అమెరికా బుజ్జి పండు, అక్కయ్య అమ్మా నాన్నలతో గుడికెళ్ళి పులిహోర కానిచ్చాక ఎందుకో అట్లా తల తిప్పి చూసాడు.
అంతా కొత్తగా కనిపించింది గుడి.
అబ్బా తెల్లారి వచ్చినప్పుడు వేరేలా గుడి ఉండిందే? ఇప్పుడు వేరేలా ఉందేమి చెప్మా అని చెంపకు చెయ్యి ఆనించి చూసాడు.
తెల్లారి పైజమా లాల్చీ తో కదా, ఇప్పుడేమో, అర నిజారు పొట్టి చేతుల చొక్కాతో ఉన్నానేమిటి అని ఆశ్చర్య పోయాడు తన్ను తాను చూసుకుని.
ఏమయ్యిందో ఆతనికి అస్సలు అర్థం కాలేదు.
అమ్మా నాన్నలు తన ప్రక్కనే గదా ఉండాలి అని కలయ తిరిగి చూస్తే, అసలు వాళ్ళిద్దరూ కనిపించలే.
కొద్ది దూరం లో అక్కయ్య లా ఓ అమ్మాయి కనిపించింది. అచ్చు అక్క పోలికలో నే ఉంది. అయినా ఎందుకో సందేహం వచ్చింది అమ్మాయి తన అక్కయ్య కాదేమో అని. తెల్లారి పట్టు పరికిణీ లో ఉండింది
మరి ఇప్పుడేమో అదేదో గొట్టం ప్యాంటూ, పై తన లాల్చీ లా ఉన్న చొక్కాయి, ఆ పై ఓ దుపట్టా - అబ్బా, ఇట్లా అప్పుడప్పుడు అమ్మే కదా వేసుకునేది, ఇట్లా అక్క ఎందుకు వేసుకుని ఉంది అని
'అక్కా అని పిలిచాడు.
ఆ అమ్మాయి తిరిగి చూళ్ళేదు.
మరో మారు అక్కా అన్నాడు.
ఊహూ , జవాబు లేదు
వేరే ఎవరైనా ఏమో అనుకుని మళ్ళీ గుడి వైపు చూసాడు.
గుడి మరీ పాత కాలం గుడి లా ఉంది.
అబ్బే, తెల్లారి గుడి అంత శుభ్రం గా, మంచి కళ తో, కొత్తగా వెల్ల వేయబడి ఉండిందే మరి ? ఇప్పుడేమి ఇట్లా వెల వెల బోతోందీ అని అనుకున్నాడు.
అసలే అమ్మా నాన్నలేక్కడా కనిపించడం లేదాయే. మరి అక్కయ్య లా ఉన్న అమ్మాయి కూడా అసలు తన వైపు చూడ్డం లేదు. తను పలకరిస్తే అసలు జవాబు ఇవ్వడం లేదు.
బుజ్జి పండు కి మొట్ట మొదటి సారి భయం వేసింది.
గుళ్ళో ఉన్న దేముడి వైపు చూసేడు. తెల్లారి కనిపించిన దేవుడిలా నే ఉన్నాడు (అమ్మ చెప్పింది గా ఉన్నాడు అని చెప్పొచ్చని , నా ఈడు వాడే అని ) ఈ మారు ధైర్యం గా అనుకున్నాడు, మరి ఈ దేవుడు ఇక్కడ ఇలా గోచీ తో ఉన్నాడే మిటి మరి? తెల్లారి ఎంత మా గొప్పగా అలంకారం తో ఉన్నాడే మరి ఇప్పుడెందుకు ఇలా పప్పీ షేం లా ఉన్నాడు చెప్మా అని మళ్ళీ చెంపకు చేయ్యేసు కున్నాడు.
బుజ్జి పండు గుళ్ళో నించి కాలు బయటకు పెట్టాడు.
తారు రోడ్డు కనిపించడం లేదు. చుట్టూతా మట్టి దారి. కొంత దూరం లో పచ్చిక బయలు. ఆ పై దూరం గా విసిరేసి నట్టున్న గుడారాల్లా ఉన్నాయి. ఏమిటబ్బా అవి అనుకుని ఆ వైపు వెళ్ళాడు బుజ్జి పండు.
గుళ్ళో ని దేవుడు ముసి ముసి నవ్వు చిందించాడు.
నిశ్శబ్దం గా ఆ అబ్బాయి వెంబడే మరో చిన్న పిల్లవాడిలా మారి బయటకు కాలు పెట్టేడు దేముడు కూడా.
(సశేషం)
జిలేబి.