Friday, May 25, 2012

బ్లాగ్ గాంధీ కాలక్షేపం కబుర్లు శర్మ గారికి హార్ధిక శుభాకాంక్షలు

బ్లాగ్ గాంధీ కాలక్షేపం కబుర్లు శ్రీ  శర్మ గారు,

మీ జీవితం లో 'బంగారం' మీ శ్రీమతి ప్రవేశించిన దినం ఇవ్వాళ (సరియనే అనుకుంటాను!)

ఇది సరిగ్గా ఓ యాభై సంవత్సరాల మునుపు జరిగినట్టు మీ బ్లాగ్ లో చదివి నట్టు గుర్తు.

సో , మీ కిదే , యాభై వసంతాల గ్రీటింగ్స్!

మీ జీవితం అమోఘం. మీ జీవితం లో జరిగిన సంఘటన ల ఆధారం గా మీరు బ్లాగ్ లో సహృదయమై    మీ జీవిత అనుభవాలను టపాల ద్వారా   పదుగురి తో పంచుకోవడం, తద్వారా మీరు పదిమందికి మార్గదర్శకులు గా ఉండడం ఈ పంచ దశ లోకం లో జరిగిన అపురూప విశేషం.

శుభాకాంక్షల తో

చీర్స్
జిలేబి.

(శ్రీ శర్మ గారి ఫోటో కర్టసీ -
 (దీనిని తెలుగు లో చౌర్యం అందురు ) !-

12 comments:

  1. మీద్వారా శ్రీ శర్మగారి దంపతులకు శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. జిలేబిగారికి,
    శర్మ దంపతుల నమస్కారాలు. మీరు మాపై చూపిన అభిమానంలో తడిసి ముద్దయిపోయామని, మీ అమృత హృదయానికి ఆనందిస్తూ భగవంతుడు మీకూ, మీ కుటుంబానికీ ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.నాకు మీరు టపా రాసినట్లుగా ముందే ఉప్పందించిన డాక్టర్ రమణ గారికి ఆశీర్వచనాలు.
    శర్మ దంపతులు.

    ReplyDelete
  3. శర్మ గారి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు . మీ ఆదర్శ ప్రాయమైన జీవన ప్రయాణం అందరికి ఆదర్శం కావాలని కోరుకుంటూ..పూజ్యులైన మీ దంపతులు ఇరువురికి పాదాభి వందనం చేస్తూ..
    వివాహ దినోత్సవ శుభాకాంషలు.తో.. మీరు సంపూర్ణ ఆయువారోగ్యములతో..వర్ధిల్లుతూ.. మంచి విషయాలని,మీ అనుభవాలని బ్లాగ్ పోస్ట్ ల రూపంలో అందరికి పంచుతూ ..చైతన్యవంతం చేయాలని కోరుకుంటూ.. నమస్సుమాంజలి.

    ReplyDelete
  4. ఆదర్శ దాంపత్యానికి ప్రతీకలైన మీకు అమ్మగారికి శుభాకాంక్షలు .
    అన్నట్లు ఇరోజు మాపెల్లిరోజుకుడా మీవంటి పుణ్యదంపతుల ఆశీర్వాదములు కోరుతున్నాను .

    ReplyDelete
  5. శ్రీ సీతారామ కళ్యాణోత్సవము చూసిన చేసిన వారలకు నిత్య శుభములు కలుగుతాయట. నిజంగా!
    వధువు లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవిల ఏకాత్మతా రూపంతో పచ్చగా నిండైన పసన్నవదనంతొ మా వదిన,
    వరుడు త్రిమూర్తుల స్వరూపంతో కష్టించండి, ఫలాన్ని పొందండి, అంటూ విజ్ఞత్తతో బ్లాగులు నడిపే మా అన్నయ్య. వీరి వివాహ దినోత్సవ సందర్బంగా ఆ ఆది దంపతులను ఈ వధువరులని ఆశిర్వదించమని కోరుకుంటున్నాము. వీరికి మా హార్ధిక శుభాకాంక్షలు.
    సూర్యలక్ష్మి, ఫణిబాబు

    ReplyDelete
  6. శర్మగారి దంపతులకు, దుర్గేశ్వర గారి దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలండి...
    ( విషయం తెలియజేసిన జిలేబీ గారికి ధన్యవాదములు. ).

    ReplyDelete
  7. శర్మగారి దంపతులకు, దుర్గేశ్వర గారి దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలండి...
    ( విషయం తెలియజేసిన జిలేబీ గారికి ధన్యవాదములు. ).

    ReplyDelete
  8. శ్రీ శర్మ దంపతులకు వివాహ శుభదిన శుభాకాంక్షలు. పార్వతి పరమేశ్వరులకు వందనం.

    శ్రీ దుర్గేశ్వర దంపతులకు వివాహ శుభదిన శుభాకాంక్షలు.

    జిలేబి గారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  9. శర్మ గారూ, మీ దంపతులిరువురికీ "golden wedding" శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. శర్మ గారి picture పోస్ట్ చేసినందుకు మీకు మెనీ మెనీ థాంక్స్
    "బ్లాగ్ గాంధీ" గారు అని మీరు సంభోదించడం చాలా నచ్చింది!
    మరొక్కసారి శర్మ గారికి దంపతులకు శుభాకాంక్షలు!

    ReplyDelete
  11. మిత్రులందరికీ శర్మ దంపతుల నమస్కారాలు. జిలేబీ గారి బ్లాగుని నేను కబ్జా చేయడం బాగోదు. నా బ్లాగులో స్పందిస్తా మీ అందరినీ పేరు పేరునా.
    మీ అభిమానానికి
    ధన్యవాదాలు

    ReplyDelete