Friday, October 19, 2012

Master of Chaos Administration!(MCA)


' మన దేశం లో అన్ని విశ్వ విద్యాలయాలో మనం MCA -  - మాస్టర్స్ అఫ్ కేయాస్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రేడ్యు వేషన్  పెట్టిన్చాలండీ అన్నా 'మన మోహనుల వారితో.


అబ్బా, మీకు ఇట్లాంటి అయిడియా లు ఎట్లా వస్తాయండీ అన్నారాయన.

ఏముందండీ మన పండిట్ గారు ధామ్మని సిటి బ్యాంకు నించి బయట పడి  పోయారు. ఆ వార్త చదివే వచ్చిందండీ అన్నా.

అంటే ?

ఓ ఐదు సంవత్సరములపు మునుపు సిటి దివాలా తీస్తా నంటే, ముక్కు బట్టి పండిట్ ని బెట్టి రెండు సంవత్సరాలలో లాభాలకు తెచ్చేరు. ఈ మానవుడు మాత్రం తక్కువ వారా? రెండు సంవత్సరాల బాటు ఒక్క డాలరు కి పని చేసి ( మన రామారావు గారి లా అన్న మాట - ఆయన ఓ రూపాయి అన్నారు వీరు ఓ డాలరు అన్నారు అంతే  తేడా మరి ) లాభాలు వచ్చాకే నేను పూర్తి జీతం అడుగుతా అని శపథం పట్టేరు. అట్లాగే ఓ రెండు సంవత్సారాల తరువాయి బ్యాంకు లాభాలలో కోచ్చేక ఓ రెండు మిలియన్ డాలర్ల సంవత్సరాదాయానికి వచ్చేసేరు. ఇంత భోగట్ట ఎట్లా దొరికింది జిలేబీ అంటారా ? అంతా మన ది హిందూ వారి చలవ . మరి బ్యాంకు బతికి బట్ట కట్టింది కదా - ఇక హుష్ కాకి అన్న మాట పండిట్ గారికి ఉద్వాసన మరి !

ఇంతకీ, ఈ సమీకరణం లో తేలిన విషయం ఏమిటంటే, మన ఇండియన్లు కేయాస్ మేనేజ్ మెంటు బ్రహ్మాండంగా చేస్తారని  తేలిం దన్న మాట. ! (మన మోహనుల వారు మాత్రం తక్కువా ? తొంభై ప్రాంతం లో ఆయన కూడా ఇట్లాంటి స్థితి లో నే కదా దేశాన్ని బయటకు తీసుకొచ్చేరు మరి ?)

కాబట్టి మన దేశ భావి పౌరులకి  MCA - - మాస్టర్స్ అఫ్ కేయాస్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రేడ్యు వేషన్  లో తర్ఫీదు ఇచ్చి (ఇది జన్మతః ఇండియన్ లకి అబ్బిన కళ  అంటారా? నో ప్రాబ్లెం, అదీ సరి అయిన పాయింటే మరి !) ప్రపంచ మీద పంపిచాలి మరి !

సరే, మీకు ఓ ప్రశ్న (అబ్బ, టపా చదివితే ప్రశ్నలకి జవాబివ్వాలా అంటారా ?) ఈ మధ్య ఇట్లాగే ఒక ఇండియన్ మానవుడు మరో ప్రఖ్యాత ఇంటర్నేషనల్ బ్యాంకుకి అత్యున్నత పొసిషన్ లో కొచ్చేరు. అంటే ఈ మానవుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంటు కోసమేనా మరి ? అది అయ్యేక వీరికి కూడా టాటా బాయ్ బాయ్ నా మరి ?

ఏమంటారు ?

చీర్స్
జిలేబి.

Monday, October 15, 2012

తెలవారదేమో స్వామీ !


తెలవారదేమో స్వామీ, నీ తలపుల మునుకలో ... అని పాడేసేరు  ఆచార్యులవారు.

స్వామీ తలపుల మునుకల గురించి మాటేమో గాని, మా అయ్యరు  వారి తలపుల మునుకలో మేము పరేషాను ! మొదట్లో మా అయ్యరు  వారికి మనసు పారేశాను , దాని పర్యవసానం ఇప్పుడు పరేషాను !

జిలేబీ నీకో సంబంధం తెచ్చేరు మీ నాన్న గారు చెప్పింది మా బామ్మ.

నేను చేసుకోను అన్నా.

ఫోటో తెచ్చేరు లే చూసాకే చెప్పు అంది బామ్మ, అబ్బా ఈవిడకి చాలా టెకినీకులు తెలుసు సుమీ అంది మనసు.

చూస్తె పోలే. చూసి నచ్చలే  అని చెబ్తే పోయే అనుకున్నా. మా బామ్మ నే వద్దంటే కాదంటుందా అన్న రాంభరోసా అన్న మాట. బామ్మ పెంపకమాయే  మరి మనది.

బ్లాకు అండ్ వైటు ఫోటో. అయ్యరు మూడు పట్టీలు నుదిటి పై పట్టి ఉన్నారు. బానే ఉన్నాడను కున్నా.

ఏం  చేస్తారేమిటి ? అడిగా

మా బామ్మ ఊరుకుంది.

మళ్ళీ అడిగా .

'వాళ్ల్లకి  హోటలు ఉందట అది ' అంది బామ్మ  వంటా వార్పూ బాగా వచ్చట ' మళ్ళీ ఆశ పెట్టింది. అట్లా అనటం లో మరో ఆంతర్యం కూడా ఉందాయే మరి. బామ్మ పెంపకం లో లేడీస్ కి వంట నేర్వడమన్నది  లేనే లేదు. కాబట్టి వంట చెయ్యడం లో జిలేబీ జీరో. కాబట్టి బామ్మ  జిలేబీ చూసుకో నీకు మరో లాభం అన్నట్టు చెప్పింది ఆ ' వంటా వార్పూ బాగా వచ్చట' అని చెప్పటం లో '

'అరవ దేశం కాబట్టి తెలుగు తెలీదు, హిందీ అసలే రాదు' మళ్ళీ అంది.

నన్ను హిందీ ప్రావీణ్యత ఉన్న మేధావి వర్గం గా మా బామ్మ తయారు చేసిందాయే  మరి ! మా ఫ్యామలీ లో నేనే మొట్ట మొదట హిందీ తెలిసిన దాన్న ట ! కాబట్టి ఇది మైనసు పాయింటు ఆయే మరి అయ్యరు  వారికి!

మొత్తం మీద ఇట్లాంటి శుద్ధ పప్పుచారు అయ్యరు  వారిని మాకంట బెట్టి మా బామ్మ బాల్చీ తన్నేసింది.

అబ్బ , మనసు పారేసుకుంటే, పరేషానే  పరేషాన్ మరి !

కాబట్టి పారేసుకున్నా పరేషాను  కాకండీ మరి !

జిలేబి.

Thursday, October 11, 2012

గోడ మీద పిల్లి


ఓ గోడ మీద ఓ పిల్లి ఉండే దట 

మరి ఓ రోజు ఆ గోడ డామ్మని  కూలి పోయిందట 

గోడ మీద పిల్లి ధభీల్మని కింద పడిందట 

దానికి భయమేసి మళ్ళీ ఏ గోడా  ఎక్క కూడదని అనుకుందట 

కొన్ని రోజుల తరువాయి కూలిన గోడని కట్టించారట 

ఆ గోడని చూస్తూనే పిల్లికి ఆతురత కలిగిందట 

ఒక్క ఎగురు పై కెగిరి గోడ మీద కూర్చుని తన తోకని ముడిచి 

చుట్టూ కలయ జూసిందట 

అబ్బా , మళ్ళీ గోడ మీద పిల్లి!


చీర్స్ 
జిలేబి.
 

Saturday, October 6, 2012

ఎంతెంత దూరం ?

 
రెండు చుక్కల మధ్య 
నిలువ గీత 
అతి తక్కువైన దూరం
అది గణితం 
 
మరి ఈ జీవి ఆ పై జీవి 
మధ్య దూరం ఎందుకు మరీ ఎక్కువ ?
 
మరో బిందువు ఎక్కడుందో తెలీకా ?
దూరమనేది లేనే లేక పోవడం వల్లా?
నిలువు గీత లోపయనిస్తే,
రెండో బిందువు దర్శనం అవుతుందా ?
అసలు రెండో బిందువనేది లేనే లేదా ?
రెండు బిందువులు మమేకమా?
 
 
అబ్బా జిలేబీ, ఇన్ని ప్రశ్నలు ?
జవాబులు ఎక్కడ ?
 
 
చీర్స్ 
బీలేజీ
శుభోదయం!

Wednesday, October 3, 2012

గాంధీ గాండీ గండీ

 
గాంధీ సత్యాన్ని  సంధించే గాండీ రవం గా 
గాంధీ గండీ న సంధించే  సత్యాగ్రహం గా 
 
తా పుట్టి దేశానికి విముక్తి తెచ్చే  
జనన మరణాల కావల  ముక్తి మోక్షమట 
 
మరి ఈ జననం ఒక దేశానికి
ఒక జాతి కి ముక్తి ప్రసాదించే 
 
ఈ విముక్తి తో గాంధీ 
ముక్తి మతుడాయే 
 
ఈ దేశం ఎప్పుడు నిజమైన 
విముక్తి చెందునో మరి ?
 
మరో గాంధీ రావా లా ?
 
 
జిలేబి.

Tuesday, October 2, 2012

ఇవ్వాళ్టి టపా

ఇవ్వాళ్టి  టపా 
 
మేటరు ఏమీ లేదు.
 
అయినా బ్లాగాడాలని ఉంది 
 
ఇవ్వాళ్టి  కామెంటు 
 
ఏ బ్లాగైనా  మనదే !
 
కామెంట డం మన వంతు
 
రాసిన వాళ్ళు ధన్య జీవులు 
 
చదివిన వాళ్ళు కారణ జన్ములు 
 
 
అబ్బా, బ్లాగు భలే బాగు !
 
అమ్మో, టపా భలే బయాసు !
 
 
చీర్స్
జిలేబి.  

Wednesday, September 19, 2012

జిలేబీల గణపతయ్య



కుడుముల గణపతయ్య అని రాయక ఇవ్వాళ జిలేబీల గణపతయ్య అంటే ఎట్లా అండీ ?
 
ఏమిటో మరి.
 
ఇవ్వాళ సెలవు వచ్చింది కాబట్టి జిలేబీలు చుట్ట టానికి తీరిక చిక్కింది మరి.
 
అందుకే కుడుముల గణపతయ్య కూడా జిలేబీల గణపతయ్య అయిపోయినాడు.
 
బ్లాగ్ లోకం లో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !




యే యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం !
 
జిలేబి.

Monday, September 17, 2012

తేనె తుట్ట - వలపు పంట-మానేజ్మెంటు తంటా !

ఏమండీ తెలీక అడుగుతా మానేజ్మెంటు ఎందు కంత కష్ట మైన పని అడిగా ఉసూరు మంటూ.

'Only an activ bee can create honey' మా అయ్యరు గారు సీరియస్ గా జవాబిచ్చేరు.

 అసలు ఎవడూ మన మాట పట్టించు కోడే మరి అంటే అసలు మన మాట మరొక్కడు ఎందుకు పట్టించు కోవాలి అని మరో ప్రశ్న వేసేరు.

అదీ మంచి ప్రశ్న కూడా ను అన్నా జవాబు తెలీక.

వలపు పండితేనే కదా వలపుల పంట మరి ?

అవును కదా ?

ఎక్కడైనా లేజీ బీ హనీ సృష్టించ గలుగు తుందా మరి ?

జవాబు లేదండీ మరి

so only an active bee can create honey మా అయ్యరు గారు వాక్రుచ్చేరు.

సరే అండీ, మరి, అంత కష్ట పడి  తేనే టీగ  తీయని మధురాన్ని కలిగిస్తే మరి దాన్ని అనుభవించే వాడు వేరే ఎవరో కదా ?

అదీ సృష్టి ధర్మమే మరి

అలా ఎందుకు ఉండాలి అండి మరి అయ్యరు  గారు అంత కష్ట పడి మధురాన్ని గ్రోలి తేనె తుట్టను  క్రోడిస్తే  మరొక్కడు ఎవడో దాన్ని తన్నేసు కోవటం మరి ఎట్లా సృష్టి ధర్మం అవుతుందం డీ?

అంటే జిలేబీ, వలపుల పంట మన అబ్బాయి ఎల్లప్పుడూ మనకే సొంతమం టావా ?

ఆలోచించా. సరి కాదు కదా ? ఇప్పుడు అబ్బాయి మరో వలపుల పంట కి హోత.

సృష్టి ధర్మం లో కాల చక్రం లో ప్రతి ఒక్కరికి కొంత సమయం వారి వారి ప్రజ్ఞా పాటవాలను స్ప్రష్టీ కరించ డానికి అవకాశం అంత మాత్రమే .

గీత లో ఏం చెప్పారు ? మా ఫలేషు కదాచన, అంతే కదా ? అంటే, తేనే టీగ  కి తేనె  తుట్ట ని చెయ్యడం వరకు దాని ప్రజ్ఞ, ఆ చెయ్యడం లో మధువుని గ్రోలడం వరకు దాని కాల చక్రం. ఈ తుట్ట నాదే సుమా అని అతుక్కుని పోయిన సమయాన మరో ప్రజ్ఞ కలవాడు వచ్చి తుట్టని కొట్టి తేనెను తీసుకుని ఉడాయిస్తాడు . కథ అక్కడే ఆగదు  మరి వాడికీ ఒక కాలచక్రం ఉండటం మనకు తెలిసినదే కదా మరి ?

మంచి మాటే , ప్రజ్ఞ, కాలచక్రం ! మా ఫలేషు కదాచన !

శుభోదయం.

చీర్స్
జిలేబి.

Tuesday, September 11, 2012

వేణు వైన పుష్ప రాగం

వేణు వైన పుష్ప రాగం 
 
గాలి వాటున సాగి పోయిన 
పుష్ప రాగం 
ఓ సారి నిలబడి 
తిరిగి మళ్ళీ వచ్చింది.
 
వేణువై న నాదం 
పుష్ప రాగాన్ని పలకరించి 
కుశల మడిగింది.
 
నాదం రాగం కలిసి 
మనో వీధిలో విహంగమై 
ఎగిరి పొతే 
మనసు గత  స్మృతులతో 
ముద్దాడింది.
 
కాలం వెను తిరిగితే 
గతం మధురం కామోసు !
 
చీర్స్ 
జిలేబి.

Sunday, September 9, 2012

ఆడ why తమ్ ! అద్వైతం !

ఈ మధ్య కష్టే ఫలే వారు అద్వైతం గురించి రాసారు.
 
అది చదివాక ,
 
ఆడ,
why   
 
తమ్  ?
 
సో,
 
ఎక్కడ 'తమ్' లేదో మరి అది అద్వైతం ?
 
జిలేబి.