నది పరవళ్ళు తొక్కుతోంది
చేప పిల్ల కేరింతలు కొడుతోంది
చేప పిల్ల నది ముద్దాట ల తో
నది చేప పిల్ల సయ్యాట ల తో
మమేకం తదేకం అద్వైతమ్
చేప పిల్ల పట్నం పోతా నన్నది
వద్దే అన్నది నది
లేదు నే పోయి తీరుతా నన్నది పిల్ల
చస్తే గాని పోలే వె చెప్పింది నది
అయితే నే చస్తా అన్నది చేప పిల్ల
నది కంట తడి పెట్టింది
జాలరి గాలం విసిరేడు
చేప పిల్ల గాల్లోకెగిరి వొడ్డున పడ్డది
గిల గిలా టప టపా వేగిర పడి
ప్రాణం ఉసూరు మన్నది
బుట్టలో పడి నగరం పోయింది
నగరం లో వేపుడు అయిపోయింది
అహం వైశ్వానరోహ !
జిలేబి
జిలెబి గారు బాగు-:)బాగు-:) మీ చెప కథ.. కని మీరు ఇంకొచెం బాగా రాయగలరు..
ReplyDeleteఎగిసే అలలు గారూ,
Deleteనెనర నెనర! కూసింత కాపీ కొట్టి మార్చి కొంత బెటరు చేసి మీ బ్లాగులో పెట్టి నాకు కాస్త పేరు తెచ్చి పెడుదురూ !!
చీర్స్
జిలేబి!
చెప్పడమే నాధర్మం వినకపోతే నీ కర్మం....అంతే
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteయథో కర్మః తథో ఫలః!
జిలేబి
ReplyDeleteమన కష్టే ఫలి శర్మ గారు చెప్పినట్లు , " మత్తు వదలరా , నిద్దుర మత్తు వదలరా " అన్న
పాటను ఈ టపా ద్వారా గుర్తు చేసినందులకు ధన్యవాదములు .
శర్మ గారూ,
Deleteమత్తు గమ్మత్తు ! దాని మజాయే వేరు ! పాపం శ్రీ కృష్ణ పరమాత్ముల వారికి అది అనుభవించే యోగం లేక పోయింది ! మాయ మత్తు రుచి వారు నారదుల వారికి (నారదుల సంసారం అన్న కథ ఒకటి ఉన్నది - సినిమా రూపేణ శ్రీ కృష్ణ మాయ అనుకుంటా !) చూపించేరు గాని, తాను శ్రీ కృష్ణు ని గా దాని రుచి వారు చవి చూడ లేదను కుంటా ! (రాముల వారి గా మాయ మత్తు అనుభవించిన 'experienced personality!)
చీర్స్
జిలేబి
వాట్ ఏ ఫిలాలఫీ జిలేబీ జీ
ReplyDelete
Deleteభాస్కర్స్ బ్లాగ్ గారూ,
నెనరస్య నెనరః !
జిలేబి