Wednesday, April 17, 2013

బాబ్బాబు, నా టపాలు కాపీ కొట్టండి !


'అదేమిటోయ్ జిలేబీ చాలా విచారం గా ముఖం వేలాడెసి కూర్చున్నావు ల్యాపు టాపు ముందు ?' మా అయ్యరు  గారు పరామర్సించేరు ఆప్యాయంగా . 

కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా.

ఏమిటి జిలేబీ నీ మొగానికి ఏడుపు శోభిల్లదే ! కలకంటి కన్నీరు ఒలికిన ప్రాబ్లం అన్న మాటే మరి ! ఏమి నీ బ్లాగు కష్టాలు అన్నారు మా అయ్యరు గారు.

ఏమండీ నా కష్టాలు అన్నీ బ్లాగు కష్టాలేనా ? అడిగా

కాకుంటే ? నీకు పొద్దస్తమానం ఆ కంప్యూటరు జత జేరే ! వేరే ఎ కష్టాలు నీ కుంటాయి ? రిటార్టు ఇచ్చేరు

హు అన్నా హా అన్నా మళ్ళీ కన్నీటి వరదలు చిందించా

ఏమిటోయ్ విషయం ఈ మారు కొంత సేద దీరేక అడిగేరు మా అయ్యరు  గారు మళ్ళీ.

నా టపాలు ఎవ్వరూ కాపీ కొట్టడం లేదండీ ! అని భోరు మన్నా !

ఓసి పిచ్చి దానా ! నీ టపాలు ఎవ్వరూ కాపీ కొట్టక పొతే సంతోష పడాలి గాని ఇలా భోరు మంటే ఎట్లా గే ?

టపాలు  ఎందుకు కాపీ కొట్టి పెట్టు కుంటా రండీ  ?

'ఆ , ఏముందీ, కూసింత నచ్చితే, బాగుంటే ఆయ్  ఈ టపా, కథ కాస్త బాగుందే  , మన బ్లాగులో దాచేసు కుందాం అని పెట్టేసు కుంటారు '

అంటే ఏమని అర్థం ? నా టపాలు ఎవ్వరికీ నచ్చ లేదన్న మాటే గా ? మళ్ళీ బోరు మన్నా !

'ఓసీ నీ బ్లాగు పిచ్చి కాకులెత్తుకు పొనూ !  ఇవన్నీ చేజేతులారా తెచ్చి పెట్టు కున్న కష్టాలు కావే మరి ! అని మా అయ్యరు  గారు ఓ  జాడూ  జమాయించి 'కాఫీ పెడతా ఓ గ్లాసెడు గొంతులో పోసుకుని మళ్ళీ టపా లల్లెసుకో ' అని 'ప్యారీ బీవీ' కోసం కాఫీ పెట్టడం కోసం కిచెను లో  కెళ్ళేరు 

బ్లాగు భామలు, బ్లాగు భయ్యాలు నా టపాలు కాపే కొట్టి మీ బ్లాగుల్లో 'ప్రచారం' చేసి నా కు గంపెడంత పేరు తెచ్చి పెడుదురూ మరి !!- మా తిరుపతి వేంకటేశు గారికి సిఫార్సు చేసి మీకు పుణ్యం వచ్చేటట్టు చూస్తా !!


(తెలుగు తూలిక డాట్ నెట్ మాలతి గారి టపా కామెంట్లు  చదివేక ! సరదాగా )


చీర్స్
జిలేబి 

10 comments:

  1. మీరెంత అదృష్టవంతులో ! ఓదార్చి కాఫీ గ్లాస్ చేతికందిస్తున్నారు .

    ఒక్క మాట అండోయ్... మీ పోస్ట్ లు Copy కొట్టినా కష్టమే సుమీ ! వివరణ అడిగితే నోరు వెల్లబెట్టవలే ! మాకెందుకు లెండి ఆ కష్టాలు :)

    ReplyDelete
  2. పసిడయితే పట్టుకుపోతారు :) ఇప్పుడు ప్లాటినం,వజ్రాలే కావాలి పట్టుకుపోడానికి :)

    ReplyDelete
  3. పైన కాపీ రైట్ పెట్టుకుని కాపీ కొట్టమంటే ఎలా కొడతారండి?

    అయినా నూటికి నూరు మార్కులు (టపాకి 100 కామెంట్లు) వచ్చేవాళ్ళని కాపీ కొడతారు కాని.....

    ReplyDelete
  4. మీ కోసం పాపం మీ ఆయన "కాఫీ" కలిపి ఇస్తుంటే మీరు తీరిగ్గా కుర్చుని "కాపీ" కొట్టడం లేదని బాధ పడిపోతున్నారా...!!!

    ReplyDelete
  5. చూచి వ్రాతలలలో నేను వెనకపడ్డాను, కొంచం సెలవివ్వగలరు ఎలా చూచి వ్రాయాలో!

    ReplyDelete
  6. ముందు మీరు ఆ కాఫీ కొట్టిరండి ఆ పైన మీ టపాల కాపీ గురించి ఆలోచిద్దాం.....దహా.

    ReplyDelete
  7. ఏంటి మీ పోస్ట్ లు కాపీ కొట్టాలా ?
    వామ్మో అది మాత్రం అడగొద్దు . వేరే ఎమన్నా అడగండి, మీ పోస్ట్ లు మాత్రం కాపీ కొట్టలేం మమ్మల్ని క్షమించండి (కన్నీళ్ళ తో )...

    ReplyDelete

  8. జిలేబి గారు, మీ సిగ్నేచర్ ఈ మధ్య ఎవరో కాపీ చేసారేమో అని అనుమానం ఒక బ్లాగర్ గారికి, మరియు నాకు కూడా కలిగెన్. ఇదిగోండి లింక్.
    http://vedivedisamosaalu.blogspot.com/2013/03/blog-post_31.html
    ఆఖరి అజ్ఞాత కామెంట్ చూడండి. ఆ కామెంట్ రాసినది మీరే అయితే , ఓకే! మీరు కాకపోతే మీ టపా కాకపోయినా కామెంట్ ఎవరో కాపీ కొట్టారు...:)

    ReplyDelete
  9. మరి అప్పుడెప్పుడో మా టీచర్ "కాపీ" కొట్టొదన్నారుగా!
    ఛా....అంతా కంప్యూజన్ నే నాకుఏం చేయాలో :-)

    ReplyDelete
  10. కాపి కొట్టాలని వుంది ...మంచి ఐడియా నే ....

    ReplyDelete