"చ చ చ అసలు ఈ లోకం లో మగ వాళ్లకి అసలు తమకంటూ ఓ స్టేటస్ లేకుండా పోతోందీ, అంతా హై టెక్ మహిళలకు గులాం సలాం అయి పోయింది " విసుగ్గా కనబడ్డ ప్రతి ఒక్క దాన్నీ తన్నేసు కుంటూ ఇంటి లోపలి వచ్చాడు మనవడు.
'ఏమిరా మనవడా, వస్తూ వస్తూ నే ఆండోల్ల మీద పడ్డావు ' గదమాయించాను మనవడి ని.
'ఇదిగో బామ్మా, మీ కాలం నించే ఇది మొదలయ్యింది ' అన్నాడు వాడు.
ఏమిట్రా అన్నా
'ఏమిటి అంటే ఏమిటి ? అసలు మేమంటూ అసలు ఉన్నామా ? మా కంటూ ఒక స్టేటస్ ఉందా ? ' అన్నాడు.
ఏమయ్యిందేమిటి ?
ఎల్కేజీ లో మిస్సు కస్సు బస్సు. ప్రైమరీ లో మేరీ టీచరు అథారిటీ. ఆ పై కాలేజీ లో లేడీ ప్రోఫెస్సర్స్ గదమాయింపు. పోనీ లే అని ఈ 'హాయ్ టేక్' ఐటీ ఉద్యోగం లోకి వస్తే ఇక్కడా ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లో వుమనేజ్ మెంట్' అన్నాడు వాడు.
ఫక్కున నవ్వు వచ్చింది. అదేంట్రా , ఉమనేజ్ మెంట్ అంటా వేమిటి ?
'అవునే బామ్మా, పెళ్లి అయ్యేంత వరకు ప్రాజెక్టు లో దేశాలెంబడి తిరిగి ఆ పై పెళ్లి అయ్యాక ప్రాజెక్ట్ లీడ్ అయ్యి ఇంటి కుంపటి ని తీరిగ్గా చూసు కుంటూ, క్వాలిటీ మేనేజ్ మేంటూ, మన్నూ మషానం అంటూ, see, ఎంత బాగా, eye పెట్టి CMMI V ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అని క్రెడిట్ కొట్టేస్తూ, చ చ చ అసలు మాకు రెస్పెక్ట్ అంటూ ఏదైనా ఉందా అంట ' అన్నాడు
వాళ్ళ అమ్మ వచ్చింది .
కోడలా, మనవడు వయసుకు వచ్చేడు. ఓ మంచి అమ్మాయి ని చూసి కట్ట బెట్టేయి ' అన్నా . 'ఆ వచ్చే అమ్మాయే, వీడి మానేజ్ మెంట్ చూసేసు కుంటుంది కూడాను'
'వాడు వింటేనా ? అసలు ఉద్యోగంకి పోయినప్పటి నించి వాడికి వైరాగ్యం వచ్చేసింది ' అంది కోడలు పిల్ల.
'ఇదే సరి ఐన సమయం చూసి ముడేట్టేయి '
'దేశం లో అమ్మవారి రాజ్యం ! ఇంట్లో ఆండొల్ల రాజ్యం. చ చ చ ' అన్నాడు మనవడు.
చూడమ్మాయి, వాడు వద్దని చెప్పటం లేదు కదా ! ఓన్లీ కంప్లైంట్ అంతే !
మా అయ్యరు వారు హిందూ దిన పత్రిక నించి ఓ మారు తల బయట పెట్టి, మళ్ళీ పేపర్లోకి తల దూర్చేసేరు.
వారికి పేపరు కనబడితే చాలు, వేరే ఏదీ అక్కరలే మరి. మనమోహనుల వారి పాలిసీ. అన్నీ పాలిసీ మేటరు లోనే ఉండాలి అంతే.
రాజ్యం వీర భోజ్యం ! ఈ జమానాకి, 'రాజ్యమే' హైటెక్ మహిళా భోజ్యం !
చీర్స్
జిలేబి.