'మా ఆవిడ బంగారం ' అన్నారు మా అయ్యరు గారు.
పొద్దుటే లేచి హిందూ పేపరు చదువుతూ చెప్పడం తో,
'ఏమండీ, అయ్యరువాళ్ , పొద్దుటే, మరీ పొగిడేస్తున్నారు ఏమిటీ కధ , కాఫీ ఏమైనా పెట్టాలా' అన్నా పొద్దుటే లేచి తనే కాఫీ పెట్టుకుని తాగే పెద్ద మనిషి ఇట్లా పొగి డితే , సందేహం రాక పోదు మరి, దేనికో, స్పెషల్ గా ఐసు పెడుతున్నారు సుమీ అని మరి.
అందుకే అలా అడిగా.
అదికాదోయ్, నిజంగా నే చెప్పా, మా ఆవిడ బంగారం అన్నారు మళ్ళీ.
ఎందుకో మరి ? అడిగా ఈ మారు సందేహం తీర్చుకోవడానికి.
'ఇట్లా చూడు, హిందూ వారు ఇవ్వాళ్టి పేపర్లో ఏం రాసారో మరి అన్నారు మా అయ్యరు గారు.
'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్న శీర్షిక కింద, పాత కాలం ఎప్పుడూ గోల్డె అని నొక్కి వక్కాణించారు హిందూ దిన పత్రిక వారు.
ఆహా చూసావా, ఓల్డ్ ఈజ్ గోల్డ్, సో నువ్వో మరి ఓల్డే కదా.. అందుకే గోల్డ్ అన్నా అన్నారు.
అనరూ మరి, తనూ బోసి నోటి ఓల్డ్ మేను ఆయే మరి !
జోగీ జోగీ రాచుకుంటే బూడిద రాలుతుందని 'సా' మేత' ! సో ఇట్లా ఓల్డూ , ఓల్డూ జోకులేసు కుంటే, మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు మరి !
అద్సరే అయ్యరు గారు, మరి మీరు మాత్రం గోల్డ్ కారూ.. అన్నా మురిపెం గా..
అవునేవ్, నేనూ గోల్డ్ కదా మరి. ఇంకా సరిగ్గా చెప్పా లంటే, నీ 'గోల్డు' కొనుగోళ్ళ కి నేను 'కాపిటలిస్ట్ ని కదా మరి ! అన్నారు ఈ మారు.
అబ్బో, వీరు, కథ ఏమి చెప్పినా గోల్డు లేకుండా చెప్పరు సుమీ ! అదేమీ గోల్డు యవ్వారమో. గోల్డు మాయో ! ఆ గోల్డు కనిపిస్తే చాలు ఇక అంతే, వీళ్ళు అన్నీ మరిచి పోతారు సుమీ అన్నారు మళ్ళీ. !
అంతే, కదా మరి, ఓల్డ్ ఈజ్ గోల్డు అయినప్పుడు, గోల్డు మురిపాలు మా కుండవా మరి !
చీర్స్
జిలేబి.