బామ్మోయ్ దేముడి మమ్మీ ఎవరు అన్నాడు మా మనవడు.
అదేమిరా ప్రశ్న అన్నా.
నాకు మమ్మీ ఉంది కదా. దేముడికి మమ్మీ ఎవరు అన్నాడు.
అదేమిరా , ఏ దేముడికి ? అని తెలివిగా అడిగా (అనుకున్నా) శీ కృష్ణుల వారికా? నీకు తెలిసిందే కదా, యశోదమ్మ అన్నా.
"కాదు. దేముడికి" అన్నాడు వాడు.
దేముడికి అమ్మ అంటూ ఎవరూ ఉండరు రా కన్నా అన్నా.
అదేమిటి ? నేనున్నా గా. మమ్మీ ఉంది గా. మరి దేముడికి ఎందుకు లేదు ? మళ్ళీ వెధవ ప్రశ్న.
అబ్బే ఈ కాలం పిడుగులు వదిలి పెట్టరే మనల్ని ప్రశ్నలడగ కుండా. , అదీ సమాధానం చెప్పలేని ప్రశ్నలని అడగ కుండా అనుకున్నా.
అదికాదురా మనవడా, దేముడికి ముందంటూ ఏమీ లేదు. దేముడే మొదలు అంతే.
అదెట్లా? మమ్మీ లేకుండా ఎలా ? మళ్ళీ వాడి గోల.
ఏమని చెప్పా లంటారు ?
చీర్స్
జిలేబి.
:)))))
ReplyDeleteSweet manumadu. Hot baamma gaaru.
వనజ వన మాలీ గారు,
Deleteహ్హ హ్హ హ్హ మీరు ఇద్దరి పక్షం అన్న మాట
నెనర్లు
జిలేబి.
పిల్లలతో జాగ్రత్తగా ఉండాలండీ! దేవుడి మమ్మీ పేరు "దేవ్-మాం" అని చెప్పేసి వదిలించుకుందామనుకుంటే దేవ్-మాం మమ్మీ ఎవరు అని అడుగుతారు.
ReplyDeleteఉపనిషత్తుల కాలం నుండీ ఉన్న గొడవ ఇదే. ప్రశ్నలవే, సమాధానం ఇంకా దొరకలేదు.
జై గొట్టి ముక్కల వారు,
Deleteఉపనిషత్తుల కాలం అంటున్నారు. అప్పటికి మనకి ఆ ప్రశ్న వెయ్యడానికి జ్ఞానం వచ్చింది అన్న మాట. అంటే ఆలోచనా పరిధి, దేముడు అన్న దానికి నిర్వచనం ఏమిటి అన్న దానికి కొంత పరిధి హెచ్చు అయ్యిందేమో ఆ కాలానికి.
ఉపనిషత్తులో ఒక చోట , ఇంద్రుని కి ధన్యవాదాలు తెలిపుతారు. నీ ద్వారానే కదా నీకన్నా పై నున్న 'ఆ పై వాణ్ని తెలుసు కోగలి గాము. నీకు ధన్య వాదాలు సుమీ అని !
అంటే, మానవుని మేధస్సు పెరిగే కొద్దీ, దేముడు (దేవుడు- దేముడు ఈ దేముడు అన్న పదం ఎట్లా వచ్చింది అని శ్యామలీయం మాష్టారి ప్రశ్న సమాధానం ఎవరు చెబుతారు ?) అగ్ని మీళే పురోహితం నించి మొదలయ్యి , ఆ పై ఆ పై, 'నాసదాసీన్నో సదాసీత్ ' ని దాటి, కస్మై దేవాయ హవిషా విదేమా అన్నదాక వచ్చింది అన్న మాట !
అబ్బా ఈ కామెంటు రిప్లై టపా కన్నా పెద్దది అయ్యేటట్టు ఉందే మరి !
చీర్స్
జిలేబి.
భలే అడిగేడు పిల్లోడు. దేవుడికి ఒక మమ్మి ఉంది. ఆమె పేరు దేవత! వాళ్ళ మమ్మీ ఎవరని అడిగితే "చూడు నాన్నా నా మమ్మీ ఎవరో నీకు తెలియదు కదా? అలానే దేవత వాళ్ళ మమ్మీ ఎవరోకూడా నాను తెలియదు!" అని చెప్పాల్సిందండి :)
ReplyDeleteTaken for granted అభిప్రాయాలు లేనివాళ్ళూ, పిల్లలూ మాత్రమే అడగ్గల ప్రశ్న.
ReplyDeleteజిలేబీగారూ,
ReplyDelete"దేముడు" అనే మాట యెలా ప్రచారంలోకి వచ్చిందో తెలియటం లేదు. సరియైన రూపం "దేవుడు". దేవ శబ్దం తెలుగు డుమువులతో దేవుడు అయింది.
దేవుడి మమ్మీ అదితి . డాడీ కశ్యప ప్రజాపతి :)
ReplyDeleteగొట్టిముక్కలవారంటారూ, "ఉపనిషత్తుల కాలం నుండీ ఉన్న గొడవ ఇదే. ప్రశ్నలవే, సమాధానం ఇంకా దొరకలేదు" అని. కాని శ్రీమద్భగవద్గీత విభూతియోగంలో భగవానువాచగా యిలా ఉంది గదా,
ReplyDeleteన మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః|
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః|| 10-2 ||
గీత ఉపనిషత్సారమూ, స్వయంగా బగవన్ముఖంగా జనించినదీ. పై శ్లోకంలో 'అహ మాదిః' అని భగవానువాచ స్పష్టంగానే ఉందిగదా. ఇంక చిక్కేముంది?
నాకు సంస్కృతం అర్ధం కాలేదు. దయ చేసి తెలుగులో చెప్పగలరా, థాంక్స్.
Deleteదేవుడే సృష్టికి మూలం అయితే ఆ దేవుడుని సృష్టించింది ఎవరు? ఒకవేళ దేవుడు స్వయంభువు అయితే, ప్రపంచం కూడా ఎందుకు కాకూడదు?
ఈ ప్రశ్న జటిలమయినది, కొట్టి వేయడం సులభం కాదు. అయితే ఈ టపా ఆస్తిక నాస్తిక వాదాల గురించి కాదని, చిన్న పిల్లల గురించని అనుకుంటాను.
PS: బగవన్ముఖంగా? భగవన్ముఖంగా?
గొట్టిముక్కలవారూ
Deleteభగవన్ముఖంగా అనేదే సరైన గుణింతం. ముద్రారాక్షసాన్ని యెత్తి చూపినమ్దుకు ధన్యవాదాలు.
దేవుడిని సృష్టించింది ఎవరన్న ప్రశ్నకు తావులేదు. పై శ్లోకంలొ కృష్ణుడు తానే మొట్టమొదటి తత్వాన్ననీ సమస్తమూ తాన సృష్టి అని చెప్పాడు గదా. తార్కికంగా దేవుడిని సృజించింది ఫలానా అంటె సదరు ఫలానాను సృజించింది యెవరు అని తమరు తిరిగి ప్రశ్నించే అవ్యవస్థ వస్తుంది. అది అనంత ప్రశ్నాశ్రేణి అవుతుంది. ప్రాథమికమైన ప్రతిపాదనగా దైవము నయిన తానే ఆది అని భగవానుని నిష్కర్ష. నమ్మటం నమ్మక పోవటం వ్యక్తిగత వ్యవహారం. అందరినీ నమ్మించటం శాస్త్రానికీ మతానికీ కూడా అసాధ్యం కదా.
శ్లోకార్థం దగ్గరకు వస్తే, నాకు 'ఆది' అనే దానిని దేవతలు మహర్షులూ కూడా భావించలేరు (అటువంటిది లేదు కాబట్టి). నేనే వీరందరినీ సృజించాను అని.
ప్రశ్న చిన్నపిల్లవాడి నుంది వచ్చినదని నాకు స్పృహలొనే ఉన్నది. ఉపనిషత్ప్రస్తావన నాకై నేను తెచ్చినది కాదని మీకూ తెలుసు.
ప్రశ్న జటిలమని అనుకోదలచినప్పుడు నా అభ్యంతరం లేదు. నాకైతే జటిలం కాదు. గందరగోళపడదలచినప్పుడు దానికి అవకాశాలు యెప్పుడూ ఉంటాయి.
పద్యాన్ని చాలా బాగా వివరించారు, థాంక్స్.
Deleteఉపనిషత్తుల ప్రస్తావన తెచ్చింది నేనే. ప్రశ్నోపనిషత్తు లోని ప్రశ్నలకు ఇంకా జవాబు దొరకలేదనే నా అవగాహన.
ఈ టపా ముఖ్యాంశం నాస్తిక వాదం కాదు కాబట్టి, మీకు అభ్యంతరం లేకపోతె ఈ విషయాన్ని మరో సారి (at a more appropriate forum) చర్చిదాం.
hypothetical question నా వల్లకాదు.....
ReplyDeleteఏదో అబద్దం చెప్పి తప్పించుకోవాల్సిందే....
ఎంత మంచి ప్రశ్న! మనం ప్రశ్నించటం మర్చిపోయాం.
ReplyDeleteninna maa vaaDu kUDaa Ilaagae aDigaaDu
ReplyDeleteMummy who are sri maha Vishnu's mother and father ?
naaku correcT ga telIdu telusokoni cheputa ani annanu. evarikina teliste cheppanDi please.
శ్రీమహావిష్ణువుకు పితరులు యెవరూ లేరు.
Deleteఆయన అనాది. అంటె ఒకప్పటినుండి ఉండతం మొదలయినవాడు కాదు. ఎప్పుడూ ఉన్నవాడు.
నేను పైన ఉటంకించిన గీతాశ్లోకాన్ని మననం చేసుకోండి.
శ్రీకృష్ణుడూ విష్ణువూ ఒకరే. కాబట్టి పై శ్లోకాన్ని విష్ణుప్రోక్తం అనుకోవాలి.
'లక్ష్మీపతి రభూత్ స్వయం' అని ఆయనే స్వయంగా శ్రీకృష్ణుడుగా వచ్చాడు.
పిల్లలడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలంటే ఓపిక, తెలివి, లౌక్యం ఉండాలి. నాకీ మూడూ లేవు. అందుకే పిల్లలకి కొద్దిగా దూరంగా ఉంటా.
ReplyDeleteకామెంట్లతో మా బుర్రలకి పని పెట్టే మీరు కూడా ఇబ్బందిలో పడటం ఆశ్చర్యం! (కొంచెం ఆనందం కూడా!)
డాక్టరు రమణ గారు,
Deleteహాశ్చర్యం కన్నా మీ ఆనందమే ఎక్కువ కాన వస్తోంది సుమీ !
మంచి మాట చెప్పారు, ఓపిక, లౌక్యం, తెలివి గురించి. నూరు పాళ్ళు మొదటి కావాలి లేకుంటే పిల్లలు మరీ ఈ పెద్దోళ్ళు మొద్దు వారు సుమీ అని తీర్మానించు కొంటారు. (అది నిజమే అనుకొండీ, అయినా అలా తీర్మానిస్తే మనకు ఒప్పు కోడానికి అహం కొంత అడ్డొస్తుంది కదా మరి !)
ధన్యవాదాలు.
చీర్స్
జిలేబి.
జిలేబి గారి తిక్క కుదిరింది.......దహా.
ReplyDeleteహన్నా బులుసు గారు,
Deleteదహా అంటు మరీ దగా చేస్తున్నారు. తిక్క కుదిరింది అంటారా ! ఆయ్!
మీ రాబోయే టపా మే అరవై ఐదుకు ఒకటి రాయండి మాష్టారు, కష్టే ఫలే వారి 'శుభ దినానికి'!
చీర్స్
జిలేబి.
.చీర్స్ జిలేబి gariki,
ReplyDeletemaa papa oka sari adigindandi,
devvudu enduku avasaram ani, ginjukovalasivachhindi,
aithe simple ga ade thelchesindi;
dandam pettukovadanikani,pillalu chaala great.
33 చీర్స్
the tree గారు,
Deleteధన్యవాదాలు! యస్, పిల్లలు చాలా గ్రేట్ !
ఆ పై వాడు, ఆల్వేస్ క్రియేటివ్. తన పాత తప్పుల్ని సరిదిద్దు కుంటూ, ఫ్యూచర్ జనరేషన్ ని పోను పోను మరీ ఇంటలిజెంట్ చేసేస్తున్నాడు !
చీర్స్
జిలేబి.
@ జిలేబి जी !
ReplyDeleteas usually మళ్ళీ మీనుంచి ఒక ఆలోచనాత్మకమైన post వచ్చింది!!
comments కూడా అదుర్స్!
ఇక్కడ bloggers తో ఒక చిక్కు ఉందండి,
కొందరికి అన్నీ తెలుసు మరికొందరకీ basics తెలియవు అన్నట్లు ఉంటుంది వ్యవాహారం ! కాని అందరు తెలుసుకోవాల్సింది ఎంతో కొంత మిగిలే ఉంటుంది సుమండీ!
అందుకే చాలా చోట్ల స్పందించ కూడదనే స్థితికి వచ్చేసింది మనసు
కాని మీరు భలే చమత్కారులండీ రాక రాక మీ blog కి రాగానే పరమాత్మ స్పృహ కలిగేలా మీ మనవలుం గారి ప్రశ్న అనే మిష తో ఒక post ని ఇచ్చారు కదూ!
నేను ఇదే ఆలోచిస్తున్న రేపు మా వూరు వెళ్లి నప్పుడు నా మేనకోడలు ఇదే ప్రశ్న చనువుగా నన్ను అడిగితే ఏమి బదులు చెప్పాలి?
అని ఆలోచిస్తున్న ....
ముందు ప్రశ్న దేముడు ? దేవుడు అంటే ఆ పాప/బాబు ఉద్దేశ్యం తెలుసుకోవాలి
మీరు సూచించిన విధంగా సగుణ బ్రహ్మం మానుషావతారం గా వచ్చిన క్రిష్ణుడికో రాముడికో అయితే parents ఎవరంటే బదులు చెప్పొచ్చు
అలాకాక వాడు నిర్గునానికి ఎసరు పెడితే
దాని మూలం చెప్మా అంటే మటుకు మన పని గోవిందా ?
ప్రశ్నకి ప్రశ్నే సమాధానం గా చెప్పి ముందు క్వశ్చనర్ ని సగునమో నిర్గునమో తేల్చుకో మనవచ్చు పెద్దోల్లైతే...కాని పసి కూన లాయే,
సమాధానం చెప్పాలి వాళ్ళు సంతృప్తి చెందేదాక?
అసలు ఇలాంటి questions మనకు ఎందుకు రావు?
అవును ఇక్కడ ఇంతమంది ఇన్ని రకాలు గా comment పెడుతుంటే
దీపస్తంభం (దేవుడి)లా అలా గమ్మునున్నారేమిటి?
సరే కాని ఈ క్రింది లింక్ లో
అద్వైతులు ఇంకా అచల సిద్ధాంతం వాళ్ళు దేవుడిని ఎలా define చేశారో simple stories లో
మీలా చమత్కారంగా సైద్ధాంతికంగా శాస్త్ర బద్ధంగా చెప్పారు తప్పకుండా చూడండి ....!!
http://achalayoga.blogspot.in/2009/05/where-is-god.html
ఇదే కథను కాస్త ఎంచక్కా తెలుగులో చూడాలనుకునే నాలాంటి ఆంగ్ల భాషా బాధితులకు
http://sarasabharati.wordpress.com/2012/05/05/%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B0%A7%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%81%E0%B0%A7-1/
ఇక్కడ సగం post లో మిగితా సగం comment box లో లభించును
మీరు reply ఇవ్వకుంటే ఊరుకొనేది లేదు .....సుమా !!
ఇవి అందరు చూడతగినవే మీ అభిప్రాయలు తెలియపరచండి
?!
ఎందుకో ఏమో గారు,
Deleteమరీ తీక్షణమైన ఆలోచనలో పడి నట్టున్నారు. ! ఇది ఎడతెగని ప్రశ్న. ఎద తో అర్థం చేసుకుంటే అర్థం సులభం! 'ఏడ' ఏడ అంటే, ప్చ్ సమాధానం శూన్యం . ధన్యవాదాలు.
చీర్స్
జిలేబి.
"ఇది ఎడతెగని ప్రశ్న. ఎద తో అర్థం చేసుకుంటే అర్థం సులభం! 'ఏడ' ఏడ అంటే, ప్చ్ సమాధానం శూన్యం"
ReplyDeleteమీరు చదివేదేమో వేదాలాయే! నాకు మీరాతల్లో వేదాంతం ధ్వనిస్తూ ఉంటుంది ....
జిలేబి గారు చెప్పండి ""ఎడ తెగని ప్రశ్న?""
నీ ప్రశ్నకు నీవే? ఎవ్వరో బదులివ్వరుగా song జ్ఞాపకం వస్తోంది
నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరు గా అని మాత్రం అనకండి
ఆశా జీవినండి !! ఆశే శ్వాసగా బ్రతుకుతున్న వాడిని మరీ!
?!
This comment has been removed by the author.
ReplyDeleteదేవుడు యొక్క తల్లి పేరు భగవతి అని తండ్రి పేరు భగవంతుడు అంటే బాగుంటుందని అనిపించి ఇలా వ్రాసానండి.
ReplyDelete...........
మీ మనవడు భలే అడిగాడండి. ఇలాంటి ప్రశ్నలకు పిల్లలకు అర్ధమయ్యేటట్లు జవాబు చెప్పటం చాలా కష్టం. ఈ టపా నిన్ననే చదివాను.
నాకు తెలిసినంతలో ఇలా రాయాలనిపించి రాసానండి.
దేవుడు యొక్క తల్లి పేరు భగవతి అని , తండ్రి పేరు భగవంతుడు అని పిల్లలకు చెప్పవచ్చేమోనండి.
మరి వారి యొక్క తల్లితండ్రుల పేర్లు ఏమిటి ? అని పిల్లలు మళ్ళీ ప్రశ్నిస్తే అలా .... అలా అనంతంగా చెప్పాలంటే .....వారి తల్లితండ్రులు...వారి .....తల్లితండ్రుల పేర్లు కూడా భగవతి భగవంతుడు అనే అంటారనీ .... వారి పేర్లు మారవని కూడా చెప్పవచ్చు..అని నాకు అనిపించిందండి..
ఒక వృత్తానికి ఆది ఏదో అంతము ఏదో సరిగ్గా చెప్పలేము కదా ! అలాగే కొన్ని విషయాలు పజిల్ గానే ఉంటాయి.
ReplyDelete