Saturday, March 23, 2013

బొట్టు కాటుక !

 
బొట్టూ కాటుక 
 
ముఖార విందం 
 
బ్లాగూ, కామెంటు
 
'కరార' విందం 
 
జిలేబీ బీలేజీ 
 
జోడి అరవిందం !
 
చీర్స్ 
జిలేబి 

Friday, March 22, 2013

మిథునం - మలయాళం వెర్షన్- ఒరు చెరు పున్ చిరి (సన్నగవు ) !

మిథునం - మలయాళం వెర్షన్
 
మిథునం - మలయాళం వెర్షన్- ఒరు చెరు పున్ చిరి (సన్నగవు )
 
విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్ 



చీర్స్ 
జిలేబి 

Thursday, March 21, 2013

శాఖోప శాఖలు !

మాలిక్ విత్తనం వేసాడు 
విత్తనం కొమ్మైంది 
 
కొమ్మ తానొక్కతె ఏపుగా 
పెరుగుతా నంది 
ప్రక్కనున్న చెట్లలా 
నాకు శాఖలు వద్దంది !
 
మాలిక్ నవ్వి ఊరుకున్నాడు 
 
కొమ్మ కొంత పెరిగింది 
భారం ఏదో వ్యధ 
తననించి శాఖ ఒకటి 
రావాలని ప్రయత్నిస్తోంది 
 
చ చ, నో నో
ఏపుగా ఒక్కదానినే 
అందంగా ఉంటా 
నో 'బ్రాంచ్' !
 
మాలిక్ మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు 
 
మరికొంత పెరిగింది 
మరింత పెరిగింది 
 
ఎంత పెరిగినా శాఖ 
రాకుండా ఉండదే !
 
ఊర్ధ్వ మూలం అధః శాఖం !
 
శుభోదయం 
 
జిలేబి 

Wednesday, March 20, 2013

పెదవులు పలికిన వేణువు

వేణువు డొల్ల 
నీవూ డొల్ల 
నేనూ డొల్ల 
మనందరం డొల్ల 
 
పెదవుల కదలికల లో 
వేణు  గానం 

నీవో రాగం నేనో రాగం

రాగ మాలిక లో
భాగం మనమందరం

మనో వీధిన
ఆ పెదవుల
గమకం నీ దైనప్పుడు 
 
ప్రతి నిత్యం వసంతమే 
ప్రతి క్షణం పరంధాముని దే !
 
 
శుభోదయం 
 
జిలేబి 

Tuesday, March 19, 2013

తీరం వదిలిన పడవ

పడవ తీరం వదిలింది 
 
నది వాలున సాగి పోసాగింది 
 
నది అన్నది  -
 
దారిలో జలపాతం ఉంది 
 
జాగ్రత్త సుమా !
 
పడవ  నవ్వింది 
 
తీరం వదిలి పెట్టా 
 
ఇక నీగతే నా గతి !
 
జలపాతాలైనా సుడి గుండా లైనా 
 
అన్యధా శరణం నాస్తి 
 
త్వమేవ శరణం మమ !
 
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి . 

Monday, March 18, 2013

సత్యం - ఒంటరి తనం

 
సత్య సాధన
గమన ప్రయత్నం లో 
ఎపుడో ఒకప్పుడు మాత్రమె
నువ్వు ఒంటరి వాడవు !
 
అహరహం ఇహలోకపు  
సాధనా ప్రయత్నం  లో 
నువ్వు ఎల్లప్పుడూ ఒంటరి వాడవే !
 
 
 
జిలేబి 
(The unencumbered spirit
Reflections of a Chinese Sage
 Hung Ying -Ming
 
స్వేచ్చానువాదం )

Saturday, March 16, 2013

బావి లో బక్కెట్టు చేంతాడు !

బక్కెట్టు బావిలో కెళ్తూ 
గర్వం గా చెప్పింది 
'చేంతాడు
నేనే గనక లేకుంటే లేకుంటే 
మాలిక్ నీళ్ళు తోడ లేడు సుమా !
 
చేంతాడు అంది -
 
ఏమి బడాయి బక్కెట్టు ?
నేనే గనక లేకుంటే 
నువ్వెట్లా బావి లోకి వెళ్తావు ? 
మళ్ళీ పైకి ఎట్లా రాగలుగు తావు ?
 
చేంతాడు ని పట్టిన చెయ్యి 
చప్పున చెంతాడుని వదిలి పెట్టింది !
 
దబ్బున   బక్కెట్టు చేంతాడు 
బావిలో పడ్డవి 
 
న్యూటన్  సమాధి నించి 
తల బయట పెట్టి చూసి
మళ్ళీ సమాధి లోకి వెళ్లి పోయేడు  
 
మానవుడు నింపాదిగా
బావిలోకి దిగేడు
బక్కెట్టు చేంతాడు
బయటకు తియ్య డానికి !
 
 
చీర్స్ 
జిలేబి 

Thursday, March 14, 2013

మిథునం పూర్తి చిత్రం

మిథునం పూర్తి చిత్రం 

 
Courtesy: Youtube
 
cheers
zilebi.
 

Friday, March 8, 2013

జిలేబి గ్లాస్ ! గూగుల్ గ్లాస్!

'కనులు లేవని నీవు కలత పడ  వలదు - నా కనులే నీ కనులుగా చేసుకుని చూడు ' ఆ నాడు కవి చెప్పేడు సుమధురం గా!

ఇప్పుడు గూగల్ అమ్మణ్ణి జిలేబి సరికొత్త 'గలాసు' తో వస్తున్నా  !

గూగల్ గ్లాస్ వేసుకుని నేను బజారు కెళితే అక్కడి నించి డైరెక్ట్ వీడియో నా 'గూగుల్ గ్లాస్' నించి బ్లాగు లో డైరెక్ట్ గా లోడ్ అవుతుం దన్న మాట !

వావ్ ఐడియా బాగుంది కదా ? ఇట్లా టప  టప  లాడిం చడం మరీ బోరు కొడుతోంది మరి కూడాను!

ఈ మాటే మా అయ్యరు గారితో చెప్పి ఏమండోయ్ నాకు ఆ గ్లాసు కొనుక్కోవా లండీ  అన్నా గోముగా.

అయ్యరు  గారు అడిగేరు ఏమోయ్, నీ కసలే చత్వారమ్... ఓల్డ్ ఉమన్ కూడాను, ఇప్పుడున్న గ్లాసు చాలదా, మరో కొత్త గలాసు ఎందుకోయ్ అంటే విషయం చెప్పా గూగల్ గ్లాసు గురించి.

అంటే అన్నారు ప్రశ్నార్థకం గా.

అంటే నండీ ఆ గ్లాసు వేసుకుని, మీతో మాట్లాడుతూ ఉంటే, అక్కడ టింబక్టూ లో మన మనవడు మన సంభాషణ ని ఆన్  లైన్ లో లైవ్ గా చూడొచ్చు అంత సింపుల్ అన్న మాట . చెప్పా

అబ్బే ఇదేమీ కొత్త కాదె ? నాడు కనులు లేని దుర్యోధనుని డాడ్ కి గీత లో రిషి ఎట్లా చెప్పా డంటావ్ ? ఇట్లాంటి గ్లాసు ఆ కాలం లో నే ఉండే దోయ్ !

అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం ?

ఏమీ లేదు, మనిషి మానవ మేధస్సు పెరిగే కొద్దీ బుద్ధి తరిగి పోతుందేమో అనుకుంటున్నా ! అన్నారు.

అబ్బే, అయ్యరు గారు మీరు మరీ ఛాందసులు సుమండీ అన్నా.

కొత్త ఇన్వెన్షన్ ఏది వచ్చినా దాన్ని మనం ఆహ్వానిం చాలండీ ! అసలు అంతర్జాలం వచ్చినప్పుడు జిలేబీ బ్లాగులు పంచ దశ లోకం లో వస్తాయని నే నేమన్నా అనుకున్నా నా ? అదిన్నూ, ఇట్లా తెలుగలో 'కంప్యూటర్' లో చదవ వచ్చని ఎవరైనా ఊహించి ఉంటా మా ? ఒక ఐడియా జస్ట్ ఒన్ అయిడియా దునియా ని 'బాదల్' దేతా హాయ్ ! చెప్పా.

నీ తెల్గూ, అంగ్రేజీ, హిందీ కలిపి కొట్టడం ఎప్పుడు మారుతుంది జిలేబి అన్నారు మా అయ్యరు గారు ఆప్యాయం గా !

సో, బ్లాగ్ చదువరు లారా ...

రాబోతోంది త్వరలోనే, జిలేబీ గ్లాస్ ! ఆన్ లైన్ బ్లాగింగ్ !

ఇకమీదట ఓ  ఫన్ ఆర్ట్ విత్ జేకే 'చిలిపీయం' లను నేను డైరెక్ట్ బ్రాడ్ కాస్ట్ చెయ్యొచ్చన్న మాట !

శుభోదయం !

చీర్స్
జిలేబి .