Thursday, April 25, 2013

పిల్ల కాలువ - నది - సంద్రం - ఆకాశం

 
పిల్ల కాలువ పరుగులిడు
తోంది నదిని చేరడానికి 
 
నది ఉరుకులిడు
తోంది సంద్రాన్ని చేరడా నికి 
 
సంద్రం  ఆకసం వైపు
ఆకసాన మేఘం భువి వైపు 
చూస్తోన్నాయి 
 
సన్నాయి రాగం తో గాలి తెమ్మర 
అట్లా వెళుతూ మేఘాన్ని ముద్దాడితే 
 
మేఘమాలిక కుంభ వృష్టి అయి
భువి ని తడిపేసింది 
 
పిల్ల కాలువ నది అయ్యింది 
నది మహా నది అయ్యింది 
 
సంద్రం మహాసముద్ర  మయ్యింది 
 
ఆకసం మళ్ళీ సంద్రాన్ని చూస్తోంది 
 
 
జిలేబి 

3 comments:

  1. ఇదేదో సంద్రపు లైఫ్ సైకిల్ లా ఉందే :-)

    ReplyDelete
  2. జిలేబీ జీ ! ఏమిటి నా పై ఏదో సెటైర్ వేసినట్లుగా ఉంది .

    కానీ మీరు చెప్పింది మాత్రం నిజం సుమీ!

    చీర్స్ ..

    వనజవనమాలీయం

    ReplyDelete
  3. పద్మార్పిత గారికి, వనజ వనమాలీ గారికి,

    ఆహా, విష్ణు మాయ ఇది కాకుంటే ఇంకొకటి ఏమిటి !

    పద్మార్పిత గారికి ఇది లైఫ్ సైకిల్ అనిపిస్తే, వనజవనమాలి గారికి ఇది 'లైవ్' సటైర్ అని పిస్తోంది !

    సైకిల్ టైర్ లేకుండా సాఫీ గా పోగునా విశ్వదాభిలేజీ వినుమ జిలేబి!~


    నెనర్లు

    జిలేబి

    ReplyDelete