Thursday, April 18, 2013

పాహి రామప్రభో ! కౌసల్యా సుప్రజా రామా !

కౌసల్యా సుప్రజా రామా ....

కర్తవ్యమ్ దైవమాహ్నికం ....

సుప్రభాత వేళ  మధ్యన తటాలున 'పాహి రామప్రభో ' అన్న బ్లాగార్ద్ర నాదం వినబడ్డది

శ్రీ రాముల వారు ఉలిక్కి పడి నిదుర లేచేరు.  రొటీన్ గా వచ్చే సుప్రభాత సేవ శ్లోకాలకు నిదుర లేవడం స్వామి వారు ఎప్పుడో మానుకునెరు.

కొండ పైన నిదుర పుచ్చడమే చాలా లేటు ఆ పై తన కలియుగ ప్రాణాన్ని  గోవిందా గోవిందా అని పెందరాళే లేపెస్తున్నారాయే.

కానీ ఈ మధ్య రెగ్యులర్ గా వచ్చే బ్లాగార్ధ్రనాదం తో స్వామీ వారు 'సుప్రభాతాన్ని' చూడ గలుగు తున్నారు తనివి తీరా.

కొంత కాలం గా సుప్రభాత సేవ తో బాటు మరో కొత్త ఆర్ద్ర నాదం విన వస్తోంది 'పాహి రామప్రభో' అంటూ .

స్వామి వారు అమ్మవారి వైపు చూసేరు - గాఢం గా నిదుర పోతోంది దేవేరి !

ప్చ్ ఈవిడికున్న సౌకర్యం మనకు లేకుండా పోయిందే అనుకుని స్వామి వారు నిదుర లేచి ల్యాపు టాపు  ఓపెన్ చేసి  ఆ బ్లాగార్ధ్ర నాదాన్ని గమనించేరు .

ఎవడో మానవుడు పాపం పంచ దశ లోకం నించి తన్ను రోజూ పిలుస్తున్నాడు 'పాహి రామప్రభో' అంటూ.

స్వామి వారికి ముచ్చట వేసింది . ఈ మానవుడు పాహి పాహి అంటూ తన మీద ఆధార పడి పోవడం గురించి

ఈ మధ్య కాలం లో ఎవ్వడూ స్వంతం గా తన్ను పాహి పాహి అనటం లెదు. గుళ్ళో కూడా అదేదో 'రికార్డు' లట  కాకుంటే 'డిస్కు' లట  వాటిల్లో సుప్రభాతాన్ని పెట్టి తన నిదుర ని చెడ గొట్టి ఈ కలియుగ మానవులు  గుర్రు పెట్టి నిదుర పోతున్నారు

తనేమన్నా రికార్డు డాన్స రా రికార్డు పెడితే ఆడ టానికి ? కాకుంటే 'డిస్కో శాంతి యా  డిస్కు పెడితే డాన్సా డ టా నికి ?

అట్లాంటి ఈ వెర్రి తలల కాలం లో ఈ బ్లాగ్భక్తుడు రోజూ మనః స్ఫూర్తి గా పద్య మాలికలల్లి తనని 'పాహి' పాహి' అంటు న్నాడు !

రాముల వారికి ముచ్చటే సింది . చూద్దాం ఇంకా ఎంత గాఢం గా పాహి పాహి అంటాడో ఆ పై కరుణి ద్దా మనుకుని    బ్లాగు సైన్ అవుట్ అయి లాపు టాపు  కట్టి బెట్టి మళ్ళీ 'ఆనీదవాతగ్ స్వదయా తదేకం' అయ్యేడు.

సీతమ్మ ముసి ముసి నవ్వులు నవ్వింది . తన్ను ఆ మానవుడు పాహి పాహి అని ఉంటే, ఈ పాటి కి స్వామి వారిని ఇట్లా నిదుర పోనిచ్చేదా ? పట్టు బట్టి  స్వామి వారిని బయలుదేర దీసి  పంచ దశ లోకం వెళ్లి ఆ మానవుని దీవించి రమ్మని చెప్పి ఉండదూ ?

అర్థం చేసుకోరూ !!


శుభోదయం
జిలేబి !

8 comments:

  1. "అమ్మ" ని నమ్ముకుంటే కదండీ! అవస్యంగా పుణ్యం,పురుషార్ధం ,మోక్షం దక్కేది

    భలే గుర్తు చేసారు . పెమినిజం జిందాబాద్

    ReplyDelete
    Replies
    1. వనజ వన మాలీ గారూ,

      'జిందా' హో తో బాధ తప్పదు !!


      జిలేబి

      Delete
  2. వేళ్ళు నొప్పులు పుట్టేయి తప్పించి చూసినవాడు లేదని బాధపడారు. నౌబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ అని రామదాసు కోరలేదూ! అమ్మ ఆల్ పవర్ఫుల్. అలహా బాగానే ఉంది.......ఆర్తి రావాలి.....

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      అంతా విష్ణు మాయ !

      జిలేబి

      Delete

  3. అమ్మ అంటే ఆడది కాదు , ఆది శక్తి అని గ్రహించుకోవాలి మనమతా . ఎవరైనా ఆఖరికి ఆ దేవుడైనా ఆ శక్తికి లోబడేవారేనని గ్రహించితీరాలండి.

    ReplyDelete
    Replies
    1. శర్మ గారూ,

      ప్రకృతి పురుషుడి లో వ్యత్యాసం ఉన్నదాండీ ?


      జిలేబి.

      Delete
  4. శ్యామలీయం గారు నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ అని పాడాలంటారా?..దహా.

    ReplyDelete
    Replies
    1. బులుసు గారూ,


      అర్థం చేసుకోరూ !!


      జిలేబి.

      Delete