శుభోదయం !
వాజమ్మ అంటే దద్దమ్మ అని నిఘంటువు చెప్పింది.
ఉషో వాజేన వాజిని ప్రచేతాహ అని వేదం చెప్పింది.
అంటే ఉషస్సు దద్దమ్మ ల లో పెద్ద దద్దమ్మ అన్న మాట !
అదేమో , ఈ ఉషస్సు కి డైలీ అలా వచ్చేసి దద్దమ్మ లా తెల్లారి మన ఇంటి ముందర వాలి పోవాలని ముచ్చట.
దద్దమ్మ అయినా దొడ్డమ్మే ఉషా దేవి.
వాజి అంటే గుర్రమట. మళ్ళీ నిఘంటువే చెప్పింది.
అంటే ఉషస్సు గుర్రాలలో కెల్లా పెద్ద గుర్రమా ? జేకే .
సూరీడు సప్త అశ్వాల మీద సవారి అయి వస్తాడంట.
కాబట్టి ఉషా దేవి ఈ అశ్వాల కి మహారాణి. సో, ఉషో వాజేన వాజిని.
వాజ అంటే యాగం/యజ్ఞం అట. నిఘంటువు చెప్పింది.
యజ్ఞాలలో కెల్ల గొప్ప యజ్ఞం అన్న మాట ఉషస్సు .
మళ్ళీ పురాణీ దేవీ యువతిహి అని ఉషస్సు గురించి వేదం చెప్పింది.
అంటే, ఈ ఉషస్సు, ఉషా దేవి, ఓల్డ్ ఉమన్ అన్న మాట. కాని నిత్య యవ్వని (అబ్బో మన లా అన్న మాట!)
సో, శుభోదయం !
చీర్స్
జిలేబి
మీ పేరు గణపతా? చూ: చిలకమర్తి వారి గణపతి నాటకము
ReplyDeleteసీతారామం
ఏమండోయ్ సీతరామం గారు,
ReplyDeleteమీ పేరు గణపతా అని ఎందుకు అడిగారు ?
చీర్స్
జిలేబి.
క్లూ కూడా ఇచ్చాను కదండీ.. చిలకమర్తి వారి గణపతి అని.. పట్టుకుంటారనుకున్నా... శ్రీ రఘు రామ చారు తులసీ దళ ధామ.. అన్న దాశరధీ శతక పద్యానికి అర్ధము గణపతి వివరించినట్టు ఉంది మీ ఉషో వాజేన.. వ్యాఖ్య అని సరసము గా వ్యాఖ్యానించాను అంతే...
ReplyDeleteభవదీయుడు
సీతారామం
ఏమండోయ్ సీతారామం గారు,
ReplyDeleteఇంతకీ, గణపతి దాశరధీ శతక పద్యానికి ఏమని అర్థం చెప్పాడు ?
మొత్తం మీద మీరు గణపతి మీద మంచి ఉత్సుకత రేపారు. ఎవరీ గణపతి అబ్బా ?
జిలేబి.
మొత్తం చెప్పలేను కానీ, రాముడు చారు కాచమన్నాడనీ, కరివేపాకు లేకపోతె తులసి ఆకు వెయ్యమన్నాడనీ బహు గమ్మత్తు గా ఉంటుంది..సునిశిత హాస్య ప్రియులంతా చదవ వలసిన నాటకము గణపతి. వీలైతే చదవండి.
ReplyDeleteమొత్తానికి చాలా ఉత్సుకతే కలిగించినట్టున్నాను నా చిన్న మాట తో.. ఒక పోస్ట్ వ్రాసారు మీరు..
సీతారామం