Thursday, February 7, 2013

చదువా ధనమా వీరమా ?

చదువరీ !

నీకు ఇదే పరీక్ష! చదువా ధనమా వీరమా ? ఈ మూడింటి లో ఏది గొప్ప తెలుపుడూ !

'చదువెందు కు.... ' అన్న సామెత ఉన్నది.

అట్లాగే న చోర  హార్యం న చ రాజ్య భోజ్యం ... అన్న సూక్తమూ ఉన్నది.

ఇవి రాసిన వాళ్ళంత తలపండి న వాళ్ళు. అంటే జీవితం లో డక్కా మొక్కీ లు తిని మొదటి సామెత చెప్పిన వాళ్లై  ఉంటారు.

రెండో కేట గిరీ అందని ద్రాక్ష పళ్ళు తీయన అన్నట్టు, మనకొచ్చింది చదువు కాబట్టి, దాన్నే కాస్త గొప్ప గా చెబ్దామని సూక్తం చెప్పేసి ఉంటా రను కుంటా !

ధనం మూలం ఇదం జగత్ అని మేధావి చెబ్తాడు.

ఆయ్ , వీరుడు దేశాన్ని కాపాడ క పోతే నీ చదువూ, నీ ధనం  అంతా పరగతం . కాబట్టి వీరుడు లేకుంటే, దేశం లో శాంతి లేదు. శాంతి లేకుంటే చదువూ సంధ్యా లేదు. ఆ పై వ్యాపారమూ గట్రా నూ  లేవు. సో , ధనమూ ధమాల్ !

ఇట్లా ప్రతి దానికీ తమ తమ గోప్పల్ని చెప్పి డబ్బా వాయించి  చెప్పొచ్చు.

ఇంతకీ మీ ఉద్దేశ్యం ఏమంటారు ఈ విషయం పై ?


జిలేబి.

4 comments:

  1. చదువు, ధనం వున్న వీర్యుడు.

    ReplyDelete
  2. సమాజంలో ఎవరి పని వారు చేస్తే సమస్యలు లేవు, ఒకరి పని మరొకరు చేయడమే నేటి గొప్ప.చెట్టు ముందా? విత్తు ముందా?

    ReplyDelete
  3. చదువు అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు కదండీ, ధనం సంపాదిస్తున్నాడంటే దానికి సంబంధించిన చదువు అబ్బినట్టే, వీరుడు పోరాడితే దానికి సంబంధించిన చదువూ అబ్బినట్టే. అదన్నమాట, ధన సంపాదనైనా, పోరాట పటిమ ఐనా చదువులోకే వెళ్ళిపోతాయి.. ఏమంటారు.

    ReplyDelete
  4. ధనము , విద్య , వీర్యము - కొందరికి మదమెక్కిస్తాయి . కొందరికి వినయాన్నితెస్తాయి . అంటే ... వీటిలో ఏగొప్పా లేదు . గొప్పతనం గానీ , అల్పత్వం గానీ ఉండేది మనుషుల్లోనే మరి .

    ReplyDelete