Tuesday, March 19, 2013

తీరం వదిలిన పడవ

పడవ తీరం వదిలింది 
 
నది వాలున సాగి పోసాగింది 
 
నది అన్నది  -
 
దారిలో జలపాతం ఉంది 
 
జాగ్రత్త సుమా !
 
పడవ  నవ్వింది 
 
తీరం వదిలి పెట్టా 
 
ఇక నీగతే నా గతి !
 
జలపాతాలైనా సుడి గుండా లైనా 
 
అన్యధా శరణం నాస్తి 
 
త్వమేవ శరణం మమ !
 
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి . 

Monday, March 18, 2013

సత్యం - ఒంటరి తనం

 
సత్య సాధన
గమన ప్రయత్నం లో 
ఎపుడో ఒకప్పుడు మాత్రమె
నువ్వు ఒంటరి వాడవు !
 
అహరహం ఇహలోకపు  
సాధనా ప్రయత్నం  లో 
నువ్వు ఎల్లప్పుడూ ఒంటరి వాడవే !
 
 
 
జిలేబి 
(The unencumbered spirit
Reflections of a Chinese Sage
 Hung Ying -Ming
 
స్వేచ్చానువాదం )

Saturday, March 16, 2013

బావి లో బక్కెట్టు చేంతాడు !

బక్కెట్టు బావిలో కెళ్తూ 
గర్వం గా చెప్పింది 
'చేంతాడు
నేనే గనక లేకుంటే లేకుంటే 
మాలిక్ నీళ్ళు తోడ లేడు సుమా !
 
చేంతాడు అంది -
 
ఏమి బడాయి బక్కెట్టు ?
నేనే గనక లేకుంటే 
నువ్వెట్లా బావి లోకి వెళ్తావు ? 
మళ్ళీ పైకి ఎట్లా రాగలుగు తావు ?
 
చేంతాడు ని పట్టిన చెయ్యి 
చప్పున చెంతాడుని వదిలి పెట్టింది !
 
దబ్బున   బక్కెట్టు చేంతాడు 
బావిలో పడ్డవి 
 
న్యూటన్  సమాధి నించి 
తల బయట పెట్టి చూసి
మళ్ళీ సమాధి లోకి వెళ్లి పోయేడు  
 
మానవుడు నింపాదిగా
బావిలోకి దిగేడు
బక్కెట్టు చేంతాడు
బయటకు తియ్య డానికి !
 
 
చీర్స్ 
జిలేబి 

Thursday, March 14, 2013

మిథునం పూర్తి చిత్రం

మిథునం పూర్తి చిత్రం 

 
Courtesy: Youtube
 
cheers
zilebi.
 

Friday, March 8, 2013

జిలేబి గ్లాస్ ! గూగుల్ గ్లాస్!

'కనులు లేవని నీవు కలత పడ  వలదు - నా కనులే నీ కనులుగా చేసుకుని చూడు ' ఆ నాడు కవి చెప్పేడు సుమధురం గా!

ఇప్పుడు గూగల్ అమ్మణ్ణి జిలేబి సరికొత్త 'గలాసు' తో వస్తున్నా  !

గూగల్ గ్లాస్ వేసుకుని నేను బజారు కెళితే అక్కడి నించి డైరెక్ట్ వీడియో నా 'గూగుల్ గ్లాస్' నించి బ్లాగు లో డైరెక్ట్ గా లోడ్ అవుతుం దన్న మాట !

వావ్ ఐడియా బాగుంది కదా ? ఇట్లా టప  టప  లాడిం చడం మరీ బోరు కొడుతోంది మరి కూడాను!

ఈ మాటే మా అయ్యరు గారితో చెప్పి ఏమండోయ్ నాకు ఆ గ్లాసు కొనుక్కోవా లండీ  అన్నా గోముగా.

అయ్యరు  గారు అడిగేరు ఏమోయ్, నీ కసలే చత్వారమ్... ఓల్డ్ ఉమన్ కూడాను, ఇప్పుడున్న గ్లాసు చాలదా, మరో కొత్త గలాసు ఎందుకోయ్ అంటే విషయం చెప్పా గూగల్ గ్లాసు గురించి.

అంటే అన్నారు ప్రశ్నార్థకం గా.

అంటే నండీ ఆ గ్లాసు వేసుకుని, మీతో మాట్లాడుతూ ఉంటే, అక్కడ టింబక్టూ లో మన మనవడు మన సంభాషణ ని ఆన్  లైన్ లో లైవ్ గా చూడొచ్చు అంత సింపుల్ అన్న మాట . చెప్పా

అబ్బే ఇదేమీ కొత్త కాదె ? నాడు కనులు లేని దుర్యోధనుని డాడ్ కి గీత లో రిషి ఎట్లా చెప్పా డంటావ్ ? ఇట్లాంటి గ్లాసు ఆ కాలం లో నే ఉండే దోయ్ !

అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం ?

ఏమీ లేదు, మనిషి మానవ మేధస్సు పెరిగే కొద్దీ బుద్ధి తరిగి పోతుందేమో అనుకుంటున్నా ! అన్నారు.

అబ్బే, అయ్యరు గారు మీరు మరీ ఛాందసులు సుమండీ అన్నా.

కొత్త ఇన్వెన్షన్ ఏది వచ్చినా దాన్ని మనం ఆహ్వానిం చాలండీ ! అసలు అంతర్జాలం వచ్చినప్పుడు జిలేబీ బ్లాగులు పంచ దశ లోకం లో వస్తాయని నే నేమన్నా అనుకున్నా నా ? అదిన్నూ, ఇట్లా తెలుగలో 'కంప్యూటర్' లో చదవ వచ్చని ఎవరైనా ఊహించి ఉంటా మా ? ఒక ఐడియా జస్ట్ ఒన్ అయిడియా దునియా ని 'బాదల్' దేతా హాయ్ ! చెప్పా.

నీ తెల్గూ, అంగ్రేజీ, హిందీ కలిపి కొట్టడం ఎప్పుడు మారుతుంది జిలేబి అన్నారు మా అయ్యరు గారు ఆప్యాయం గా !

సో, బ్లాగ్ చదువరు లారా ...

రాబోతోంది త్వరలోనే, జిలేబీ గ్లాస్ ! ఆన్ లైన్ బ్లాగింగ్ !

ఇకమీదట ఓ  ఫన్ ఆర్ట్ విత్ జేకే 'చిలిపీయం' లను నేను డైరెక్ట్ బ్రాడ్ కాస్ట్ చెయ్యొచ్చన్న మాట !

శుభోదయం !

చీర్స్
జిలేబి . 

Wednesday, March 6, 2013

కామెంట్ల కత్తి తో పొడి చేసా !



అందమైన రాక్షసి

రేతిరి కల లో కనబడ్డది !

మనకేమైనా

భయ్యమ్మా ?

కామెంట్ల కత్తి తో

దాన్ని కస మిస పొడి చేసా  !


చీర్స్
జిలేబి

 

Tuesday, March 5, 2013

పని లేని పెండ్లాము బ్లాగు లాడిందని ....

ఏమండీ నే పోతా అన్నా. 

అసలు మడత కుర్చీ లో కూర్చున్న పెద్ద మహారాజు తలెత్తి చూస్తేనా ? అదేమీ హిందూ పేపరో మరి ? దాంట్లో వేరే ఏమి మజా యో తెలియదు కాని పెండ్లాము కన్నా అది గొప్ప మజా ఇచ్చు అయ్యవారికి.

మళ్ళీ గట్టి గా అన్నా ... నే పోతా అని.

ఈ మారు తలెత్తి చూసేరు అయ్యరు గారు.

హమ్మయ్య దిన పత్రిక నించి ముందర ఉన్న పత్ని వైపు చూసేరు అదే పది వేలు కదా అనుకుని 'ఇదిగో ఇట్లా పెండ్లాము చెప్పింది ఏమీ వినకుంటే ఎట్లా ?' అన్నా ఉపోద్ఘాతం గా.

'ఏమిటోయ్ నీ బాధ ? అన్నట్టు చూసేరు అయ్యరు వాళ్ .

అబ్బో, ఏమి వీరి టెక్కు ? అసలు పెండ్లి ఎందుకు చేసుకుంటారో ఈ మగ మహాపుంగవులు  మరి !

పక్కనున్న పెండ్లాము కన్నా అట్లా పేపరో, కాకుంటే లాపు టాపో  పెట్టేసుకుని, ఆ హా దేశం లో మేమొక్కరమే చేతి నిండా పని పడిన వారమని చెప్పు కోటానికి కాకుంటేను మరి ?

అదే మాట చెప్పా.

ఏమోయ్, నీ వ్యాపకం నీకు ఎట్లాను ఉంది .  నా దగ్గర కొంత సేపు హస్కు కొట్టి తెల్లారి గట్లా అట్లా ఆ బ్లాగుల్లో 'బరహ బరహ' అంటూ ఏదో గీకుతావు వాటికి వచ్చిన కామెంటు మెతుకుల్ని చూసి వావ్ అని మురిసిపోతావు ఆపై నా మీద చెణుకులు కూడానూ ...

అసలు ఇంట్లో ఒక మగ మారాజు ఉన్నాడన్న విషయం నీ ' కేటలాగు' లో ఎట్లాగూ లేదాయే ! మరి నన్ను నా మానాన  వదిలేసి నువ్వట్లా బ్లాగు లాడు తొంటే నాకూ ఏమీ తోచక ఇదిగో ఇట్లా పేపరు పెట్టు కుంటాను ...  నే పేపరు చేత పట్టినప్పుడే నీకు నాతొ మాట్లాడా లని పిస్తుంది మరి ! ఏం , నేను తీరిగ్గా ఉన్నప్పుడు, నువ్వు ఆ బ్లాగో 'టం' టం' మూత బెట్టి నాతో మాట్లాడ వచ్చుగా ? అని ఇంత ఎత్తుకు ఎగిరేరు.

వామ్మో, సుడి గాలి మన వైపు తిరుగుతోందే , దీన్ని వెంట నే అరి కట్టాలి అనుకొని ... ' ఆ, ఈ లాపుటాపు, ఈ బ్లాగు లగురించి  చెప్పినదెవరు ? మీ మనవడే గా ... వాడిదే తప్పంతా ' చెప్పా.. నా తప్పు ఇందులో ఏమీ లేదు సుమీ అన్నట్టు చూసా .

అంటే ? వాడేదో చెప్పె. అందుకని అట్లా పొద్దస్తమానం బ్లాగు లోకం లో తలమునకలై అసలు భరించు వాడు భర్త అన్న మానవుడు అసలు ఉన్నాడన్న తలంపు కూడా లేకుండా ఉంటే ఎట్లా మరి ?

అదేం ? మేము బ్లాగు లు రాయ కూడదా ? మా గురించి ఆంధ్ర జ్యోతి లో కూడా బాలా బాలా గు అని చెప్పేరు సుమీ ' చెప్పా.

చెప్పారనుకో, కాదంటా నా ? అందుకని నేను పేపరు చదివే టప్పుడే నీకు నాతొ మాట్లాడాలని అనిపిస్తే ఎట్లా చెప్పు మరి ' అన్నారు ఈ మారు కొంత శాంతం గా.

హమ్మయ్య, మన దారికి మానవుడు వచ్చేసేడు అనుకుని, అట్లా కాదండీ ఆ పేపరు చదివి ఏమి సాధిస్తారని ? కూసింత ఇంటి పని , వంట పని చూడాకూడదూ ... మురిపెం గా అడిగా .

'చస్తే కుదరదు మరి ! ఆ పనంతా నా నెత్తి కి నెట్టి మళ్ళీ ఆ బ్లాగు లోకం లోనే సెటిల్ అయి పోదామనే ! ఆశ దోస, అప్పడం వడ ' మళ్ళీ పేపర్లో తల దూర్చేరు అయ్యరు గారు.

హబ్బా, ఈ 'మొగోండ్లు '  ఇట్లా పెండ్లాముల మాటలు వినకుండా ఇట్లా చెడి పొతే గెట్లా అని నిట్టూర్చి సరే ఎట్లాగూ ఇవ్వాళ పని ఏమీ లేదు కాబట్టి కూసింత బ్లాగు లాడు తామని .....

శుభోదయం !
చీర్స్
జిలేబి !

Monday, March 4, 2013

నెనరస్య నెనరః జిలేబి నామ్యా కవితా వనచారిణహ !

శ్రీ కంది వారి శంకరాభరణం తేజోమయం గా ఉన్నది.

అందులో అప్పుడప్పుడు మనకు తోచింది రాసుకోవడం

(వారేదో చందో బద్ధం గా రాయమని సమస్య ఇస్తే, నేనేదో నాకు తెలిసిన నాలుగు తెలుగు పదాల్ని ఉపయోగించి , ఓ వాక్యాన్ని నాలుగు లైన్లు (రెండు పదాలు ) గా విభజిస్తే, శబాష్ ! కవిత్వం రాసినట్టే అనుకుని - 'జిలేబి' చందస్సు లో రాయడం కద్దు- సరిగ్గా చెప్పాలంటే నేనేదో రాస్తూంటాను, దాని కి ఆ కవులు పెట్టిన ముద్దు పేరు 'జిలేబి' చందస్సు అని చెప్పాలి!)

శంకరాభరణం సభా పండితులు ఓపిగ్గా, జిలేబి చందస్సు ని అప్పుడప్పుడు సరిదిద్ది (నమోవాకములు!) వారి అత్యద్భుత పద ప్రహెళీ లో 'సుందర' తెలుంగు' లో పద్యాల్ని ఇచ్చేవారు!

క్రితం వారం వారు ఇచ్చిన సమస్య -

తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ !

ఆహా, ఇది మనబోటి 'తను', తిను, 'తాను' మానవుల కి సంబంధించిది సుమ్మీ అనుకుని ,

సరే అని దానికి రాద్దామని కూర్చుంటే, ఋగ్వేదం లో ఆనోభద్రా సూక్తం గుర్తుకొచ్చింది. అందులో రమణీయ మైన సూక్తి 'భద్రం కర్ణేభి శృణుయామ దేవా ' అన్నది !

సరే అని ఇట్లా రాయడం జరిగినది.

విని ఆలోచింప ముక్తి ప్రాప్తించు ననఘ
కని శోధింప ముక్తి ప్రాప్తించు ననఘ
అవని లో అన్నియు తానైన ఆ భగవ
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!


దానికి శ్రీ శ్యామలీయం వారు మెరుగులు దిద్ది మరో స్థాయి కి తీసుకెళ్ళి పోయేరు!


శ్యామలీయం చెప్పారు...
జిలేబీగారి పద్యం బాగుంది. దానికి లక్షణశుధ్ధి చేస్తే ఇలా గవుతుందని అనుకుంటున్నాను

జిలేబిగారు చెప్పిన పద్యం:
విని ఆలోచింప ముక్తి ప్రాప్తించు ననఘ
కని శోధింప ముక్తి ప్రాప్తించు ననఘ
అవని లో అన్నియు తానైన ఆ భగవ
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!

పరిష్కృతపద్యం:

విని వివేచించ ముక్తి ప్రాప్తించు ననఘ
కని విమర్శించగా ముక్తి కలుగు ననఘ
అవని నన్నియు తానైన యట్టి భగవ
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!

భావం: సద్విషయములను విని వాటిలోని పారమార్థిక తత్వమును చక్కగా నిత్యమూ వివేచన చేయుచున్న వానికి ముక్తి కలుగును. ప్రకృతియొక్క వికారములను చక్కగా అవలోకనము చేసి దాని తత్త్వమును చక్కగా విమర్శనము చేయుచున్న వానికి దాని నుండి విముక్తి కలుగును. కాని పూర్ణవైరాగ్యసంసిథ్థి లేని వారికి యీ రెండు విధము లయిన మార్గములునూ దుష్కరములు. కాని ఒక మంచి ఉపాయ మున్నది. అందరకునూ‌ అన్నిటికీ‌ భగవతి నిత్యమూ అండగా నున్నది. కాబట్టి విచారపడక అమ్మవారిని నమ్ముకొని ఉపాసించినచో తప్పక ముక్తి కలుగును. చాలా లోతైన ,రమ్యమైన భావము.

 

కంది శంకరయ్య చెప్పారు...

Tbs Sarma చెప్పారు...
జిలేబి వారి భావానికి శ్రీశ్యామలరావుగారి పూరణాంచిత వివరణ శ్రీ శంకరార్యుల పూరణ అద్భుతము. అందరికి అభినందనలు.
చిన్ని సవరణతో జిలేబి గారి చలువతో (భగవతి పదం వారిదే)

అతుల మహానుభావుడని హరుని మనంబున తలచి
పతిగ పొంది తపము జేసి పార్వతి, రతిపతి వలన,
సుతుగనె తారకాంతకుని సురలందరంత మెచ్చ భగ
వతిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ! నిజముగ.
 

Friday, March 1, 2013

బాంక్ ఆఫ్ 'ఇందిర ' (అన్) లిమిటెడ్ ! - జిలేబీయం!


ఏమోయ్ జిలేబీ, పట్టు బట్టి,  పంచ కట్టిన శెట్టి గారి చే  జిలేబీ ల కోసం బాంకు పెట్టించే సే వన్న మాట !'

మారేమం డోయ్  అన్నా .

అవునోయ్ మీరు చాలా మారు తున్నారు సుమీ !

బాంకు వచ్చేక ఏమి ప్రణాళిక ?

అందరి ఇంట్లోనూ వంటిల్లు బందు చెయ్యమని అంటాం !

అంటే ?

దేశం అభివృద్ధి కి వంటిల్లె నిరోధకం గా ఉంది చెప్పా.

ఎట్లా ? అన్నారు మా అయ్యరు గారు హాశ్చర్య పోయి !

అవునండీ, వంటిల్లు బందు చేస్తే, దేశం లో అదో పెద్ద మల్టీ బిలియన్ బిజినెస్స్ గా మారుతుంది .  ప్రతి వేళా జనావళీ బయటే హోటల్ కెళ్ళి  తింటే, ఎంత బిజినెస్స్ వస్తుందో చూడండీ మరి. ఎంతో  మంది జనావళీ కి ఉద్యోగం చిక్కుతుంది కూడా ను. 

'హోటలు బిజినెస్ వాణ్ని 'సిరిరా' వద్దం టా నా ! ముసి ముసి నవ్వులు నవ్వేరు మా అయ్యరు  గారు.

'మా జిలేబీ బాంక్ లో స్వస్వహాయక భామా గ్రూప్ లకి హోటల్లు పెట్ట దానికి దండి గా లోన్లు ఇచ్చే మను కొండీ - ఆ పై ఆ ఇంట్లో చేసే వడ్డ నల్నే వాళ్ళు హోటల్ లో తయారు చేస్తే ఇక వాటి కి వేల్యూ ఆడిషన్ వచ్చి మార్కెట్ వేల్యూ పెరుగు తుంది'  ' చెప్పా గర్వం గా.

మొత్తం మీద నా కొంపకే ఎసరు పెడతావా జిలేబీ అన్నారు మా అయ్యరు గారు.

ఆయ్ , మీరు హోటల్ బిజీ మీదే నండీ . మా హోటలు మాదే నండీ !ఇక మీదట మేమూ  పెడతాం మాతా అన్నపూరణీ హోటలు కూడాను !

భారద్దేశం లో సరికొత్త పంధా మహిళా బాంకు తెస్తుందని ఆశిస్తూ
సరియైన మార్గం లో women empowerment పయనిస్తుందని ఆశిస్తో...

చీర్సు సహిత
జిలేబీ బాంక్ అన్ లిమిటెడ్ !