Saturday, March 16, 2013

బావి లో బక్కెట్టు చేంతాడు !

బక్కెట్టు బావిలో కెళ్తూ 
గర్వం గా చెప్పింది 
'చేంతాడు
నేనే గనక లేకుంటే లేకుంటే 
మాలిక్ నీళ్ళు తోడ లేడు సుమా !
 
చేంతాడు అంది -
 
ఏమి బడాయి బక్కెట్టు ?
నేనే గనక లేకుంటే 
నువ్వెట్లా బావి లోకి వెళ్తావు ? 
మళ్ళీ పైకి ఎట్లా రాగలుగు తావు ?
 
చేంతాడు ని పట్టిన చెయ్యి 
చప్పున చెంతాడుని వదిలి పెట్టింది !
 
దబ్బున   బక్కెట్టు చేంతాడు 
బావిలో పడ్డవి 
 
న్యూటన్  సమాధి నించి 
తల బయట పెట్టి చూసి
మళ్ళీ సమాధి లోకి వెళ్లి పోయేడు  
 
మానవుడు నింపాదిగా
బావిలోకి దిగేడు
బక్కెట్టు చేంతాడు
బయటకు తియ్య డానికి !
 
 
చీర్స్ 
జిలేబి 

8 comments:

  1. మానవుడు దిగినది పాత కాలంలో గేలానికి marO తాడుకట్టి వేస్తే బకెట్టూ బయటికొస్తుంది :)

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      అప్పుడు గేలం వావ్ నా వల్లే అంటుంది ! గేలాన్ని దామ్మని చేయి వదిలేస్తుంది ! కథ మళ్ళీ మొదటికి ! ఏమంటారు ?

      నెనర్లు
      చీర్స్
      జిలేబి.

      Delete

  2. ఈ ప్రపంచంలో ఏ పని కావాలన్నా ఆకారం కాదు సహకారం ప్రధానమని చక్కగా సెలవిచ్చారు.

    శర్మ జీ ఎస్

    ReplyDelete
    Replies
    1. శర్మ జీ ఎస్ గారు,

      నెనర్లు. !

      సమానేన ఓ హవిషా జుహోమి !..
      సమాన మస్తు ఓ మనో యథా వః సుసహాసతే !



      జిలేబి.

      Delete
  3. ఆ( చూశాం! మిథునం. జ్ఞాపకాల బావిలోకి దూకాల్సిందే.మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      బావి లో దూకి , ఆ మిథునం కథ ని కూడా పట్టి పెట్టేసేరు కదా టపా లో మరి !

      జిలేబి.

      Delete
  4. Okati maatram saarvakaalika sthyam: Memu choodkapothae meeru yentha goppagaa raasinaa waste kadaaa:=)

    ReplyDelete
    Replies
    1. హరీష్ బాబు గారు,

      లక్ష వరహాల విలువైన మాట చెప్పేరు !

      జిలేబి.

      Delete