Tuesday, September 3, 2013

బులుసు వారి 'ఇంటి మొగుడు' కి జిలేబి హాట్ ఫిక్స్ !

బులుసు వారి 'ఇంటి మొగుడు' కి జిలేబి హాట్ ఫిక్స్ !

ఇంటి మొగుడు - రైల్ ప్రయాణం లో 'పద' నిషాలు ! - భాగం మొదటి ఇక్కడ చదవాలి !

భాగం రెండు (ఇది జిలేబి హాట్ ఫిక్స్ - సరదా కి మాత్రమె!)

*****


హమ్మయ్య సక్సెస్ఫుల్ గా మరో మారు ప్రయాణం లో కథలు వినిపించేసా అనుకుంటూ హైదరాబాద్ నగరం లో రైలు బండి దిగా .

'ఏమండీ ' అన్న కేక వినిపించడం తో తల తిప్పి చూసా . ఒక ముదిత . ఎవరో మరీ జిలేబీ లా ఉంది - అబ్బే మనలని కాదని అడుగు ముందు కేసా .

ఏమండీ మిమ్మల్నే అంటూ గబ గబా దగ్గిరికి వచ్చేసిందా విడ

నా వెనుకే దిగిన ఆ రైలు ప్రయాణం లో నా కథ విన్న మొగుడూ పెళ్ళాం - లో మొగుడు  'ఆ ఏమోయ్ ఇంటి మొగుడు ' మీ కోపమావిడ కి నీ మీద ఎంత కోపమైన ప్రేమో చూడు - స్టేషన్ కి నీ కోసం వచ్చేసింది ' అన్నాడు

నా పిండా కూడు నా పెళ్ళాం ఏమిటి ? ఈవిడెవరో నన్ను కాదు పిలుస్తోంది అనుకుంటూ మరో అడుగు వేసా.

ఆ ముదిత 'ఏయ్  వెంకట్ ! ఎంత నా మీద కొపమైనా - నేను మిమ్మల్ని కోపగించి పెళ్లి చేసుకున్నా నేనెవరో తెలీనట్లు అట్లా వెళ్లి పోవడమేనా అంటూ ముక్కు చీది  కళ్ళ లో నీళ్ళు జలజలా పారేసు కుంది !

అబ్బే మీరెవరో నాకు తెలీదండీ అనబోయా !

పక్కనే ఉన్న మొగుడూ పెళ్ళాం నా ముందు కొచ్చారు .

'ఏమోయ్ వెంకటేశ్వర్లు - ఇది మీ విరసం లో సరసమా ' అన్నారు !

నా బొంద విరసం లో సరసం ఏమిటి ? విరసం గురించి నాకేం తెలుసు అనబోయి హ్హి హ్హి అన్నా .

ఆ ముదిత నా దగ్గిరకొచ్చి నా చేయి పట్టే సుకుని 'పదండి ' ఇంటి కి వెళ్దాం అంది '

అయ్య బాబోయ్ ఇదేదో నా కొంప మునిగేట్టు ఉందే  అనుకున్నా .

ఇక ఊరుకుంటే లాభం లేదని-

;అబ్బే , మీరెవరో నాకు తెలీదండీ ' వేరే ఎవరైనా మీ వారై  ఉంటారు ! మీ కేమన్నా నిద్రలో నడిచే అలవాటుందా ' అంటూ రివ్వున పారి పోవా లనుకున్నా గాని ఆవిడ పట్టిన చేయి ఉడుం చేయి లా ఉన్నది వదుల్చు కోవడానికి కుదరట్లే !

'ఓర్నాయనో ! ఓలమ్మో నా మొగుడు నన్ను ఒగ్గేస్తున్నాడు  అంటూ అ ఆవిడ ఆరున్నొక్క రాగాలు పట్టేసు కోవడం తో నాకు కాళ్ళు చేతులు ఆడ లెదు.

రైలు ప్రయాణం లో కథలు చెబితే ఇట్లా నిజమయ్యిమ్దేమిటి చెప్మా అనుకున్నా .

బింకంగా మళ్ళీ మరో మారు 'మీరెవరో నాకు తెలీదు' అన్నా

పక్కనే ఉన్న మొగుడూ పెళ్ళాం ఊరు కుంటే నా ! 'ఇదిగో వెంకటేశ్వర్ల్లూ - అట్లా పెళ్ళాన్ని నువ్వెవరో అంటా  వేమిటయ్యా  ! అన్నారు నన్ను ఆవిడ దగ్గిరకి తోస్తూ .

అంత లో సీను  మరీ ఘోరమై పోయింది .

రైల్వే స్టేషన్ లో ఓ  ఆడది కళ్ళ  నీళ్ళు పెట్టు కుంటే జనాలు ఊరుకుంటా రా ! అదీను జిలేబి లాంటి ముదితల్ కళ్ళ నీళ్ళు జూస్తే జనాల కళ్ళ లో నిప్పు కణికలు రాలవూ మరి ?

పెద్ద గుంపు చేరి పోయింది మా చుట్టూ .

నాకు పై ప్రాణాలు పై పైనే పోయేటట్టు అనిపించింది .

ఇంతలో ఎక్కణ్ణుంచి వచ్చాడో గాని ఒక పోలీసు ధబీమని ప్రత్యక్షమై ఏమయ్యింది అంటూ రంగం లో దిగాడు .

కొస ప్రాణం ఇక మరీ పై పైకి పోయింది

ప్రక్కనున్న మొగుడు పెళ్ళాలు నా సో కాల్డ్ వైఫ్ తరపున వకాల్తా పుచ్చేసు కున్నారు !

నా పని గోవిందా గోవిందా అయ్యేటట్టు ఉంది అనుకుని ' పోలీసు సార్  పోలీసు సార్  ' అంటూ కథ మొత్తం చెప్ప బోయా

నీ ...లం  ... . ఆండోళ్ళ  మీద ఇట్లా కంప్లింటా .. నడు  పోలీసు టాణా  కి అంటూ నా రెక్క పుచ్చు కుని బర బరా లాక్కె ళ్ళా డు  నన్ను ఆ పోలీసోడు .

సార్  సార్ నా మాట వినండి అంటూ ఉంటే విని పించు కుంటే నా !

కొంత దూరం వెళ్ళాక ఆ ఇప్పుడు చెప్పవోయ్ అన్నాడు పోలీసు వెంకట సామి

కథ మొత్తం జెప్పా .

నీ కథ ని నే నమ్మాలా అన్నాడు

అవ్ అన్నా

నమ్మితే నాకేమి లాభం అన్నట్టు జూసాడా వెంకట సామి

నా ధోతీ లోని నిజారు డ్రాయరు జేబు లో డబ్బు లున్నా యని వీడికేట్లా తెలుసు చెప్మా అని హాశ్చర్య  పోయా .
అబ్బా ఈ పోలీసోళ్ళది మరీ ఎక్స్రే కళ్ళు సుమీ అని అనుకో కుండా ఉండ లేక పోయా !

ఇది హాశ్చర్య  పోవడానికి సమయమా !

వెంటనే వీణ్ని  వదిలించు కుంటే గాని నా ప్రాణం గట్టేర దు అన్నట్టు అయ్యింది నా పరిస్థతి .

పోలీసోడి కి నాకూ మధ్య జరిగిన అగ్ని పరీక్ష లో నా నిజారు డ్రాయరు జేబు ఖాళీ !

పోలీసోడు మాయమై పోయేడు !

హమ్మయ్య ! అనుకుని నిట్టూర్చి కూసింత గర్వంగా తలెత్తి సంతోష పడి ఎంతైనా హుషారు గా తప్పించేసు కున్నా కథల్జేప్పిన దానికి నికరం గా నిజారు ఖాళీ ఖర్చు పది వేలరూపాయలు కళ్ళ  ముందు కనిపించినా అది నా పరువూ ప్రతిష్టల ముందు తక్కువే  అనుకుని జమాఖర్చులు లెక్క వేసుకుని నేనే లాభం పొందా నానుకుని తలెత్తు కుని స్టేషన్ బయట కు వచ్చి 'ఆటో ' అన్నా .

*************

'నీ  సిగ దరగా  ! ఎంకీ ఏమి చక్కగా యేషం  గట్టినావే అన్నాడు ఆ పోలీసోడు ఆ ఆడ దాన్ని జూసి ఆవిడ చేతిలో రూపాయ నోటులు  కుక్కేస్తూ .

'ఎంకట సామీ ! పదేలు కుదేసావ్ నా మొగుడి కాడ ! నాకు మాత్రం రెండే లే నా ?' ఆ పూబోడి కసిరింది ఎంకట సామిని " నేనే కదా అట్లా రైలు నించి నీకు ఎస్ ఎమ్ ఎస్ కొట్టి కథ జెప్పి వాణ్ని ఫిక్స్ జేసింది ?  ఆ పోర గాణ్ణి రెండు మూడు సార్లు రైల్లో చూసా. ప్రతి సారి ఏదో కథ జెప్తుండు ఈ సారి రంజు గా కధ జెప్పిండు . జెప్పిండు కదా అని నేనే కదా ఈ ప్లాన్ వేసా నాకు చేరి సగం ఇవ్వాలి"

అవున్లేవే ! అయినా ఈ పోలీసు వేషం కట్టి ఎంత రిస్కు దీసుకున్నా ననుకున్నావ్? నిజం పోలీసోడు ఎవడైనా నన్ను జూసి ఉంటే నా గతేం గాను ? అని వాడు  ఒక చేయిని మీసాల మీద కి పోనిచ్చి మరో చేయిని ఆ పోరదాని ఎద మీదికి పోనిచ్చి -  రేతిరి కి ఇంటికి రావే పెండ్లా మా '' అన్నాడు నవ్వుతూ .

*************

ఆటో ఎక్కి తల టీవి  గా పెట్టి ఆటో వాడి తో ధీమా గా అన్నా - "అమీర్పేట్ వెళ్ళ వోయ్" అని.

స్టేషన్ దాటి ఆటో టర్న్ అవుతూంటే ఆ పోలీసోడు ,  నా సో కాల్డ్ పెండ్లాం జేతిలో రూపాయలు కుక్కడం జూసి వామ్మో వామ్మో ఇంత మోసమా అనుకుని నోరు తెరిచేసా ! ఆటో వాడు రయ్యి మన్నాడు లేకుంటే నా  వీళ్ళ పని బట్టి ఉండనూ మరి !



చీర్స్
జిలేబి 

15 comments:

  1. ఇది ఆ కధకి పొడిగింపా? "మోడి"ఫికేషనా? ముగింపు అదిరింది :)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      బులుసు గారి రైలు బండి కథకి మరో కోణం !

      బులుసు వారి ఆ కథ చదివినాక ఇట్లా కూడా అవ్వొచ్చు గదా అన్న ఆలోచన వచ్చి 'టప టప ' లాడించిన టపా అన్న మాట !

      జిలేబి

      Delete
  2. అవునూ, బులుసు గారి మీద మీకు ఇంత కోపమా?.....దహా.
    అయినా ఫరవాలేదు. ప్రద్యుమ్నుడి మేనమామ మంత్రి. క్లాస్మేటు DGP. కాబట్టి ఇటువంటి భయాలు ప్రద్యుమ్నుడికి లేవు.......దహా.

    మిత్రులు గోపాలకృష్ణ గారికి ఒక సందేహం వచ్చింది మొదటి కధకి. "మీ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఎవరికైనా చెపితే నమ్మని పరిస్థితి వచ్చిందా" అని. చాలాకాలంగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇది చదివితే, ఏదో మెరుపు మెరిసింది. చూద్దాం ఆయన సందేహం తీర్చగలనేమో.......ఇంకో దహా.

    మీకు ఇంకోమారు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies

    1. బులుసు సుబ్రహ్మణ్యం గారికి,

      నెనరస్య నెనరః !

      ఇంతకీ గోపాల కృష్ణ గారి పతా ఇంత దాక కనబడటం లేదు ! వేచి చూద్దాం వారి జవాబు మరి !

      జిలేబి

      Delete
  3. Replies

    1. రాధిక నాని గారు,

      ధన్యవాదములు !!

      జిలేబి

      Delete
  4. :-) :-) బులుసు సుబ్రహ్మణ్యంగారిలా దహా దహా అంటే కాపీ కొట్టాను అంటారు గా అందుకే మరో రెండు :-) ;-)

    ReplyDelete
    Replies

    1. పద్మార్పిత గారు,


      మరో రెండు చుక్కలూ మూడు బ్రాకెట్లు అందు కోండి !!

      చీర్స్
      జిలేబి

      Delete
  5. నిన్న సుబ్రమణ్యం గాికథ ఈమాట లో చదివి ఈసారి ప్రయాణం లో అలాంటి కథలు చెప్తూ ప్రయాణం చేస్తే భలే ఉంటుంది కదా అనుకున్నాను. ఇప్పుడు మీ కథ చదివాక కథ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి బాబోయ్ అనుకుంటున్నా:):)
    చాలా బాగా రాశారు.

    ReplyDelete
    Replies

    1. ఎం రాధా గారు,

      అంతే అంతే ! కొంత సరిగ్గా ప్లేన్ చేసుకోవాలి ఇట్లాంటి ఇక్కట్లో పడకుండా !

      చీర్స్
      జిలేబి

      Delete
  6. కథ వెనుక కథ బావుంది బావుంది.

    ReplyDelete
    Replies

    1. జ్యోతిర్మయి గారు,

      బహుకాల దర్శనం ! నెనర్లు

      బుజ్జి పండు కథ ఒకటి స్వామీ వివేకానందా వారితో బకాయి సగం లో ఉంది ! వీలైనప్పుడు పునః ప్రారంభించాలి మరి చూద్దాం ఎప్పటికి అవుతుందో మరి !
      (ఆఖరి మారు రాసిన భాగం సశేషం గా ఉంది టపా సైడు లిస్టు లో !)

      జిలేబి

      Delete
  7. మీ బ్లాగ్ చూడటం మొదట సారి, చాలా బాగా రాశారు అనటం మీ స్థాయి కి చిన్న మాట అవుతుంది. హాస్యం జోడించినా... అనర్దాలు ఎలా వస్తాయో సూటిగా చెప్పారు. మిమ్ము అభినందించే అంతటి పెద్ద దాన్ని కాను కానీ... అద్భుతమైన శైలి.

    ReplyDelete
  8. మీ బ్లాగ్ చూడటం మొదట సారి, చాలా బాగా రాశారు అనటం మీ స్థాయి కి చిన్న మాట అవుతుంది. హాస్యం జోడించినా... అనర్దాలు ఎలా వస్తాయో సూటిగా చెప్పారు. మిమ్ము అభినందించే అంతటి పెద్ద దాన్ని కాను కానీ... అద్భుతమైన శైలి.

    ReplyDelete

  9. మేరాజ్ ఫాతీమా గారు,

    మీ అభినందల కి నెనర్లు ! సరదా గా రాసింది ఇట్లా కూడా ముగింపు ఉండ వచ్చని చదివాక అనిపిస్తే !

    జిలేబి

    ReplyDelete