

    ReplyDelete