మీటింగ్ మిస్టర్ సుబ్బూ ఇన్ ముంబై (సుబ్బూస్ wisdom !)
హలో మిస్టర్ సుబ్బూ, హాశ్చర్యం మీరెక్కడ ఇట్లా ముంబై లో దర్శనం ? ముంబై లో సుబ్బూ ని చూసి ఆశ్చర్య పోయా
'ఆ ప్రశ్నే నేనూ మిమ్మల్ని అడుగుదా మానుకున్నా, జిలేబమ్మా ! మీరెక్కడా ఇట్లా ముంబై లో ? తిరుగు ప్రశ్నా బాణం సంధించాడు సుబ్బు.
'అబ్బా, ప్రశ్న కి ప్రశ్న సమాధానం కాదోయ్ ' అన్నా.
'సర్లెండి, అట్లా గుజరాత్ వెళ్లి మోడి , మస్త్ ఆన్ గా ఉన్నాడో లేదో చూసి ఇట్లా తిరుగు ముఖం పట్టా, ' ఈ మారు నేరుగా సమాధానం చెప్పాడు సుబ్బు.
అవునా, మరి గుజ్జూ భాయీ లె లా ఉన్నారోయ్? మోడీ ని మస్త్ ఆన్ లో పెట్టేరా ? Is he must on again? ' అడిగా.
మోడీ గురించి చాలా విని వున్నా, చదివి ఉన్నా గాని, నేరుగా ఇట్లా సుబ్బూ వెళ్లి చూసొస్తే ఆతని తో మాట్లాడిన జ్ఞానం పెంపొందించు కోవడం మరీ గొప్పే గా.
'జిలేబమ్మా , మోడీ మరో మారు రాజ్యానికే అంకితం అయి పోయాడు, ప్చ్, పెదవి విరిచాడు సుబ్బూ.
అదేమిటి సుబ్బూ, మోడీ గుజరాత్ ఒకరికి ఒకరు సరి జోడు కాదా మరి ? అడిగా.
'అవుననుకోండీ , అయినా, తన మీద దేశానికి ఎన్నో ఆశలు ఉన్నాయి. తాను ప్రధాని అవుతాడని ' చెప్పాడు.
'అవుననుకో, దానికీ దీనికీ లంకె ఏమిటో ? గుజరాత్ తరువాయి దేశానికి కూడా అవ్వొచ్చు గా? ' చెప్పా.
జిలెబమ్మోయ్ , ప్రస్తుతం మోడీ 'ఫార్మ్ ' ఉన్నాడా ?
అవును కదా మరి ?
ఇట్లా, 'ఫార్మ్ ' ఉన్నప్పుడే కదా ట్వెంటీ ట్వెంటీ ఆడగలడు ఎవడైనా?
'అవుననుకో, అయితే?' అడిగా.
ప్చ్, మళ్ళీ ముఖ్య మంత్రి అయ్యాక రాజ్య భారాలు ఎక్కువవు తాయి కదా తనకి ?
అవుననుకో... ఈ మారు సంశయం గా అన్నా.
అటువంటప్పుడు తను రాజ్యం లో నే కదా తన శక్తి యుక్తులని కేంద్రీ కరిస్తాడు ?
తలూపా.
'ప్చ్, దేశానికి మరో ప్రధాని ని వెతుక్కోవలసిందే మరి' సుబ్బూ ఖరారు చేసేడు.
'సుబ్బూ... మన తిరపతయ్య ఉన్నాడు గా... ' చెప్పా.
జిలేబమ్మోయ్ , మీరు ఇట్లా బ్లేడు జోకులు కూడా వేస్తారా అన్నాడు మిస్టర్ సుబ్బు సీరియస్ గా.
'బ్లేడు '
జిలేబి
ముంబై musings!