నాడు
ఏనాటిదో మన బంధం
ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా
ఇది ఇగిరిపోని గంధం
నేడు
ఏనాటి దో మన బాండూ
ఎరుక వచ్చేను అణు బాంబూ !
ఈ యుగములోనే
ఇంకి పోయేను బంధం !
***
ఫ్యామలీ కోర్టు లో జస్టిస్ !
'ఇదిగో రాంబాబు , గీత పై చెయ్యేసి చెప్పు, అంతా సత్యమే చెబుతానని '
'అయ్యా జడ్జీ వారు, నా పెండ్లాము గీత పై ఒక్క సారి చెయ్యేసి నందుకే ఇప్పుడు ఈ బోనులో నిలబడ్డా. మళ్ళీ మరో మారు వెయ్య మంటారా !చస్తే కుదర దండి !'
***
ఆంధ్ర లోకం లో కలకలమైన కేసు !
నాలుగో మొగుడితో మూడో పెళ్ళాం తలాక్ !
***
రూపాయ్ మొగుడు డాలరు పెళ్ళాం
సంచలనాత్మక చిత్రం
నేడే చూడండి
మీ అభిమాన ధియేటర్ లో
డైవోర్స్ సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ స్పెషల్ !
చీర్స్
జిలేబి.
జిలేబీ గారూ ఈ లోకం లో ఏదీ శాశ్వతం చెప్పండి??
ReplyDeleteమార్పు సహజమండీ... మార్పును ఒప్పుకోలేని వారు పిరికి వారుట...
ఇది నా మాట కాదండీ కొందరు గొప్పవారి వాక్కులు...
అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం అన్నట్లు
మగాడు కట్నం కోసం పెళ్ళి చేసుకుంటాడు
ఆడవాళ్ళు విడాకులు తీసుకుంటే వచ్చే ఆస్తిని కోసం పెళ్ళి చేసుకుంటారు
సరికి సరి
ఇంకేముంది సమస్య ఇందులో
వ్యాఖ్యలో చిన్న సవరణ "మగాడు" కాదు "మగవారు"
Deleteఅని చదువగలరు..
రాజి గారు,
Deleteకాల వాహిని సాగి పోవుట సులభ తరమే!
వాగు కి ఎదురీత మరీ కష్ట మైన పనే !
జిలేబి.
"మీ ఫ్యామలీ కోర్టు లో జస్టిస్ !" భలేగా నచ్చిందండి.
ReplyDeleteబాగున్నయి అన్ని jokes!
జలతారు వెన్నెల గారు,
ReplyDeleteధన్యవాదాలు. !
జిలేబి.
"రూపాయ్ మొగుడు డాలరు పెళ్ళాం"
ReplyDeleteఈ టైటిల్ కి పేటెంట్ రైట్స్ తీసేసుకోండి..