భామనే 'నిత్య' భామనే !
మన ముంబై మరదల్ని పలకరించి చాలా రోజులయ్యిందని శ్రీ శర్మ గారు రాసినప్పటి నించి కొంత ఈ ముంబై మరదల్ని ఓ కన్నేసి చూద్దామని ఓ రెండు వారాలు గా టంచను గా ముంబై మరదలు వారి తెల్లారి సోకు మధ్యాహ్నం 'బాకు' గమకాన్ని, నాట్య విలాసాన్ని గమనించడం మొదలెట్టాను !
ఆ హా ఏమి ఆ నాట్యం !
నాట్య కళా మణులు ఈ ముంబై మరదలు నాట్య కళా నైపుణ్యం చూసి నేర్చుకోవటానికి ఎన్నో పాయింట్లు ఉన్నాయి సుమా అని పించింది.
ఒకటి జనావళి కి ఓ కిక్కు ఇచ్చి, 'ఇండియా జూమింగ్' అన్న 'బ్రాందీ' భ్రాంతి ని కలిగించి 'శభాష్ ! భువి మండలం లో భారద్దేశమంత మహామహిమాన్విత దేశం మరెక్కడా లేదు సుమీ ' అని పించడం ! ( మధ్య లో నిఫ్టీ ఐదు వేల నాలుగు వందల చిలుకుకి వెళ్ళడం జరిగింది )
రెండు, సాయంత్రం వేళ 'మోహిని ఆట్టం' ! అంటే , జుమ్మంది నాదం , నిప్పు కుంపటి లో నీళ్ళు చల్లితే, 'సోయ్యన్నట్టు ' నీరసం గా ఊగి పోవటం !
మూడు మళ్ళీ పోద్దవగానే, ముంబై మరదలు రాత్రి ప్రియుని చిలిపి చేష్టల సిగ్గు దొంతరలతో మళ్ళీ ముస్తాబు !
ఈ సరసమైన కేళీ విలాసం లో ముంబై మహానగరం లో ఉండడం అక్కడి జన సందోహాన్ని గమనించడం జరిగింది.
ఈ ముంబై నగర వాసుల వేగాన్ని వర్ణించడం అంత సులభమైన విషయం కాదు సుమీ అని కూడా అనిపించింది
అసలు ఈ నగరం నిద్ర పోతుందా ? లేదనే అనుకుంటాను.
మొత్తం మీద బృహన్ ముంబై మహా నగరం జయహో ! ముంబై మరదలు జయహో !
'భామనే నిత్య భామనే ' అన్న తీరులో ఉన్న వీరి అందం చందం భారద్దేశ జనావళి కి , భారద్దేశ ఎకానమీ దీపానికి ఓ నిత్య నూతన రమణీ నాట్య నటరాజ పాద సుమాంజలి !
చీర్స్
జిలేబి.

ఇప్పుడు ముంబై మరదలితో వ్యవహారం ప్రమాదమే.
ReplyDeleteజిలేబిగారూ ఎక్కడ్నుంచి ఎక్కడికి తీసుకువచ్చారు....మీ సృజనాత్మకతకు జోహార్లు.
ReplyDelete