మాలిక్ విత్తనం వేసాడు
విత్తనం కొమ్మైంది
కొమ్మ తానొక్కతె ఏపుగా
పెరుగుతా నంది
ప్రక్కనున్న చెట్లలా
నాకు శాఖలు వద్దంది !
మాలిక్ నవ్వి ఊరుకున్నాడు
కొమ్మ కొంత పెరిగింది
భారం ఏదో వ్యధ
తననించి శాఖ ఒకటి
రావాలని ప్రయత్నిస్తోంది
చ చ, నో నో
ఏపుగా ఒక్కదానినే
అందంగా ఉంటా
నో 'బ్రాంచ్' !
మాలిక్ మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు
మరికొంత పెరిగింది
మరింత పెరిగింది
ఎంత పెరిగినా శాఖ
రాకుండా ఉండదే !
ఊర్ధ్వ మూలం అధః శాఖం !
శుభోదయం
జిలేబి
బావుంది మేడం. శాకోపశాఖలుగా విస్తరిస్తేనే కదా అందం చందం .
ReplyDeleteవనజ వనమాలీ గారు,
Deleteపేరుకు తగ్గట్టు వనమాలీ గారి మాట అన్నారు !
చీర్స్
జిలేబి.
ReplyDeleteసహజత్వాన్ని వద్దనటం అవివేకమవుతుంది, అయితే అది మన మానవులకే తెలుసు.వనంలో గాని , మన ఆవరణలో గాని పెరుగుతున్న ( జీవిస్తున్న ) మొక్కలకు తెలియదు కదా!
చాలా చక్కగా సెలవిచ్చారు.
శర్మ జీ ఎస్
నా బ్లాగు : నా ఆలోచనల పరంపర
http://naalochanalaparampara.blogspot.in/
శర్మ జీ ఎస్ గారు,
Deleteనెనర్లు! ప్రకృతి కి మానవుడు, చెట్టూ చేమా అంతా ఒక్కటే మో ? వ్యత్యాసం ఉంటుందంటా రా?
చీర్స్
జిలేబి
కొమ్మకి రెమ్ముంటేనే అందం. ఊర్ధ్వ మూలమధశ్శాఖా! ఇదే
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteకొమ్మ కొమ్మకీ రెమ్మ ! రెమ్మ రెమ్మ కీ పూత ! పూత పూత కీ మధువు !
మధువు మధువు కీ ఓ హనీ బీ ! సబ్ కా మాలిక్ ఏక్ హై!!
చీర్స్
జిలేబి.
చక్కగా వ్రాశారండి.
ReplyDeleteఈ సృష్టిలో శాఖోపశాఖలతో పెరిగే చెట్లూ ఉన్నాయి.
శాఖోపశాఖలు లేకుండా పెరిగే కొబ్బరి, తాటి వంటి చెట్లూ ఉన్నాయి.
వేటి ఉపయోగం ఏమిటో భగవంతునికే ఎరుక.
anrd గారు,
Deleteకొబ్బరి పెరిగినా తాటి పెరిగినా ఆ పై కూడా వాటికి ఆ ఎత్తులోనూ శాఖ సన్నని కొబ్బరాకుల తాటాకుల రూపం లో నే కదా మరి !
శాఖంబరి !
చీర్స్
జిలేబి.
మేడం ,
ReplyDeleteభగవద్గీతలో ఊర్ధ్వమూలమధఃశాఖ....అనే శ్లోకం ఉంది కదండి. ( మీరు టపాలో క్రింద వ్రాసారు. )
........................
ఈ టపా లో , విత్తనం కొమ్మైంది ......మరింత పెరిగింది ...అని వ్రాసారు.
అయితే, విత్తనం నుంచి మొదట చిగురాకులు వస్తాయి .
మర్రి, మామిడి చెట్ల లాగా కొబ్బరి చెట్లకు కొమ్మలు ఉండవు కదా ! కొమ్మలకు చిగుర్లు రావటం ఆ చిగుర్లు పెరగటం వంటి లక్షణాలుంటాయి.
కొబ్బరి ఆకులకు చిగుర్లు రావటం , ఆ చిగుళ్ళు పెరగటం జరగదు కాబట్టి, కొబ్బరి ఆకులను కొమ్మలుగా భావించకూడదు అనిపిస్తోందండి.
ఈ టపాను , వ్యాఖ్యలను చదివిన తరువాత మొక్కలు, చెట్ల గురించి రకరకాల ఆలోచనలు వచ్చాయి.....రకరకాల మొక్కలు, చెట్లతో కూడిన దైవసృష్టి ఎంతో అద్భుతం అనిపించింది.
లిల్లీ మొక్కలు , ఉల్లి మొక్కలు , అలోవెరా మొక్కల ఆకుల గురించి ఆలోచనలు వచ్చాయి.
ఇవన్నీ ఆలోచిస్తే వృక్షశాస్త్రవేత్తలకు అయితే చాలా ఉపయోగం కలుగుతుంది.
మీరు వ్రాసిన టపా చూడటానికి చిన్నగా, సింపుల్ గా ఉంది కానీ చక్కటి ఆలోచనాత్మకమైన టపానండి. మీకు కృతజ్ఞతలండి.