రెండు రోజులల్నించి మా మనవడు జగన్ బాబుని వాళ్ళెవరో సి బీ ఐ వాళ్ళు నానా ప్రశ్న ల తో వేధిస్తా ఉంటే, పోనీ లే మనవాడి తో కొంత సేపు మాట్లాడి ఊరట కలగ నిస్తాం అనుకున్నా,
పాపం ఎంత గా 'కలవర' పడి పోయి ఉన్నాడో తండ్రి ని పోగుట్టు కున్న తనయుడు, ప్చ్, అయ్య పోయినప్పటి నించి అబ్బాయికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో అని బాధ పడి పోయా.
ఒరే అబ్బీ నీ కెన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా అన్నా ఇంటికివెళ్లి.
అప్పుడే ఏడు గంటల పై బడి అదేదో క్లారిఫికేషన్ సెషన్ అట, సి బీ ఐ వాళ్ళ తో అది ముగించుకుని వచ్చి ఉన్నాడు. మధ్య లో టీవీ లో కూడా చూసానే బాబు మరీ కలత గా వున్నాడని టీవీ వాడు హోరు మని చెబ్తున్నాడు కూడాను.
జగన్ బాబు తేలిగ్గా నవ్వేసి, బామ్మా, ఏమిటి కష్టాలు అన్నాడు.
అదేమిరా అబ్బీ అట్లా ఏడు గంటల సేపు నిన్ను నిఖార్సుగా ప్రశ్న ల మీద ప్రశ్నలు వేశారట గా అన్నా.
బామ్మోయ్, చిన్నప్పుడు నాన్న ని నేను కూడా చాలా ప్రశ్న ల తో పరేషాన్ చేశా. అవన్నీ ఆయన పట్టించు కున్నా డంటావా ? అన్నాడు.
ఏమంటావురా అబ్బీ అన్నా
అదేలే, వాళ్ళేదో వాళ్ళ స్టైల్ లో ప్రశ్నలడుగు తారు, అమావాశ్య కీ అబ్దుల్ కాదర్ కీ సంబంద్ క్యా హాయ్ అని. మనం మన సమాధానా లేవో చెప్పు కుంటాం. అంతే అన్నాడు..
అదేట్లారా అబ్బీ , నువ్వు చాలా 'కలవల' పడి పోయావని టీవీ వాడు హోరెత్తు తుంటే, ఇలా నిమ్మళం గా ఉండావు !
వాళ్లకి ఇంటర్వ్యు ఇచ్చేటప్పుడు అలాగే పోస్ పెట్టా బామ్మా.
ఎందుకురా అబ్బీ.
ప్రజలకి తెలియాలిగా తమ ప్రియతమ నాయకునికి ఎన్ని కష్టాలో అని మరి.
అంతే అంటావా ?
అంతే.
మరి రేపటి మాటలో ?
వాళ్ళు క్లారిఫికేషన్ అడుగుతారు. నేను కూడా క్లారిఫికేషన్ ఇస్తా. వాళ్ళు దానికి క్లారిఫై చెయ్యి అంటారు. నేను దానికి క్లారిఫై అని మళ్ళీ చెబ్తా. ఇట్లా...
సో, మొత్తం మీద, క్లారిఫీ కేషన్ సెషన్ అని టైం పాస్ అండ్ టీం పాస్ కాలక్షేపం బటాణీ లన్న మాట!
చీర్స్
జిలేబి.