పద్మనాభ స్వామీ వారి పాదాల చెంత ఒద్దికగా కూర్చుని స్వామీ వారి పాద సేవ చేసుకుంటూ ఉన్న లక్ష్మమ్మ దేవేరి 'పోస్ట్' అంటూ కేక వినబడటం తో ఉలిక్కి పడి పోష్టు అందుకుని స్వామీ వారి చెంత కిచ్చింది .
స్వామీ వారు అరమోడ్పు కనులతో చూసేరు .
లక్ష్మమ్మ కొచ్చెను మార్కు మొగం పెట్టింది స్వామీ వారి పాదసేవను విడనాడ కుండా .
పద్మనాభ స్వామీ వారు హు అన్నారు .
'స్వామీ ఎవరి వద్ద నించి పోష్టు ?' దేవేరి కి కొంత సందేహం మళ్ళీ భూలోకం లో కి స్వామీ వారు ఏమైనా వెళ్లి పోతారేమో అని .
దేవీ నీ ఒడ్డాణం బరువెంత ? స్వామీ వారు అరమోడ్పు కనులతో అడిగేరు .
దేవేరి సిగ్గు పడి తే గులాబీ చెక్కిళ్ళు కెంపులు విసిరేయి .
స్వామీ వారు , అబ్బా ఈ ఆండోళ్ళ హృదయం ఎప్పటికీ అర్థం కాదు సుమీ అనుకుని - తానేమన్నా సరస మాడే డా ఇప్పుడు ? జస్ట్ మేటర్ ఆఫ్ ఫెక్ట్ అడిగేడు - దేవీ నీ ఒడ్డాణం బరువెంత అని . జస్ట్ మేటర్ ఆఫ్ ఫేక్ట్ కి ఇంత సిగ్గు మొగ్గై పోవాల్సిన పనే ముంది ఇప్పుడు ?
దేవీ ఇది రిజర్వ్ బ్యాంకు వారి తాఖీదు -సరసానికి అడగ లేదా ప్రశ్న - సీరియస్ మేటర్ - నీ ఒడ్డాణం బరువెంత ?
దేవేరి ఈ మారు ముక్కు పుటాలు ఎగరేసింది .
హు హు ! ఇప్పుడు మా మీదే మీ కన్నులా ! మా ఒడ్డాణం బరువు ఇప్పుడు కావాల్సి ఒచ్చిందా వీరికి ! ఎంత దాకా వచ్చింది విషయం !
ఎందుకో రిజర్వ్ బ్యాంకు వారికి మా ఒడ్డాణం బరువు ? దేవేరి కౌంటరు వేసింది
స్వామీ వారు విసుగ్గా మొగం పెట్టేరు
'ఆ భోళా శంకరుణ్ణి చూడు - ఏమీ పట్టించు కోడు - ఆ పార్వతమ్మ ఏదో అట్లా సాదా సీదా చీరల తో , పుర్రెల ఆశామి తో గడిపేస్తుంది . మరి నీవేమో మెడ నిండా నగలు దింపితివి - ఇప్పుడు ఈ తాఖీదు ' స్వామీ వారు 'ఇదేమి ఖర్మ రా బాబు, ఈ రీజర్వ్ బ్యాంకు వారి కొర్రీ ' అని విసుక్కున్నారు
దేవేరి మరో మారు ముక్కు పుటాలెగుర వేసింది - వెంకన్న బాబు వై లచ్చి లేక కుబేరుని స్వామీ వారు వద్ద బకాయి పడ్డ విషయం వారికి గురుతు కి తెద్దామనుకుని అనుకుని పోనీ లే మన స్వామీ వారే కదా అనుకుని వదిలేసింది దేవేరి .
దేవీ ఇప్పుడేం చేద్దా మను కుంటు న్నావ్ ? స్వామీ వారి ప్రశ్న
'ఒడ్డాణం త్రాసు లో పెట్టి బరువు చూడాలా ? రీజెర్వ్ బ్యాంకు వారి వద్ద సరిఐన త్రాసైనా ఉందా !' అమ్మవారి రిటార్టు
***********
జిలేబి ఉలిక్కి పడి నిద్ర నించి లేచింది !
అమ్మో అమ్మో దేవేరి వారి ఒడ్డాణం బరువే ఎంత అని రిజర్వ్ వారు కొచ్చెనించి నపుడు , ఇక దేశం లో ని జిలేబీ ల గతి ఏమి గాను అనుకుంటూ భోషాణం తెరిచి ఓ మారు తన నగా నటరా అంతా కనుల పండువ గా ఒక్కమారు చూసు కుని 'ప్చ్ ప్చ్ వీటి లెక్కలు కూడా ఎప్పుడో అప్పుడు ఈ రీజేర్వ్ బ్యాంకు వారు అడుగు తారేమో మరి ' అనుకుని వా అని బోరుమంది సగం నిద్ర లో !
అయ్యరు గారు ఉలిక్కి పడి నిద్ర లేచారు !
జిలేబి ఏమయ్యింది ?
మన నగలన్నీ ఇక మనవి కావండి !
అయ్యరు గారు చికాగా మొగం పెట్టి 'చ చ తెల్లారి గట్రా హ్యాపీ గా నిద్ర పోక ఇదేమి గోల్డు మోహమో ఈ ఆండాళ్ళ కు అంటూ మరో వైపు తిరిగి పడు కునేరు !
జిలేబీ లు ! తస్మాత్ జాగ్రత్త మూడు తలల సింహం పొంచి ఉండి మిమ్మల్ని చూస్తోంది మీ ఒడ్డా ణా ల ని లగేసు కోవడానికి !!
చీర్స్
జిలేబి
(I like two kinds of gold !- One domestic and the other imported!)
RBI query on temples’ gold stocks sparks protest in Kerala ---> The Hindu Business Line వారి వార్త చదివేక !