రాబోయే జన్మలో నేనెవర్ని అన్న ఈ ప్రశ్న కి జవాబు మనకు తెలియడానికి ఆస్కారం ఉన్నదా ?
నువ్వు పూర్వ జన్మలో ఇట్లాగ ఉండే దానివోయ్, అట్లాగ జీవితం గడిపేవు ... లాంటి 'జాతక' ఫలా ల ఖబుర్లు చెప్పే వాళ్ళు ఉన్నారు.
మనకు ఈ జన్మలో రాబోయే కాలం లో ఏమగునో ఎట్లా ఉంటుందో లాంటి వి తెలుసు కోవటానికి చాలా కుతూహలం ఉంటుంది . మళ్ళీ ఎ మహార్జ్యోతిష్య శర్మ గారో చెప్పే దానికి ఉన్నారు కూడాను.
అయితే, ఏకంగా మనం రాబోయే జన్మ లో ఎట్లా ఉంటామో, ఎక్కడ జన్మిస్తామో మనకు తెలిస్తే ?
వాహ్ , వాహ్ జిలేబీ ఇట్లాంటి ఆలోచనలు నీకెట్లా వస్తాయి సుమీ అని హాశ్చర్య పడి పోతున్నారు కదూ మీరు ?
ఈ ప్రశ్న ఎందుకు వేసా నంటే, అట్లాంటి వి తెలియ డానికి అసలు ఆస్కారం ఉన్నదా అన్న పాయింటు కోసమే మరి.
అంటే మనం చేసే కర్మలు కర్మ సిద్దాంతం ప్రకారం, మన కర్మలు చేతలు ఎక్కువయ్యే కొద్దీ, మన రాబోయే కాలం కూడా ever dynamic state లో ఉంటుంది కదా మరి , నిర్ధారణ గా, మనం ఇలా ఉంటాం రాబోయే కాలం లో అని తెలియడం, నిర్దుష్టం గా తెలియడం అన్నది కాని పని అవుతుం దేమో కదా మరి ?
అంటే, అది నిర్ధారణ కావడానికి మానవుడు బాల్చీ తన్నేక, బాలన్సు షీటు ఖరారు అయ్యి, ఆ పై ఆతని రాబోయే కాలపు జీవనం నిర్ధారణం అవుతుందా మరి ?
సో, మన బాలన్సు షీటు నిర్ధారణ మనం బాల్చీ తన్నితే కాని తెలీని పరిస్థితి లో ఉన్నా మన్న మాట మనం !
మరి ఈ కంపనీలు, బిజినెస్సు వాళ్ళు మాత్రం ప్రతి సంవత్సరం బాలన్సు షీటు రాసి పడేస్తారు ! ఆ పాటి సులువు మనకు లేకుండా పోయెనే మరి !
ఏమంటారు ?
జిలేబి.
ఈ జన్మలో 'నేనెవరిని' అని వేదాంతులు తెగని ఆలోచనలు చేస్తుంటే మరు జన్మ గురించి మీకు బెంగ ఎందుకండీ?
ReplyDeleteఎవరేమైనా....నేను మాత్రం మీ ఫ్రెంఢ్ ని కాదనకండి! ప్లీజ్:-)
ReplyDeleteమరు జన్మలో నేనెవరో చెప్పగలను, కిందటి జన్మ కూడా చెప్పగలను. తప్పక గోదావరీ తీరానే పుడతా! సత్యం,సత్యం,సత్యం
ReplyDelete