Monday, March 26, 2012

అమ్మాయి పెళ్లి

ప్రియమైన చెల్లెలు వరూధిని కి -

అక్కయ్య ఆశీర్వదించి వ్రాయునది. ఉభయ కుశలోపరి. 

అమ్మాయి  సౌమ్య పెళ్లి విషయమై మై బామ్మ కాబినెట్ మీటింగ్ ఇవ్వాళ పెట్టింది.

మన ఇంటి పెద్ద మంత్రులు ఐన అన్నయ్యలు హాజారైనారు మీటింగుకి. 

మీ  బావగారు జంబూ వారు నిమిత్త మాత్రులు కాబట్టి బామ్మే మీటింగుని ఖరారు చేసి ఉచిత పీఠాన్ని అలంకరించింది.

మూడోతరం మంత్రులు అంటే చిన్న చితకా కుర్రకారు అందరు క్వాలిటి కంట్రోల్ ప్రోగ్రాం కోసం దేశాల మీద ఉన్నారు కాబట్టి (నిన్నూ చేర్చి) వాళ్ళంతా గైరు హాజారు మీటింగుకి.

దరిమిలా బామ్మ నీ పెళ్లి ఖాతా వెతికి దాని ప్రకారం అమ్మాయి సౌమ్య పెళ్లికి బడ్జెట్ తయారుచేసింది. ఆ లెక్కల  ప్రకారం పెళ్లి ఖర్చులు వెరసి పది రెట్లు ఎక్కువై పోయినాయి.

బడ్జెట్ బ్రతుకులు కాబట్టి బామ్మ బుగ్గలు  నొక్కేసుకుని బావ గారి వైపు చూసింది -

మీ బావగారు ఎలాంటి ఫీలింగు లేకుండా నా వైపు చూడడం నేను ఏమి చెయ్యాలో పాలుపోకుండా మన ఇంటి పెద్ద మంత్రులు వైపు చూడడం వాళ్లు ఏమి చెయ్యాలో తెలియకుండా బామ్మ వైపు చూడడం,

బామ్మ తీక్షణ ద్రిష్టి తో మమ్మల్ని వీక్షించి "ఒరేయి బడుద్దాయిలు - మీరేమి చేస్తారో నా కవసరం. ఎట్లా చేస్తారో నాకనవసరం. అమ్మాయి పెళ్లి మూడు నెలల్లో ఖరారు అయిపోవాలి " అని అల్టిమేటం జారి చేసింది.


ఈ తంతు తో ఇవ్వాల్టి కాబినెట్ మీటింగ్కి బామ్మ వీడుకోలు చెప్పి అందర్నీ పని మీదికి అంటే అమ్మాయి సౌమ్య పెళ్లి పని మీద  పురమాయ్యించడం తో నా మనసు కొంత కుదుట పడింది.

ఈ మీటింగు తరువాయి మీ బావగారు యథా ప్రకారం దిన పత్రిక పడక కుర్చీలో కూర్చుని తిరగేయ్యటం మొదలెట్టేరు !

ఏమి చేతును నా చిట్టి చెల్లీ?

ఇదీ కథ!


బావగారికి నా నమస్సులు. !


ఇట్లు
నీ పెద్ద అక్కయ్య
జిలేబీ.

13 comments:

  1. శుభం..అమ్మాయి పెళ్ళికి మమ్మల్ని పిలవడం మరువకండి..పందిట్లో జిలేబి కోసం పళ్ళెంలో జిలేబీల కోసం తప్పక వస్తాము.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మాయీ గారు,

      ఇదేప్పుడో, ఓ పదిహేను ఐదు సంవత్సరాల మునుపు రాసింది! మనవరాలికి పదేళ్లు పై చిలుకు ఇప్పడు ! బామ్మ కూడా ఎప్పుడో బాల్చీ తన్నేసింది!


      ఈ మధ్య చిట్టా లెక్కలు చూస్తోంటే ఇది గుర్తుకొచ్చి రీ-పోస్టింగ్ !


      నెనర్లు మీ అభిమానానికి !

      చీర్స్
      జిలేబి.

      Delete
    2. మరి జిలేబీల మాటేమిటి మీకు వ్యాఖ్య పెట్టినప్పటినుండి తియ్యటి కలలు కనేస్తున్నానే...

      Delete
    3. జ్యోతిర్మాయీ గారు,

      జిలేబీ లు ఇప్పుడే మీ ఇంటికి కొరియర్ చేసాము! స్ట్రైట్ ఫ్రం ది ఒవెన్ ఆఫ్ యంగ్ ఫ్రౌ మౌంటైన్ !


      చీర్స్
      జిలేబి.

      Delete
  2. కంగ్రాట్స్ . మీ సౌమ్య పెళ్ళి కి మమ్మల్నీ పిలవటం మర్చిపోకండి:)

    ReplyDelete
  3. @మాలా కుమార్ గారు,

    ధన్యవాదాలు. పైన ఇచ్చిన జవాబు చూడ గలరు !


    జిలేబి.

    ReplyDelete
  4. పైన ఇచ్చిన జవాబులు ముందే చూసాను. ఇప్పుడు కింద ఏమి వ్రాయాలో?

    మీ మనవరాలి పెళ్ళి దాక మాకు ఆహ్వానం లేదన్నమాట.

    అప్పటిదాకా చీర్స్ అనుకుంటాము.

    ReplyDelete
    Replies
    1. బులుసు వారు,

      సుస్వాగతం, వెల్కం బెక బెక!

      చీర్స్
      జిలేబి.

      Delete
  5. జిలేబీగారు,

    యేమిటండీ యీ తెలుగు?

    "దిన పత్రిక పడక కుర్చీలో కూర్చుని తిరగేయ్యటం"
    అంటే " పడక కుర్చీలో కూర్చుని దినపత్రిక తిరగేయ్యటం" అనుకుంటాను.
    సర్లెండి, వాక్యంలో మాటలకు ఒక్ order అంటూ లేదని చిన్నయ సూరిగారే సెలవిచ్చారు కదా!

    "ఓ పదిహేను ఐదు సంవత్సరాల మునుపు రాసింది"
    అంటే యేమీ అర్థమవటంలేదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం మాష్టారు,

      జిలేబీ తెలుగు గురించి తెలిసీ మీరు ఇలా అంటే ఏమి చెప్పేది !

      వాక్యం లో కర్త, కర్మ క్రియ, వాటి వాటి క్రియలు కర్మలు అవి నిర్ణయించు కోవాలి! దశా నిర్దేశం చెయ్యబడదు !!

      టైపాటు ఎలా సాగునో గూగుల్ వాడి ఐ ఎం ఈ చలవ ! అంతే !

      మధ్యలో కరెంటు 'ఉడాలు' అంటే హుష్, పదిహేను, ఐదు లాంటివి కూడా వచ్చేస్తాయి !



      చీర్స్
      జిలేబి.

      Delete
  6. జిలేబి గారు,
    నేను చాలా ఆలస్యంగా మీకు మీ కుటుంబ సభ్యులకి నా తరఫున నా కుటుంబ సభుల తరఫున నందన ఉగాది శుభకామనలు తెలుపుకుంటున్నా.మీరేమి చెప్పినా బాగానే ఉంటుంది.
    నెనరుంచండి

    ReplyDelete
  7. కష్టే ఫలే మాష్టారు,

    ధన్యవాదాలు మీ అభిమానానికి !

    ఉగాది పండుగ బాగా జరిగిందా !

    మీ పంచాంగ శ్రవణం ఇప్పుడే చదివా! వావ్ ! అంతా ఆల్రెడి మొదలైనట్టుంది !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. రెండు రోజులనుంచి జిలేబి గారి దర్శనంలేదు. కుశలమా?

    ReplyDelete