మీ పేరు గణపతా ? అన్నారు క్రితం టపాలో సీతారామం అనబడే బ్లాగరు/బ్లాగరిణీ గారు!
ఇంతకీ గణపతి కి జిలేబి కి ఎలా లింకు పెట్టేదబ్బా ?
సీతారామం గారు, చూడుము చిలకమర్తి వారి గణపతి నాటకము అన్నారు. గాని ఎక్కడ చూడ వలె నో చెప్ప లేదు.
సరే ఈ గణపతి ఎవరు చిలకమర్తి వారు ఎవరు అని ఆరా తీస్తా ఉంటే ( చిలకమర్తి వారి పేరు విన్నాను గాని, వారి రచనలు ఎప్పుడు చదివిన ది లేదు. కావున ఎవరబ్బా ఈ చిలకమర్తి వారు అనుకుని గూగులాయ నమః అంటే, తూర్పు గోదావరి వారి కథల్లో ప్రాచుర్యం అని తెలిసింది.
ఆ హా, మనకీ, ఈ గోదావరి కి ఏమి అవినాభావ సంబంధం సుమీ అని చాలా సంతోష పడి పోతిని.
ఎందు కంటే, కొన్ని నెలల ముందు జ్యోతిర్మయీ వారు మీది గోదావరి ప్రాంత మా జిలేబీ గారు అన్నారు.
కాదండీ, ట్రైన్ నించి గోదావరి చూసి బహు సంతోష పడిన వారము మాత్రమె అన్నా.
మీ రచనల్లో గోదావరి తీర యాస ఉందండీ అన్నారు వారు!
ఆహా, అసలు మనం ఈ గోదావరి తీరం లో ఎప్పుడూ ఉండి ఉండక పోయినా మన కెట్లా ఈ యాస వచ్చింది సుమీ అని హాశ్చర్య పోయి, అంతా మన పూర్వ జన్మ వాసన సుమీ అని తీర్మానించే సు కున్నా.
ఇప్పుడు ఈ సీతారామం గారు మళ్ళీ మీరు గణపతా అని అడిగి ఆ జ్ఞాపకాలను మళ్ళీ కదిలించారు సుమీ.
ఇంతకీ మీరు గణపతా అని ఎందుకు అడిగారు సీతరామం గారు ?
గణపతి కథకి ఈ జిలేబీ ఉడాలు టపాలకి ఏమి సంబంధమబ్బా ? ఎవరైనా తెలిస్తే చెబ్దురూ.
పూర్వ జన్మలో ఈ చిలకమర్తి వారి రచనలు ఏమైనా చదివారా జిలేబీ ?
చీర్స్
జిలేబి.
అట్టే ఊరించక అడిగిన వారందరికీ చెప్పెయవచ్చును కదండీ జిలేబీ.. !
ReplyDeleteమీరు ఏడుకొండలు ఉన్న జిల్లావారు అని.. మరియు.. తమిళ ప్రాంతం మీకు బహు ఇష్టంగా ఉన్న ప్రాంతమని.
కాదంటారా!? ఏమిటో..నా భూతద్దం కళ్ళతో చూస్తే..ఇదే తోచింది మరి. మీరు మార్కులు ఎన్ని ఇస్తారో!అంచనాకి అందటం లేడు.
చీర్స్..జిలేబీ..
వాళ్ళేమీ ఈపాటికి 'వూరి' వుంటారనుకోను. ఏదో సరదాగా అలా అనివుంటారు. సీరియస్‌గా పట్టించుకుని ఇలా టపాలు రాసేయాలనుకోవడం ఏంబాగోలేదు, జిలేబమ్మా. ఆ మధ్య టాటా చెప్పారు, ఏమైంది? :))
ReplyDeleteఉడాలు టపాలకి
ReplyDelete:-)
ఉషో వాజేన .... ఈ టపా చూస్తె, సీతారామం ఎవరో, కథ వెనక కథ ఏవిటో తెలుస్తుంది :) బహుశా నేను వ్యాఖ్య ప్రచురణ చూడనేమో అని ఇలా మరో 'జిలేబీ' చుట్టారనుకున్నా... మాకు జిలేబీ అంటే చాలా ఇష్టము కనక అంచనాలకి అందలేదు మేము.
ReplyDelete@SNKR వూరి విషయములో ఊర బడలేదు కనక వూర లేదు :)
సీతారామం