Thursday, March 15, 2012

కన్నీళ్ళ పర్వం !

ఈ మధ్య ఒక వారం గా జ్యోతిష్యం మీద ఎగ బడి అసలు జిలేబీ నువ్వు జిలేబీ నేనా అన్నంత దాకా రావడం తో, ఇక ఈ ప్రహసనం మనకు వద్దు బాబోయ్ అని విరమించేసా !

సరే వేరే ఏదైనా టీం పాస్ , టైం పాస్ చేద్దారి అని ఆలోచిస్తూంటే,  ఏడుపు ఏమన్నా'ఆండోల్ల' పేటెంటు రైటా అని జర్నో డ్రీమ్స్ పురాణ పండ ఫణీంద్ర వారు పురాతన మైన ప్రశ్న ని లేవ దీశారు.

అక్కడినించి మొదలయ్యి, నేను ఓ నాలుగు బ్లాగు లు తిరిగి వస్తే, ప్రతి బ్లాగు లో నూ కన్నీళ్ళే !

అయ్యా బాబోయ్ ఏమిటీ బ్లాగు లోకం కన్నీళ్ళ పర్యంతం అయి పోయే అని ఆలోచిస్తే, ఓహో, చంద్ర కుజ ప్రభావాల వల్ల ఎగసి పడే అగ్ని కణాలు వూరికే వదలి పెట్టవు సుమీ అని పించింది.

ఈ కన్నీళ్ళ గురించి ఆల్రెడి చెప్పేసా -

సర్వ రోగ నివారిణీ నయన ధారా వాహినీ నమోస్తు నిత్యం పరిపాలయామాం  అని.

ఆలోచిస్తే, కన్నీళ్లు అసలు లేకుంటే ఏమయి ఉండేది అని పించింది. కరడు గట్టిన హృదయం కూడా, పాషాణ మైన గుండె కాయ కూడా, ప్రేమకు తడిసి కరిగి పోతుంది అంటారు.

అట్లా, ఈ కన్నీళ్లు, బాధ కి, ఆనందానికి, అన్నీటికి కలగలపై, గుండె కాయ బరువుని తగ్గిస్తూ మనకంతా 'లైట్ ' మొమెంట్స్ కల్పించడం అనే ప్రక్రియ లేకుండా ఉంటే మనం ఎట్లా ఉండే వారం?

జీవకోటి కి కన్నీళ్లు లేకుంటే అసలు హృదయ స్పందనలు అనేవి ఉన్నాయి అని తెలిసి ఉండే వా?

గగుర్పాటు అంటాం. భయాందోళనలంటాం. అన్నీటికి ఈ కన్నీళ్లు చేదోడు వాదోడై ఉండటం దీని విషయం.

డాక్టర్లు సైంటిఫిక్ గా కారణాలు చెప్పొచ్చు గాక. వాటి కన్నా విలువైనది, ఈ కన్నీళ్లు కలిగించే తేట దనానికి వేరే ఏదీ సరి పోదు అనిపిస్తుంది.

లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి అంటారు. అట్లాగే ఏడుపు గొట్ల క్లబ్ ఉంటా యంటారా ?

చీర్స్
జిలేబి.

21 comments:

  1. ఏడుపు గొట్ల క్లబ్స్ వెరే ఎందుకండి? మీరు సెలవిచ్చినట్టుగా ఉన్నాయిగా ఆ నాలుగు కన్నీటి బ్లాగ్సు...
    మీ సున్నితమయిన హాస్యాశైలి బాగుందండి.

    ReplyDelete
  2. అన్ని సమయాల్లోనూ కాదుగాని, కొన్ని సమయాలలో ఏడవకపోతే గుండె పగిలి చస్తారు.

    ReplyDelete
  3. ఓ జిలేబీగారు,
    మీకు సాటిలేదు

    ఏడుపు మీద కూడా మీరు హాస్యం మిళాయించి వ్రాసెయ్యగలరు.
    ఏడవటానికి క్లబ్బులంటే పాత తెలుగు సినిమాలు గుర్తుకు వస్తాయి. సున్నితహృదయులు (అంచేత హాల్లో ఉన్న ఆడవాళ్ళంతా, అక్కడా అక్కడా మగవాళ్ళూను)వరదలుగా కన్నీళ్ళుకార్చటానికి అవి అలా ఉపయోగపడేవి. కొన్ని సినిమాలలోనయితే టిక్కట్టుతోపాటే కళ్ళూముక్కూ తుడుచుకోవటానికి చేతిరుమాళ్ళూ సప్లై చేసేవారట ఇందుకోసం.
    సర్లేండి. ఇప్పటి తెలుగుసినిమాని తలుచుకుని యేడవాలేకాని, సినిమాచూసి యేడుద్దాం అంటే వీళ్ళూ వీళ్ళ యాక్షన్లూను. హాయిగా యేడవాల్సిన సీన్లలో కూడా కడుపు చెక్కలయ్యేలా నవ్వొస్తోంది వీళ్ళ తింగరహావభావాలతో.
    నా మాటవిని మీరు మనుషులుమారాలి సినిమా DVD తెచ్చేసుకుని, అర్జంటుగా చూసెయ్యండి, ఒక packet చేతిరుమాళ్ళు దగ్గరుంచుకుని మరీ.

    అన్నట్లు అంతలా యేడ్చినందుకు ఊర్వశి బిరుదేంటండి బాబూ ఆ శారదగారికి? ఊర్వశి పారిపోతే పురూరవుడు బేర్ మన్నాడు గాని ఆవిడెమన్నా కన్నీళ్ళు పెట్టుకుందా అసలు - పైగా తపస్సు చేసి తిరిగి పిలిపించుకుంటే పురూరవుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశం చేసి చక్కాపోయింది!

    నిన్నేదో ఒక అతియేడుపు సినిమాగురించి మా డ్రైవరు ప్రస్తావించితే అలాంటి సినిమాలు చచ్చినా చూడనని చెప్పేసాను. పొరపాటైపోయిందంటారా?

    ReplyDelete
  4. జిలేబీ.. చీర్స్!! అమ్మయ్య మిమ్మల్ని ఇప్పుడు బాగా చూడగల్గుతున్నాను .
    జాతకాల మడత పేచీ పెట్టారు.నాకు ఒక్క ముక్క అర్ధమయితే ఒట్టు.అందుకే పారిపోయా :))))
    విలువైన కన్నీళ్ళ కబుర్లు తో వచ్చారు. మీ శైలి లో .. చెప్పాలంటే... ఏడుపులో నవ్వు. (ఆనందం తోనే లెండి). అందుకే చీర్స్!!!!
    ఇంతకీ జలతారు వెన్నెల గారు చెప్పిన ఆ నాలుగు కన్నీటి బ్లాగ్స్ ఏవి టబ్బా !? తెలిసి చెప్పకపోతే తల వేయి మ్రుక్కలై పోతుంది.(కంగారు పడకండి నా తలే)

    ReplyDelete
  5. శ్యామలీయం గారి కామెంట్ పోస్ట్..సూపర్!!!

    ReplyDelete
  6. నవ్వేటప్పుడు నలుగురితో కలసి నవ్వాలి. మన ఏడుపు మనకే సొంతం. క్లబ్బులవీ పెట్టి పంచుకోవడల్లేవ్ :-(

    ReplyDelete
  7. "నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో.."
    ఈ లెక్కన చూస్తే నవ్వైనా అసందర్భంగా వస్తుందేమో కానీ..
    ఏడుపు అలా కాదేమో "జిలేబీ" గారూ..

    ReplyDelete
  8. రకరకాల బాధలతో ఏడిచే ఎన్నో ఇతర ఏడుపులు కూడా ఉన్నాయి కదండి. గుండెకాయ బరువు పెంచె ఆ ఏడుపులు తెలిసే క్లబ్బులు మాత్రం తప్పకుండా ఉండాలి జిలేబి గారు. ఆ కన్నీళ్ళు బరువు తగ్గిపోతే బాగుంటుందికదా:)

    ReplyDelete
  9. ఏడుపును రాసి నవ్వించు టెంత వింత !
    కలములో హాస్యములుబోసి కులుకరించి
    పాఠకులమీద పన్నీరు చిలుకరించు
    చతుర శైలీ జిలేబీయ మతి ఘనమ్ము

    బ్లాగు: సుజన-సృజన

    ReplyDelete
  10. @జలతారు వెన్నెల గారు,

    నెనరస్య నెనరః!


    @కష్టే ఫలే శర్మ గారు,

    సరిగ్గా చెప్పారు. గుండె దిటవు కావడానికి 'గ్రేప్' వాటర్- కన్నీళ్లు !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. @శ్యామలీయం మాష్టారు,

    మరీ పొగిడేస్తున్నారు.! ధన్యవాదాలు.

    అంతా తమిళ రచయిత క్రేజీ మోహన్ చలువ. అంతే! అన్నిట్లోనూ హాస్యాన్ని చూడ గలిగే తాహతు ఉన్నవాడాయన! వారి డ్రామాలు వినీ వినీ , చూసీ చూసీ ఈ 'దుష్ట' సహవాసం' అబ్బింది !

    ఇక శారద గారి, లేక మనసులు మారాలి లేక మనుషులు మారాలి ఎట సెటరా సినిమాలు అంటారా ! వామ్మో, చచ్చా ! కుదరనే కుదరదు. మధ్యలోనే నిద్ర వచ్చేస్తుంది!

    మన జీవితాల్లోనే ఎన్నో ఏడుపులు ఉన్నాయి. వాటిని పక్క పెట్టె దానికే గదా కొంత మీడియా లో చూడడం. కాబట్టి అక్కడా ఏడుపే చూడాలంటే అయ్య బాబోయ్ వద్దే వద్దండీ. మంచి పనే చేసారు అట్లాంటి సినిమాలు చూడ కుండా !



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  12. వనజ వనమాలీ గారు,

    నెనర్లు మీ అభిమానానికి.!

    ఆ ఒక్కటీ అడక్కండి ! క్లూ మాత్రం ఇస్తాను, కామెంట్లలో ఎక్కడ ఎక్కడ , మీకు సర్వ రోగ నివారిణీ 'సూక్తం' కనిపిస్తుందో....

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  13. ఏమండీ జ్యోతిర్మాయీ గారు,

    ఏడుపు గొట్ల క్లబ్బులు లేవని అలా నిఖార్సుగా చెప్పేసారు. అయితే మనమే ఒకటి ప్రారంభించాల్సినదే !

    "ఫ్లాష్ ఫ్లాష్ ! మీకు ఏడవాలని ఉందా ! వెంటనే మా క్లబ్ లో మెంబర్ షిప్ తీసుకోండి! మీ ఒక ఏడుపు కి పది ఏడుపులు ఫ్రీ !!"

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  14. రాజి గారు,

    సరిగ్గా చెప్పారు.

    ఏడవటం అంత ఈజీ ఐన విషయం కాదు. దానికి హృదయం తోడవ్వాలి. స్పందన కలిగినదై ఉండాలి.

    జిలేబి.

    ReplyDelete
  15. జయ గారు,

    పైన చూడండీ, కొత్త క్లబ్ స్టార్ట్ చేసాం దీనికి !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  16. లక్కాకుల వారు,

    అంతా మన మంచికే అంటారు.

    మొదట్లో మీరు శంకరాభారణం కొలువు సెలవు అన్నప్పుడు బాధ కలిగింది.

    అదీ అంతా మన మంచికే అని ఇప్పడు అనిపిస్తుంది.

    మీ 'సుజన' సృజన' కవితా మంజరి ఇప్పుడు బ్లాగ్ లోకమంతా చూడ గలుగు తున్నాను, మీదైన శులభ శైలిలో కామెంటు రూపేణా వివిధ బ్లాగుల లో, వివిధ మైన అంశాల పై

    నెనర్లు.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  17. Comment part 1



    జిలేబి जी !
    నెనర్లు....

    చిత్రం గా ఉన్నది,
    నాకు కూడా ఈ మధ్య కన్నీళ్ళ పై ఒక post రాయాలని అనిపించి
    రాయలేక పోయాను...

    సరే మీ post నచ్చింది...
    ఒక కథని జ్ఞప్తికి తెచ్చింది...

    గతం లో ఒక రెండు మూడేండ్ల క్రితం
    "మీర్" direction లో ఒక teli serial Gemini TV లో వారంతం లో ప్రసారం అయ్యేది...
    ప్రతి వారం ఉన్నత అంశం వినూత్నం గా చూపేవారు అందులో...
    ఆ కార్యక్రమం పేరు "ఏది నిజం"
    అందులో ఒక నాటి అంశం "" కన్నీరు ""
    చూసిన వారికి కళ్ళు చమర్చక తప్పదు.

    స్థూలం గా విషయం ఏమంటే...
    ఒకతను తన office కి ready అవుతుండగా పని వాడు వచ్చి వాళ్ళ అబ్బాయికి జబ్బు చేసిందని
    రోదిస్తూ ఉంటాడు, సెలవు కావలి డబ్బు కావలి అని..

    ఆ రోదన పొద్దు పొద్దున్నే చూస్తున్న ఇతనికి ఏడుపు అంటే అసహ్యం కలుగుతుంది,
    మరల మరగ మద్యం అలాంటిదే మరో ఘటన,
    office కి వెళ్లి అర్ధగంట అయ్యిందో లేదో భార్య నుంచి call వస్తుంది
    ఏమండి మీ మామయ్య గారి ఆరోగ్య పరిస్థతి మరింత క్షీణించింది...
    అంటూ తీవ్రంగా విలపిస్తూ ....
    సరే అయితే ఇంతోటి దానికి ఏడవాలా? మామూలుగా చెప్తే సరి పోదా?
    ఎంత సేపు ఏడుపులు పెడ బొబ్బులు అంటూ సరే నువ్వు కూడా వెళ్లి చావు అని చెప్తాడు..

    సరే office మళ్లి అలంటి ఇంకో ఏడుపు దృశ్యం కనిపించి ఛీ ఛీ అనిపిస్తుంది

    ఈ లోపు మళ్ళీ phone ఏమండి... మీ మామయ్య గారు పోయారు
    నీకు తెలుసు కదా నాకు ఆ ఏడుపులు అంటే నచ్చవని ... నేను రాను అంటాడు..
    పెద్ద అల్లుడుగా మీరు రాక పోతే నలుగుఋ నాలుగు రకాలు గా అనుకుంటారని
    మొత్తానికి అతన్ని కన్విన్సే చేస్తుంది ఆమె

    ఎన్నడూ కూడా ఏడవడం తెలియని ఇతను ...

    పాప్ music వింటూ కార్ లో బయలుదేరుతాడు,,,
    మార్గ మధ్యంలో cassette మార్చ బోతుండగా జరుగుతుంది ప్రమాదం...

    అంతే ....

    ReplyDelete
  18. Comment part 2 (last)

    అంతే ....


    అతని ఒక్క క్షణం ఏమి అర్థం కాదు ఏమయిందో...
    కానీ వెంటనే గ్రహిస్తాడు,,,
    తన కార్ accident కి గురి అయ్యిందని,
    తను ప్రమాదానికి గురి అయ్యాడని
    మొత్తానికి
    ఇలా అనుకుంటాడు తను చనిపోయానని
    కానీ అయ్యో నేను చని పోయాన? అనే భావ పరంపర ఆవరించే లోపు

    అటుగా ఇద్దరు వెళ్తూ ఈ దృశ్యం చూసి కార్ door తీసి
    ఇతని వద్ద నున్న చైను ఉంగరం పర్సు phone వగైరా కాజేసి
    వెళ్లి పోతారు ...

    అప్పుడు అతనికి ఒక విషయం అర్థం అవుతుంది,,,,

    తన అవయవాలు పని చేయటం లేదు,
    కానీ తన ఇంద్రియాలు ఇంకా పని చేస్తూనే ఉన్నాయి అని,

    తనకి ఇంకా ప్రాణం ఉందని,,,
    కానీ ఎలా ఆ స్థితి నుంచి బయట పడేదెల?

    ఈ లోపు ఇద్దరు పోలీసులు ఇది చూసి station phone చేసి చెబుతారు
    ఇక్కడ పలానా చోట accident జరిగింది ఒకడు చచ్చాడు అని...
    కనీసం వాడి శ్వాస ని కూడా చెక్ చేయకుండా...

    మొత్తానికి వీడికి మనసులో దుఖం మొదలౌతుంది..
    వీళ్ళకి ఎంత నెగ్లెజెన్సి అనుకుంటూ

    సరే మొత్తానికి అమ్బులన్సు వస్తుంది...

    అతన్ని కారులో నుంచి తీయ బోతుండగా
    కార్లో music player on అవ్వగానే

    ఆ bear sound కి ఇతని చేతి చిటికిన వ్రేలు (స్పందించటం) కదలటం మొదలౌతుంది...

    ఇతను ఒక్కక్షణం లో తన అంతర్యం లో బలపుతున్న దుఖం నుంచి
    క్షణ కాలం లో ఊరట లభిస్తుంది..
    కాని ఆ ఊరట ఎంతో సేపు నిలువ లేదు,

    అతని మనసు
    "common చూడు చూడు నా వేలు కదులుతుంది,
    నేను బతికే ఉన్నాను... చూడు చూడు" అని
    మానసికం గా ప్రార్ధిస్తూ ఉంటె...

    అది వినపడని అంబులెన్సు వాళ్ళు ఆ ప్లేయర్ off చేసి అతని body ని మాచురి విభాగానికి తీసుకు పోతుంటారు...

    ఇతనికి మళ్ళీ వేదన మొదలౌతుంది,

    సరే పోస్టుమార్టం అధికారులు కూడా ప్రాధమిక పరీక్షలు జరుప కుండానే
    అతని శరీరాన్ని కోయబోతుంటారు...

    ఇక అంతే
    అవయవాలు పని చేయక పోయిన,
    గొంతు పెగలక పోయిన
    తొలిసారి

    అనంత దుఃఖ దావాగ్నికి అతని హృదయం ద్రవించి కన్నీరై
    ఒక్కొక్క బొట్టు కలిసి కంటి నుంచి కారటం మొదలుతుంది....

    ఇంకో క్షణంలో అతని పొట్టను నిలువునా చీల్చేందుకు
    కత్తిని పట్టుకుని సిద్దంగా ఉన్న doctor

    ఆ కన్నీటిని గమనించి

    అతన్ని వేరే వార్డు కు shift చేస్తాడు...

    ఒక్కసారిగా ఆతని హృదయ గగనం లో ఏర్పడిన

    అనంత బాధ తప్త దుఃఖ మేఘాలు కన్నీరు గా కరిగి

    అతనికి నిర్మలాకాసమనే ఆనందాన్ని మిగిల్చాయి...

    భాదే మూలంగా జన్మనేత్తిన ఆ కన్నీరే
    ఆనంద అశ్రువై అతని ప్రాణం కాపాడి
    ఆత్మానందాన్ని కలిగించింది...

    Thanks Allot for ur post

    ?!

    ReplyDelete
  19. ఎందుకో ఏమో గారు,

    మాటల్లేవు మీరు రాసిన కామెంటు కథ కి . ఆఖరి వాక్యం అసలు ఎక్కడో తీసు కెళ్ళి పోయారు. ! నేనే చెప్పాలి ధన్యవాదాలు మీకు !

    మీ నించి కావలిసిన మరో ముఖ్యమైన కార్యం మరొక్కటి ఉందండీ. మీ ఉగాది స్పెషల్ దృశ్య కావ్య టపా కోరి ఎదురు చూస్తూ..


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  20. కం. నగుమోముల జనులారా
    నగరాలన్నిటను వెలసినది యేడ్పుల క్లబ్
    మగవారికి ప్రత్యేకం
    ఉగాదిని క్లబ్బు తెరచి యుంచు జిలేబీ.

    అన్నట్లు ఎందుకో ఏమో గారి కథ చాలా బాగుంది.

    కం. కన్నీటి బొట్టు కరువై
    యున్నాడో వాడు బ్రతికి యున్నట్లేనా
    అన్నన్నా యుద్విగ్నత
    యన్నది కన్నీటి చుక్క యగును జిలేబీ

    ReplyDelete
  21. మీ comment చూసిన వెంటనే ఇంటికి phone చేసి ఈ సారి ఉగాది ఎప్పుడు వచ్చింది అని అడిగితే రేపు లేదు ఎల్లుండే అంటూ బదులు వినిపించింది....
    actually ఈ మధ్యనే life style little bit change అయ్యింది...

    అస్సలు ఖాళీ కుదుర్చుకునే వీలు లేని స్థితి...(in week days)
    so
    ప్రస్తుతానికి

    మీరు నా youtube video channel ని వీక్షించ గలరు...
    www.youtube.com/endukoemo
    www.youtube.com/yendukoemo

    ఏ మాత్రపు అవకాశం చిక్కినా వదలక
    video post చేయ ప్రయత్ని స్తాను కొత్త ఏడాది లో....
    మీ స్పందనకు కృతజ్ఞతలు
    శ్యామలీయము వారికి నమోవాకములు...

    ReplyDelete