శ్రీ కాలక్షేపం కబుర్లు శర్మ గారు విస్తారంగా మనలో పరమాత్మ ఎక్కడున్నాడు - అన్న టపా ని రాసేరు.
చాలా విపులం గా చెప్పేరు.
నారాయణ సూక్తం లో కవి చమత్కృతి యా అన్నట్టు ఒక వాక్యం వస్తుంది - అథొ నిష్ట్యా వితస్త్యాన్తే ' అన్నది అది.
ఈ పదబంధాన్ని మొదటి మారు చదివినప్పుడు అస్సలు అర్థం కాలేదు.
అథో నిష్ట్యా - నిష్ట్యా అంటే ఏమిటి ?
వితస్త్యాన్తే - వితస్తి అంటే ఏమిటి ?
అన్నదాని గురించి అట్లా ఇట్లా లాగించి గూగిలించి, సంస్కృత భాషా ప్రవీణు లైన కొందరిని అడిగి తెలుసుకున్నదాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. మీలో మరింత ఉత్సుకత కలిగిస్తుందని ఆశిస్తాను !
ఈ టపా చదివే ముందు శర్మ గారి పై న పేర్కొనబడ్డ టపా మొదట చదివితే కొంత సందర్భం అవగతం !
సో, ఇది భాగం రెండు అన్న మాట-
నిష్ట్యా అంటే, మన కంఠాన్ని తడిమి చూస్తే ఒక ఎముక తగులుతుంది చూడండి అదన్న మాట ఆంగ్లం లో దీన్ని 'Adam's apple' అంటా రను కుంటా.
వితస్తి అన్నది ఒక కొలబద్ద. అంటే మన హస్తాన్ని సాగ దీస్తే, బొటన వేలికిన్ను చిటికిన వేలికిన్ను మధ్య ఉన్న దూరం. సుమారు పన్నెండు అంగుళాలు.
ఇప్పుడు ఆ కంఠ ఎముక (ఇది దుష్ట సమాసమెమో మరి - శ్యామలీయం వారు చెప్పాలి!) నించి మీ చేతిని అట్లా విస్తరించి కొలత బెట్టండి ఏమి తగులు తుంది ?
హృదయం కదూ ? సో, అథొ నిష్ట్యా వితస్త్యాంతే - ఆ పన్నెండు అంగుళాల దూరం లో ఉండే హృదయం లో అన్న మాట. హృదయం నాభ్యం ఉపరి ఉన్నది కదూ.
ఇంత కష్ట పడి హృదయాన్ని కవి వివరించా లా ? చెప్పాలా? చమత్కృతి కాకుంటే ? 'సులభం గా 'హృదయేషు లక్ష్మీ' అని చెబ్తే సరి పోదూ?
ఈ ఆలోచన రాక పోదు మనకి. ఈ సందేహాన్ని నివారించ డా నికి మరో నారాయణ సూక్త పంధా(వైష్ణవ సాంప్రదాయంలో ) (version?) లో సులభం గా హృదయోర్మధ్యే అని చెప్పేశారు.
సరే, సర్వాంతర్యామి. భగవంతుడు అన్ని చోట్లా ఉంటా రంటారు కదా.. మరి ఇట్లా, ఒక స్థలం లో ఆయన్ని 'localization' చేయ్యటం ఏమిటంటారా ? 'If you cannot find Him in you, so far as you are concerned, He is nowhere for you' అని మరో కవి ఉవాచ !
సో, అదన్న మాట విషయం. కొంత ఆలోచించి చూడండి కవి చమత్కృతి కాదూ ఇది మరి ?
ఇట్లాంటి చమత్కారాలు వేదంలో చాలా ఉన్నవి- ఆ మధ్య ఎపుడో ఒకసారి రాసాను కూడా... పురాణీ దేవీ యువతిహి ' అని ఉషస్సు గురించి చెబ్తాడు కవి. (Old Woman, but young girl - అంటే జిలేబీ లా అన్నమాట !)
చీర్స్
జిలేబి.