వనజవనమాలి: ఓ .. ఆత్మీయ ముఖపరిచయం (కష్టేఫలే ): ప్రతి మనిషి జీవితం లోను అనేకానేక పరిచయాలు ఉంటాయి కొంతమంది మన ప్రక్కనే నివశిస్తున్నప్పటికి కూడా పరిచయస్తులగానే మిగిలి పోతుంటారు ...
చిత్తూరు నాగయ్య గారంటే మన బ్లాగ్ లోకపు టపా 'సామ్రాట్' డా టేరు రమణ బాబు గారి కి మరీ గురి !
ఇక ఈ వి నాగయ్య గారు రమణ గారి గుంటూరు జిల్లా 'వాస్తవ్యులు' కావడం, మా చిత్తూరు నాగయ్య గారవడం వల్ల (వారి సినీ లోకపు చమక్కులకు మునుపు చిత్తూరు రామ విలాస సభ లో నాటకాలలో విశ్వ రూపం గావిం చిన వారున్నూ!) , రమణ గారి టపాలు తప్పి చదవడం వల్ల ఈ జిలేబీ టపా అన్న మాట !
చిత్తూరు నాగయ్య గారు మరీ చాలా సినిమా ల లో ఏడ వడానికే పుట్టిన మానవుళ్ళా నా కనిపించడం అదేమీ ఖర్మో నాకు తెలీదు మరి. వారు చాలా వెరైటీ రోల్స్ చేసినా ఎక్కువ గా చేసిన రోల్స్ ఏడుపు కి సంబంధించి న వేమొ అని నా అనుమానం !
(కాకుంటే, నేను చూసిన చిత్రాలలో వారు ఎక్కువగా ఏడుపు గొట్టు రోల్స్ చేసేరేమో!- 'ఆండోళ్లు - అర్ధ సేరు కన్నీళ్లు ఫ్రీ గా ఉన్నవాళ్ళం కదా మరి )
ఎందుకిట్లా అంటారా ? ఈ మధ్య పాత కాలపు చిత్రం నల దమయంతి యు ట్యూబ్ లో కనిపించింది సరే చూద్దారి అని చూస్తున్నా
(ఆ కాలం లో చూడడానికి మా వారు తీసు కెళ్ల లే మరి - కొట్టాయి లో సినిమా చూడ్డం ఏమిటే అని నామోషీ పడి పోయేరు అయ్యరు గారు -విషయం ఏమిటంటే కొట్టాయి చిత్రానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చే జమా చాలదు అదీ విషయం!)
చూస్తూంటే అప్పటి దాకా హ్యాండ్ సమ్ గా ఉన్న హీరో నలుడు (నటుడు - కెంపరాజ్ ) అట్లా దమయంతి ని వదిలి బెట్టి చెట్టూ పుట్టా పట్టుకుని అడివి లో కెళ్తే, అక్కడ ఓ సర్పం ఆ నలుణ్ణి కాటేస్తే వికారి రూపి అయిపోతాడు నలుడు ! అంటే మన హీరో ఆరడుగుల అంద గాడు వికారి అవ్వాలి. ఎట్లా మరి ? హీరో కెం ప రాజ్ మరీ అంద గాడైన నలుడాయే ?
డైరక్టరు బాబు కెంప రాజు బుర్ర పెట్టేడు .
అప్పటి దాకా ఉన్న హీరో కెంప రాజ్ మారి ఏడుపు గొట్టు మొహం తో ధబాల్మని నాగయ్య గారు కనబడ్డేరు !
నా కళ్ళు చిట్లించు కొని చూసా - నాకు కళ్ళు కనిపించవు సరిగ్గా అది నిజమే కాని ఇట్లా హీరో రూపమే మారి దభీ మని వేరే హీరో నాగయ్య గారు కనిపించట మేమిటీ అని హాశ్చర్య పోయా !
ఇది మన డా టేరు రమణ బాబు గారి టపా లు చదవడం వల్ల వచ్చిన 'సైకో' కళ్ళ జోడు ప్రాబ్లెమ్ ఏమో అని సందేహం వచ్చినాది కూడాను !
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ సర్ప కాటు తో హీరో నలుడు రూపు వికారమవ డం తో, ఎట్లా అందరూ యితడు నలుడు కాదు సుమా అని తెలుసు కునేది ? అని ఆ డైరెక్టరు మానవుడు హీరో నే మార్చేసేడు - అది మన నాగయ్య గారయ్యేరు ! అక్కడి నించి ఇక నాగయ్య గారు నలుని రూపం లో మనకు చిత్రం లో కన బడతారు, ఆహా అని మొదటి పాటే వారిది ఏడుపు రాగమై కన్నీళ్ళ కెరటమై మనల్ని స్పృశిస్తుంది !
ఆహా ఇప్పటి కాలం లో మారు వేషం లో హీరో అట్లాగే వచ్చినా ఎవరూ కని బెట్ట లేరే ! -
ఇక్కడేమో పాపం డైరెక్టరు అంత కష్టపడి హీరో నలుడు రూపం 'బదలాయించ ' డానికి ఇట్లా ఏకం గా హీరో నే మార్చేసేడు సుమీ అని ముక్కు మీద వేలేసు కున్నా !
అప్పుడేమో సందేహం వచ్చింది - అరె టైటిల్ లో చిత్తూరు నాగయ్య కనబడ లేదే అని ? ఆ పై మళ్ళీ వెనక్కి తిప్పి చూస్తే , వి నాగయ్య అన్న పేరు కని పించింది . ఓహో అప్పట్లో నాగయ్య గారికి చిత్తూరు నాగయ్య అని పేరు స్థిర పడ లేదు కామోసు అనుకున్నా!
సరే , ఇక మీ కోసం ఆ నాగయ్య గారి కన్నీళ్ళ గంగా ప్రవాహం ! దానికి ముందు కెంప రాజు గారి మజా ఐన సాంగు భానుమతి గారి తో కూడా చూడాలి మరి !
మొదట గా .. భానుమతి దమయంతి గా అమోఘమైన ప్రేమాయణ గానమాధురీ ఝురి !- ఓహో మోహన మానసమా !
హీరో కెంప రాజ్ - భానుమతి - నల దమయంతి గా
ఆ పై ఇక మన డా టేరు రమణ గారి నాగయ్య గారి అమోఘమైన నటనా ప్రతిభ !
ఈ మధ్య శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం చూస్తోంటే, కృష్ణ, శోభన్ బాబు మరో ఇద్దరు నటులు కలిసి శిల్పం నించి పుట్టిన లతాంగి తో ఐటం సాంగు చేసేరు ! అంటే special appearance అన్న మాట !
ఆహా ఆ కాలములో నే పద్మనాభం గారు ఐటం సాంగు కి special appearance సాంగు లకి నాందీ పలికేరు సుమీ అను కున్నా !
ఆ పై వేదాంతం రాఘవయ్య గారి భలే అమ్మాయిలు చూస్తోంటే, దాంట్లో కూడా మరో ఐటం సాంగు (ఆ కాలం స్టైల్ లో) హీరొయిన్ గిరిజ గారే పాడేసేరు !
ఇదే సినిమాలో , ఎమ్టీ వోరు సావిత్రమ్మ కలిసిన సందర్భం లో మరో 'గ్రూపు' ఐటం సాంగు కూడా పెట్టేరు ! (హీరో హీరొయిన్ అసలు డ్యూయెట్ పాడ కుండా వారి మనో భావాన్ని తెలిపే పాట ను గ్రూపు ఐటం వారు పాడేరు !
మొత్తం మీద ఐటం సాంగు అన్నది ఏమీ కొత్త పోకడ కాదు సుమీ అనిపిస్తున్నది ! ఈ చిత్రం 1957 లో తీసినది !
కొస రాజు కలం !- ఎస్ రాజేశ్వర రావు సంగీతం ! జిప్సీ : చకచక ఝుణతా - తకధిమికిటతా
ముళ్ళ పూడి వారి మీద కేసు - శ్రీ భమిడిపాటి(బాతాఖానీ) ఫణి బాబు గారిది -ఇదీ!
కోతీ కొమ్మచ్చి స్వాతి లో సీరియల్ గా వస్తున్న రోజుల్లో శ్రీ భమిడి పాటి వారి ఆనందం ఇంతా అంతా కాదన్న మాట ! ముళ్ళ పూడి వారి పై, వారు రాస్తున్న 'ఆత్మ కథ' పై మురిపెం ఎక్కువై జాగ్రత్త సుమీ , ముళ్ళపూడి వారు మీ పై 'ప్రజాహిత ' వ్యాజ్యం బనాయిస్తాం అని భయ పెట్టిస్తున్నారు శ్రీ ఫణి బాబు గారు !
'
ఇదిగో జిలేబీ ఇట్లా వారం మొత్తం నా చేతే వంట చేయిస్తే ఎట్లా ? మినిమమ్ ఆదివారమైనా నాకు రెష్టు ఇవ్వొచ్చు గా ' మా అయ్యరు గారు దీనం గా ముఖం పెట్టేరు .
రాస్తున్న బ్లాగు టపా మధ్య లో ఆపి 'ఆయ్ , టపాలు గట్రా రాస్తున్నప్పుడు 'నో డిస్టర్ బెన్స్ ' అన్జేప్పానా లేదా !' ఇంతెత్తు కు ఎగిరా.
అది కాదె జిలేబీ, వారం మొత్తం మీద నా చేత వంటా వార్పూ కార్యక్రమం పెట్టేవు, ఆ బలాగులూ , టపాలు, ఆఫీసు గట్రా బిజీ బిజీ అంటూ - ఈ ఒక్క ఆదివారమైనా నాకు 'ఫ్రీ డం' ఇవ్వొచ్చు గా ' దీనాతి దీనం గా ముఖం పెట్టేరు మళ్ళీ అయ్యరు గారు.
అయ్యరు గారి వైపు నింపాది గా చూసా . ఈ అయ్యరు గారికి ఇట్లాంటి చలువలు ఇస్తే, హమ్మో, ఇంకేమన్నా ఉందా ! ఇవ్వాళ ఈ ఒక్క రోజం టారు ఓ వారం గడిచేక రెండు రోజులు అంటారు ... అట్లా మొత్తం మనమీదే వంట కార్య క్రమం పడే చాన్సు ఉంది ! జిలేబీ బహు పరాక్ బహు పరాక్ ! మిస్టర్ జిలేబీ మాటలు చాలా కేర్ఫుల్ గా గమనించాలి ! లేకుంటే నీకు రాబోయే కాలం లో తంటాలే బామ్మ ఫోటో నించి గట్టి గా లుక్కు ఇచ్చింది .
అయ్యరు గారు కూడా ఫోటో వైపు చూసేరు . హు హు అన్నారు. ' బామ్మ నీకేం చెబ్తోంది ?' అడిగేరు ఈ మారు సందేహం గా .
బామ్మ చెప్పిన మాటంటే ఇంకేమన్నా ఉందా ! అందుకే మాట మార్చి చెప్పా - అయ్యరు గారు ... ఎందుకు ఆదివారం సెలవు కావాలంటారు ? కావాల్సి వస్తే సోమ వారం తీసు కోండి మంగళ వారం కూడా చేర్చి తీసుకోండి ' ఆప్యాయం గా అన్నా.
తలూపారు ఆనందం గా అయ్యరు గారు. ' అయితే జిలేబీ ఆ రెండు రోజులు నువ్వు వంట చేస్తా వన్న మాట '
నేనన్నా నా అట్లా ?
మరి ??? సందేహం గా చూసేరు అయ్యరు గారు.
నేను ఎట్లాగూ ఆఫీసు వెళ్లి పోతా గదా ... అక్కడే లంచ్ అండ్ డిన్నర్ గావించేస్తా ... మీరు మీకు కావాల్సి వస్తే వంట చేసు కొండీ వద్దనుకుంటే హోటలు కె ళ్ళం డి ! '
ఇదిగో జిలేబీ నేనెప్పుడూ హోటలు గట్రా ల లో తిననని నీకు తెలుసుగా ' ముఖం లో జోష్ వెళ్లి మళ్ళీ దీనత్వం వచ్చే సింది అయ్యరు గారికి !
అట్లా దారికి రండి ! సో, బుద్ది గా వెళ్లి ఆ వంటా వార్పూ కార్య క్రమం చూడండి ' చెప్పా మళ్ళీ బ్లాగులో తల దూర్చేస్తో .
అంతే నంటా వా జిలెబీ ?
అంతే అంతే ! ఏం బామ్మా నువ్వేదన్నా చెప్పదలచు కున్నావా ? అడిగా ఫోటో లో ని బామ్మని - ఈ బామ్మే కదా ఈ అయ్యరు గారిని ఇట్లాంటి మంచి మొగుణ్ణి చూపించింది ? వంటా వార్పూ తెలిసిన మానవుడు జిలేబి, కాబట్టి గట్టి గా కట్టి పెట్టేసు కో అంజెప్పింది మరి బామ్మ మాట జవదాట కూడదు గదా !
'వద్దులే ! మళ్ళీ ఆ ఫోటో కి అంకితం అయి పోయిన బామ్మని ఎందుకు లాగుతావు ! ఆవిడ నీకన్నా పెద్ద పెంకి ఘటం ! ఇంకా పెద్ద లెక్చరు పీకును !' అయ్యరు గారు బుద్దిగా వంట గదిలోకి వెళ్లి పోయేరు !
హమ్మయ్య! ఇక మనం ఫ్రీ గా హ్యాపీ గా బ్లాగాడు కోవచ్చు సుమీ !
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...