సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జమ్బునాధన్ కృష్ణ స్వామీ అయ్యరు వారికి చిరాకు పుట్టు కొచ్చింది.
చ, చ, ఈ మధ్య ప్రతి రోజూ కేసులలో ఒకటి 'విడాకినీ' విడాకుల కేసు చూడాల్సి వస్తోంది. వీళ్ళ పిండా కూడు దేశం ముందుకు పోతోందా లేక వెనక్కి పోతోందా తెలియక పోయే వారికి !
ఇంటికి విసురుగా వచ్చి, జిలేబీ అని కేక బెట్టి ఉసూరు మని సోఫా లో కుదేలు మన్నారు జంబూ వారు.
'ఏమిటండీ' అంటూ వినయంగా మంచి నీళ్ళ గలాసు వారికి అందించింది జిలేబీ, వీరు ఇంత విసురుగా వచ్చే రంటే ఏదో విపరీత్యం వచ్చినట్టే సుమీ అని అనుకుంటూ.
మంచి నీళ్ళని కోకో కోలా లా చప్పరిస్తూ, నిట్టూర్చి 'జిలేబీ, మనం పెళ్లి అయి ఎన్ని రోజుల, ఎన్ని సంవత్సరాల బట్టి ఆలూ మగలం గా ఉన్నాం' అన్నారు అయ్యరు వారు.
జిలేబీ కి తన పెళ్లి రోజులు గుర్తుకొచ్చి వెంటనే సిగ్గు వచ్చేసింది.
'చ చ, ఈ ఆడాళ్ళకి పెళ్లి మాట ఎత్తితేనే మరీ సిగ్గు వచ్చేస్తోంది. నేనడుగు తున్నది సూటి ప్రశ్న మాత్రమె కదా ' చెప్పారు జంబూ వారు.
'మన పెళ్లి అయిన సంవత్సరం లో నె కదండీ , చాచా వారు బాల్చీ తన్నేసింది ?'
'మరి ఇన్నేళ్ళ బట్టి మనం కలిసే ఉన్నామా?'
'కాదుటండీ మరి? వద్దని వెళ్లి నేనెక్కడి కి పోయే దండీ ?'
'మరి ఈ కాలం కుర్ర కుంకలు అలా పెళ్లి అయిందో లేదో, ఇలా కోర్టు లో కోచ్చేస్తారు , విడాకులు కావాలని'
'మరి ఇవ్వక పోయారు ?'
విడాకులంటే అదేమన్నా విస్తరాకులా ?'
'మరి?'
మొద్దు మొహమా, డైవోర్స్ '
'ఓహ్, డై వార్నీషా, , పోదురు లెండి, లేటు మేరేజీ ఏమో, డై ' వేసుకోవాలను కుంటున్నారేమో, వేసుకోమని ఆర్డరు వెయ్య కూడదు?'
'జిలేబీ నువ్వు ఐదో క్లాసు ప్యాసు అయ్యవన్న మాట తోనే మా బామ్మ ఆ కాలం లో నిన్ను కట్ట బెట్టింది నాకు. నీకు తెలుగూ రాదు, అంగ్రేజీ రాదు' విసుక్కున్నారు జంబూ వారు. ' మొద్దు, వాళ్ళిద్దరూ, వేరే కుంపటి పెట్టుకోవాలని ఉబలాట పడుతున్నారోయ్'
'ఓహ్, 'విడాకినీ' పర్వమా ?'
'అవ్'
'పోదురు లెండి, కుర్ర కుంకలు ముచ్చట పడుతున్నారు గదా, వేరే కుంపటి కి , చెరో కొత్త కుంపటి కొనుక్కొమ్మని చెప్పండి '
ఈ మారు జంబూ వారు విశదీకరించారు పూర్తి గా, విడాకుల గురించి.
జంబూ వారు చెప్పింది విని జిలేబీ ఆలోచన లో పడింది.
'అయ్యరు వారు నేనో ఉచిత సలహా ఇస్తాను వింటారా?' జిలేబీ అన్నది.
'ఏమిటోయ్'
మన మన మొహనుల వారి తో చెప్పి కొత్త చట్టం తెప్పించండి '
'ఏమనోయ్'
'పెళ్లి కి ముందే విడాకులు తీసుకుని వారు విడిగా వేరు కుంపటి తో కొన్ని సంవత్సరాలు ఉండాలని. ఆ తర్వాత కూడా, ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలని పిస్తే, మ్యారాజు చేసుకోవచ్చు అని'
'జిలేబీ మరి ఆల్రెడి పెళ్లి అయిన వాళ్ళ మాటేమిటీ?'
అదేంటో, మీ భాష లో 'సబ్బాటికల్' లీవు అంటారు గదా ? అట్లా, 'సబ్బాటికల్' వేరు కుంపటి ....!!"
చీర్స్
జిలేబి.