'అదేమిటోయ్ జిలేబీ చాలా విచారం గా ముఖం వేలాడెసి కూర్చున్నావు ల్యాపు టాపు ముందు ?' మా అయ్యరు గారు పరామర్సించేరు ఆప్యాయంగా .
కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా.
ఏమిటి జిలేబీ నీ మొగానికి ఏడుపు శోభిల్లదే ! కలకంటి కన్నీరు ఒలికిన ప్రాబ్లం అన్న మాటే మరి ! ఏమి నీ బ్లాగు కష్టాలు అన్నారు మా అయ్యరు గారు.
ఏమండీ నా కష్టాలు అన్నీ బ్లాగు కష్టాలేనా ? అడిగా
కాకుంటే ? నీకు పొద్దస్తమానం ఆ కంప్యూటరు జత జేరే ! వేరే ఎ కష్టాలు నీ కుంటాయి ? రిటార్టు ఇచ్చేరు
హు అన్నా హా అన్నా మళ్ళీ కన్నీటి వరదలు చిందించా
ఏమిటోయ్ విషయం ఈ మారు కొంత సేద దీరేక అడిగేరు మా అయ్యరు గారు మళ్ళీ.
నా టపాలు ఎవ్వరూ కాపీ కొట్టడం లేదండీ ! అని భోరు మన్నా !
ఓసి పిచ్చి దానా ! నీ టపాలు ఎవ్వరూ కాపీ కొట్టక పొతే సంతోష పడాలి గాని ఇలా భోరు మంటే ఎట్లా గే ?
టపాలు ఎందుకు కాపీ కొట్టి పెట్టు కుంటా రండీ ?
'ఆ , ఏముందీ, కూసింత నచ్చితే, బాగుంటే ఆయ్ ఈ టపా, కథ కాస్త బాగుందే , మన బ్లాగులో దాచేసు కుందాం అని పెట్టేసు కుంటారు '
అంటే ఏమని అర్థం ? నా టపాలు ఎవ్వరికీ నచ్చ లేదన్న మాటే గా ? మళ్ళీ బోరు మన్నా !
'ఓసీ నీ బ్లాగు పిచ్చి కాకులెత్తుకు పొనూ ! ఇవన్నీ చేజేతులారా తెచ్చి పెట్టు కున్న కష్టాలు కావే మరి ! అని మా అయ్యరు గారు ఓ జాడూ జమాయించి 'కాఫీ పెడతా ఓ గ్లాసెడు గొంతులో పోసుకుని మళ్ళీ టపా లల్లెసుకో ' అని 'ప్యారీ బీవీ' కోసం కాఫీ పెట్టడం కోసం కిచెను లో కెళ్ళేరు
బ్లాగు భామలు, బ్లాగు భయ్యాలు నా టపాలు కాపే కొట్టి మీ బ్లాగుల్లో 'ప్రచారం' చేసి నా కు గంపెడంత పేరు తెచ్చి పెడుదురూ మరి !!- మా తిరుపతి వేంకటేశు గారికి సిఫార్సు చేసి మీకు పుణ్యం వచ్చేటట్టు చూస్తా !!
(తెలుగు తూలిక డాట్ నెట్ మాలతి గారి టపా కామెంట్లు చదివేక ! సరదాగా )
చీర్స్
జిలేబి