నిన్న బ్రాడీ పేట లో వాకింగ్ వెళ్తూంటే డాక్టర్ రమణ గారి సుబ్బు హటాత్తు గా ప్రత్యక్షమై 'ఏమండీ జిలేబీ గారు బాగున్నారా ' అన్నాడు!
'ఓహ్, సుబ్బూ గారు మీరా ' అన్నా
'అబ్బే, ఆ గారూ వగైరా ఎందుకు లెండి. జస్ట్ కాల్ మీ సుబ్బూ' అన్నాడు వినయంగా.
ఏమోయ్ సుబ్బూ అన్నా వాడన్నాడు కదా అని.
'అదేమిటండీ ఏకవచనం లో పిలుస్తారు ?' అన్నాడు సుబ్బు సీరియస్ గా.
'అదేమిటోయ్, నువ్వే కదా సారీ మీరే కదా జస్ట్ కాల్ మి సుబ్బూ అన్నావు సారీ అన్నారు' అన్నా.
'అదేంటి, జస్ట్ కాల్ మీ సుబ్బూ అంటే, వెంటనే 'ఏమోయ్' అనెయ్యడమేనా ?'
'మరి?' అన్నా ఏమనాలో తెలియక.
'మొహమాటానికి ఎన్నో అంటూంటాం. వెంటనే దాన్ని వంద శాతం పాటించడమేనా ?'
'సారీ సుబ్బు గారు, తప్పైపోయింది క్షమించండి'
అదేమిటండీ, జస్ట్ కాల్ మీ సుబ్బూ, ఇట్స్ ఓకే ' అన్నాడు మళ్ళీ.
'మిస్టర్ సుబ్బు, కాఫీ తాగుతారా '
కాఫీ ఎందుకు లెండి, ఈ మండే ఎండలో కూడా మా డాక్టరు బాబు ఎప్పుడు వెళ్ళినా కాఫీ ఏ కొట్టిస్తుంటాడు. మీరు కూల్డ్రింక్స్ కొట్టించండి ' అన్నాడు.
మరి కూల్డ్రింక్స్ అంటే, వాటి పాలిటిక్స్ గురించి సుబ్బు చెబుతాడేమో అని కొంత అనుమాన పడి, ' మిస్టర్ సుబ్బూ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ?' అన్నా.
'అసలు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అంటూ ఏదైనా ఉందంటారా ?'
'వై మిస్టర్ సుబ్బూ. ఈ మధ్య పెక్డ్ బాటల్స్ లో కూడా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ వస్తోంది కదా ' అన్నా.
'చూడండి, మిస్, ఫ్రెష్ అని వాడంటాడు మరి మనకి తెలియదా అది ఎంత ఫ్రెష్ అనో '
సరే పోనీ, చాయ్ తాగుతారా మిస్టర్ సుబ్బూ..'
అదీ, అలాగ చెప్పండి, ఇట్స్ అవర్ నేషనల్ డ్రింక్. కాబట్టి చాయ్ తాగడం బెటర్'
'మిస్టర్ సుబ్బూ.,. నేషనల్ డ్రింక్ అన్నంత మాత్రాన మీ కిష్టమైన కాఫీ వదులు కోవడ మేనా ?' అన్నా దక్షిణ దేశ కాఫీ పాలిటిక్స్ ప్లస్ ప్లాంటేషన్స్ గుర్తుకు తెచ్చు కుంటూ.
'చూడండి, మిస్, మనం కాఫీ ఇప్పడు వద్దే వద్దు అన్నా మనుకొండీ, డిమాండ్ ధమాల్ దానికి. ధర పడి పోతుంది. చాయ్ ధర షూట్ అప్ అవుతుంది.'
అయితే ?
'చాయ్' ధర ని తగ్గించడానికి చాయ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు '
'అవురా, చాయ్ ఎక్స్పోర్టింగ్ మార్కెట్ నించి, చాయ్ ఇంపోర్టింగ్ మార్కెట్ అవుతుందన్న మాట మన దేశం ?'
'హ్హ హ్హ హ్హ' నవ్వాడు మిస్టర్ సుబ్బూ.
హుష్ కాకి. సుబ్బూ గాయబ్. మళ్ళీ బ్రాడీ పేట లో నడక మొదలెట్టాను!
(బ్రాడీ పేట లో షికార్, సుబ్బూతో ముఖాముఖి- డాక్టర్ రమణ గారికి అంకితం!))
చీర్స్
జిలేబి.