Monday, March 4, 2013

నెనరస్య నెనరః జిలేబి నామ్యా కవితా వనచారిణహ !

శ్రీ కంది వారి శంకరాభరణం తేజోమయం గా ఉన్నది.

అందులో అప్పుడప్పుడు మనకు తోచింది రాసుకోవడం

(వారేదో చందో బద్ధం గా రాయమని సమస్య ఇస్తే, నేనేదో నాకు తెలిసిన నాలుగు తెలుగు పదాల్ని ఉపయోగించి , ఓ వాక్యాన్ని నాలుగు లైన్లు (రెండు పదాలు ) గా విభజిస్తే, శబాష్ ! కవిత్వం రాసినట్టే అనుకుని - 'జిలేబి' చందస్సు లో రాయడం కద్దు- సరిగ్గా చెప్పాలంటే నేనేదో రాస్తూంటాను, దాని కి ఆ కవులు పెట్టిన ముద్దు పేరు 'జిలేబి' చందస్సు అని చెప్పాలి!)

శంకరాభరణం సభా పండితులు ఓపిగ్గా, జిలేబి చందస్సు ని అప్పుడప్పుడు సరిదిద్ది (నమోవాకములు!) వారి అత్యద్భుత పద ప్రహెళీ లో 'సుందర' తెలుంగు' లో పద్యాల్ని ఇచ్చేవారు!

క్రితం వారం వారు ఇచ్చిన సమస్య -

తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ !

ఆహా, ఇది మనబోటి 'తను', తిను, 'తాను' మానవుల కి సంబంధించిది సుమ్మీ అనుకుని ,

సరే అని దానికి రాద్దామని కూర్చుంటే, ఋగ్వేదం లో ఆనోభద్రా సూక్తం గుర్తుకొచ్చింది. అందులో రమణీయ మైన సూక్తి 'భద్రం కర్ణేభి శృణుయామ దేవా ' అన్నది !

సరే అని ఇట్లా రాయడం జరిగినది.

విని ఆలోచింప ముక్తి ప్రాప్తించు ననఘ
కని శోధింప ముక్తి ప్రాప్తించు ననఘ
అవని లో అన్నియు తానైన ఆ భగవ
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!


దానికి శ్రీ శ్యామలీయం వారు మెరుగులు దిద్ది మరో స్థాయి కి తీసుకెళ్ళి పోయేరు!


శ్యామలీయం చెప్పారు...
జిలేబీగారి పద్యం బాగుంది. దానికి లక్షణశుధ్ధి చేస్తే ఇలా గవుతుందని అనుకుంటున్నాను

జిలేబిగారు చెప్పిన పద్యం:
విని ఆలోచింప ముక్తి ప్రాప్తించు ననఘ
కని శోధింప ముక్తి ప్రాప్తించు ననఘ
అవని లో అన్నియు తానైన ఆ భగవ
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!

పరిష్కృతపద్యం:

విని వివేచించ ముక్తి ప్రాప్తించు ననఘ
కని విమర్శించగా ముక్తి కలుగు ననఘ
అవని నన్నియు తానైన యట్టి భగవ
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!

భావం: సద్విషయములను విని వాటిలోని పారమార్థిక తత్వమును చక్కగా నిత్యమూ వివేచన చేయుచున్న వానికి ముక్తి కలుగును. ప్రకృతియొక్క వికారములను చక్కగా అవలోకనము చేసి దాని తత్త్వమును చక్కగా విమర్శనము చేయుచున్న వానికి దాని నుండి విముక్తి కలుగును. కాని పూర్ణవైరాగ్యసంసిథ్థి లేని వారికి యీ రెండు విధము లయిన మార్గములునూ దుష్కరములు. కాని ఒక మంచి ఉపాయ మున్నది. అందరకునూ‌ అన్నిటికీ‌ భగవతి నిత్యమూ అండగా నున్నది. కాబట్టి విచారపడక అమ్మవారిని నమ్ముకొని ఉపాసించినచో తప్పక ముక్తి కలుగును. చాలా లోతైన ,రమ్యమైన భావము.

 

కంది శంకరయ్య చెప్పారు...

Tbs Sarma చెప్పారు...
జిలేబి వారి భావానికి శ్రీశ్యామలరావుగారి పూరణాంచిత వివరణ శ్రీ శంకరార్యుల పూరణ అద్భుతము. అందరికి అభినందనలు.
చిన్ని సవరణతో జిలేబి గారి చలువతో (భగవతి పదం వారిదే)

అతుల మహానుభావుడని హరుని మనంబున తలచి
పతిగ పొంది తపము జేసి పార్వతి, రతిపతి వలన,
సుతుగనె తారకాంతకుని సురలందరంత మెచ్చ భగ
వతిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ! నిజముగ.
 

2 comments:

  1. జిలేబీగారు గమనించే ఉంటారు.
    వారిచ్చిన పద్యానికి లక్షణబధ్ధత కల్పించే ప్రయత్నంలో నేను వారి మాతృకకు అతిస్వల్పంగా మాత్రమే మార్పులు చేసాను. ఉదాహరణకు వారిచ్చిన పాదాల ఆద్యంతాలు మార్చకుండానే లక్షణం కల్పించటం జరిగింది.

    ReplyDelete

  2. శ్యామలీయం గారు,

    ధన్యవాదములు.అవునండీ ! అదే కదా మీ కవితా పరిమళ నిండు దనం !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete