బ్లాగ్ శిఖా 'నాని' బ్లాగ్ జిలేబీ అమ్మ వారు తీరిగ్గా లాఫ్ టాప్ ముందు కూర్చుని తన 'రచనా విరహ తాపాన్ని ' చల్లార్చుకుంటూ ఆన్ లైన్ 'చేట' లో రాళ్లేరుకుంటూ, కామెంట్లలో గోళ్ళు గిల్లు కుంటూ కాలం వెళ్ళ బుచ్చు తోంది.
ఆ దారి వెంబడే వెళ్ళే ఓ అమరికను కన్సల్టంటు జిలేబీ బ్లాగ్ పైత్యాన్ని గమనించి,
'జిలేబమ్మా, జిలేబమ్మా' నీకు ఓ ఐడియా ఇస్తాను దాంతో నీ బ్లాగ్ లోక దురద తో బాటు పైసలూ రాలుతాయి' అన్నాడు.
డబ్బెవరకి చేదు అన్న చందాన జిలేబీ ఆశ పడింది.
'ఏమిటోయ్ ' అంది.
'చూడూ, ఆన్ లైన్ చేట లో రాళ్ళేరు కుంటూ వుంటావు గా, దాంతో బాటు, నీకు తెలిసిన బ్లాగ్ గురించి చేట లో రాళ్ళేస్తూ చెప్పు. ఐడియా కి ఓ డాలరు అను నీకు పైసలు రాల్తాయి'
'నిజంగా నే అంటా వా ?'
'అవ్ మల్ల' అమెరికన్ ఎక్సంట్ నించి ఈ మారు ఆ తెలుగోడు ఆదరబాదర ఎక్సంట్ కి వచ్చాడు !
సరే అని జిలేబీ ఆన్ లైన్ చేట లో 'బ్లాగ్ వైద్యులమ్మ జిలేబమ్మ ' మీ సర్వ రోగముల నివారణ కు ఇచ్చట ఉపాయం చెప్ప బడును ' అని బోర్డు బెట్టు కుని నాలుగు రాళ్ళూ వెనకేసుకుంది !
చదువరులారా ! మీకు ఏమైన్నా రోగము ఉందా ! ఆ రోగము తీరి పోవుటకు వెంటనే చక్కని బ్లాగ్ లింకు తెలుప బడును ఇచ్చట ! మీ రోగం హుష్ కాకి! వెంటనే ఓ డాలరు కామెంటు కొట్టుడు ! మీకు వైద్య సలహా ఇవ్వబడును !
ఇట్లు
బ్లాగ్ వైద్యులమ్మ
జిలేబమ్మ !
(దీనికి స్ఫూర్తి చెప్పాలంటారా! ఈ టపా వారికే అంకితం!)
జిలేబీ గారూ "నాని" అన్న పేరుతో బ్లాగ్ రాసేది మా అమ్మ..
ReplyDeleteమీరు ఇప్పుడు రాసిన పోస్ట్ మా అమ్మ బ్లాగ్ కి సంబంధించిందే ఐతే
ఆ బ్లాగ్ లో మీకంత వెటకారం ఏమి కనిపించింది??
మా అమ్మ ఈ సైట్ తో ఎన్ని డాలర్లు వెనకేసుకుంది
మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి..
అన్నట్లు మా అమ్మ చేటలో రాళ్ళేరుతుంది నిజమే కానీ ఎవరో అన్నట్లు ఎన్ని బియ్యేలూ,ఎమ్మేలు చేసినా ఆడవాళ్ళు చేటలో బియ్యంలొ రాళ్ళేరక తప్పదంట మీకు తెలుసు కదా ఆ విషయం..
అయ్య బాబోయ్ రాజీ గారు,
ReplyDeleteనా కస్సలు తెలీదు నాని అనబడే బ్లాగరు ఉన్నారని. స్ఫూర్తి కి లింకు ఇచ్చా ఈ మారు ఇట్లాంటి అపోహలు మరీ రాకుండా ఉండటానికి. ! ఈ టపా లో నాని జిలేబీ యే అని 'బ్లాగ్ పధం' గా కీబోర్డు నొక్కి తెలియ జేసు కుంటున్నా !
ఇంతకీ మీ అమ్మగారి బ్లాగు లింకు కాస్త చెబుదురూ? చదవడానికి !
చీర్స్
జిలేబి.
Excellent
ReplyDeleteధన్య వాదాలండీ శర్మ గారు!
Deleteజిలేబి.
మీ సమాధానం తెలియచేసినందుకు ధన్యవాదములు..
ReplyDeleteజిలేబీ గారూ ..
మా అమ్మ "మనందరంత" గొప్పబ్లాగర్ కాదు లెండి :) :)
ఎదో చిన్న చిన్న టపా లు రాస్తూ ఉంటుంది...
"నాని" అన్న పేరుతో ఉన్న బ్లాగర్ ఆమె ఒక్కరే అందుకే అడిగాను
నా సందేహాన్ని తీర్చుకుందామని..
http://naninamala.blogspot.in
మాకు మాత్రం డబ్బు చేదు కాదు కదా. మీరు కామెంటుకొక డాలరు ఇస్తారా?
ReplyDeleteమీరు ఈ స్కీము (స్కాము?) ద్వారా సంపాదించే కోట్లాది రూపాయిలలో ఈ రకంగా మాకు కూడా కొంత వాటా ఇస్తే మీ బ్లాగు పాపులారిటీ పెరుగుతుంది.
జై గొట్టి ముక్క ల గారు,
Deleteఅబ్బే, మనది మార్వారీ బిజినెస్స్ అండి. పుచ్సుకోవటమే తెలుసు. డాలర్లు ఇవ్వబడవు. మీరిచ్చిన చొ పుచ్చుకొని మీకు వైద్య సలహా ఇచ్చేదము ! అంతే !
జిలేబి.
any tie up with dr.sastry? LOL
ReplyDeleteపీ క్యూబ్ గారు,
Deleteఅదీ చేసేస్తా మండీ !
ఇచ్చట బ్లాగు ప్లస్ బుక్కుల వైద్య సలహా ఇవ్వ బడును!
డాక్టరు రమణ గారితో ఆల్రెడి ఒక జేవీ ప్రతిపాదన ఉంది డాక్టర్ శర్మ అండ్ బ్లాగ్ నాని అండ్ కో గురించి !
చీర్స్
జిలేబి.
జిలేబి గారు,
ReplyDeleteమీరు ఒక టపా రాసి నాకు డెడికేట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది.
ధన్యవాదాలు.. కృతజ్ఞతలు.. థాంక్యూ..
నా బ్లాగుకి ఇది greatest honour గా భావిస్తున్నాను.
ధన్య వాదాలండీ డాక్టరు గారు,
Deleteఆ ఆలోచన కలిగించిన టపా మీదే కదా మరి !
చీర్స్
జిలేబి.
నమస్కారం.. బిలేబీ గారూ.. మా వైపు తొంగిచూడడమే మానేశారు. బొత్తిగా జిలేబీ నల్లపూసైపోయింది.... ఎండాకాలం బయటకు వస్తే.. కరిగిపోతారనే ఏమిటి..? మీరు మరీ లెద్దురూ.. కాస్త.. మా చాటలోని బియ్యాన్ని.. రాళ్లను, రప్పలనూ కూడా... చూడండి.
ReplyDeleteఅబ్బే, నాసా గారు,
Deleteఎండా కాలం లో జిలేబీ లు పడవు అందుకే కొంత విరామం. మళ్ళీ చలి కాలం వచ్చిన వేడి వేడి జిలేబీలు పడును! అన్న మాట
మీ అభిమానానికి నెనర్లు. మీ టపా ని దినం చూస్తూనే ఉన్నాను కదండీ మరి !
చీర్స్
జిలేబి.
జిలేబీ గారు చెప్పే మందులని మాదగ్గర సరసమైన ధరలకే లభించును.
ReplyDeleteజిలేబీ గారూ మీ చేటలో రాళ్ళు అయిపోతే సరసమైన ధరలకే సప్లై చేస్తాము...దహా.
ఆ హా బులుసు వారు,
Deleteమీరు సబ్ ఏజెన్సీ మొదలెట్టే రన్న మాట ! శుభం !
మీ బ్లాగ్ కూడా వైద్యులమ్మ జిలేబమ్మ 'రోగ నివారిణీ' లిస్టులో వుందండోయ్!
చీర్స్
జిలేబి.
జిలేబిగారి చేటలో రాళ్ళు కూడా రాతనాలే కదండీ...మీ గోళ్ళు బాగా పెరగాలని కోరుకుంటున్నాను..
ReplyDeleteజ్యోతిర్మాయీ గారు,
Deleteగోళ్ళు బాగా పెరిగిన ఎడల, 'షార్ప్' నఖ లవుతాము కాబట్టి వద్దండీ !!
చీర్స్
జిలేబి.
ఏదన్నా డైరెక్ట్ గా చెప్పినా అర్ధం కాని నాలాటి పావు మెదడు గాళ్ళకి అర్ధం అయ్యేలా మీరు ఏమీ వ్రాయరా ?
ReplyDeleteఈ మేధావుల ల మధ్య బ్లతకటం చాలా కష్టం సామీ !!
ఆత్రేయ గారు,
Deleteఇక్కడ దైరేక్తుగానే చెబుతున్నాం కదండీ మరి! అయినా అర్థం కాలేదం టారు మరి !
మేధావుల బతకటం చాలా సులభం సుమీ! మే లైన 'తావులు' వెతుకు వారు మేధావులు! వారి మేలైన తావులని మీరు కనినీ బెట్టిన యెడల మీరే ఒక మే 'తావి'!
చీర్స్
జిలేబి.
ఆత్రేయ గారు,
Deleteమేధావులు మే లైన 'తావులను' వెతుకు వారు. మీరు ఆ తావులను కని బెట్టిన యెడల మీరే ఒక మే 'తావి' !
చీర్స్
జిలేబి.
జిలేబి గారికి
ReplyDeleteశ్రీరామనవమి శుభాకాంక్షలతో...........
జగదభిరాముడు శ్రీరాముడే !
ఎస్సార్ రావు గారు,
Deleteనెనర్లు. మీకున్నూ శ్రీ రామనవమి శుభాకాంక్షలు !
చీర్స్
జిలేబి.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ReplyDeleteలాస్య రామకృష్ణ గారు,
ReplyDeleteనెనర్లు. మీకు కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
చీర్స్
జిలేబి.