Tuesday, September 10, 2013

జిలేబి నీ ఒడ్డాణం బరువెంత ?


పద్మనాభ స్వామీ వారి పాదాల చెంత ఒద్దికగా కూర్చుని స్వామీ వారి పాద సేవ చేసుకుంటూ ఉన్న లక్ష్మమ్మ దేవేరి  'పోస్ట్' అంటూ కేక వినబడటం తో ఉలిక్కి పడి పోష్టు అందుకుని స్వామీ వారి చెంత కిచ్చింది .

స్వామీ వారు అరమోడ్పు కనులతో చూసేరు .

లక్ష్మమ్మ కొచ్చెను మార్కు మొగం పెట్టింది స్వామీ వారి పాదసేవను విడనాడ కుండా .

పద్మనాభ స్వామీ వారు హు అన్నారు .

'స్వామీ ఎవరి వద్ద నించి పోష్టు ?' దేవేరి కి  కొంత సందేహం మళ్ళీ భూలోకం లో కి స్వామీ వారు ఏమైనా వెళ్లి పోతారేమో అని .

దేవీ నీ ఒడ్డాణం బరువెంత ? స్వామీ వారు అరమోడ్పు కనులతో అడిగేరు .

దేవేరి సిగ్గు పడి తే గులాబీ చెక్కిళ్ళు కెంపులు విసిరేయి .

స్వామీ వారు , అబ్బా ఈ ఆండోళ్ళ హృదయం ఎప్పటికీ అర్థం కాదు సుమీ అనుకుని - తానేమన్నా సరస మాడే డా ఇప్పుడు ? జస్ట్ మేటర్ ఆఫ్ ఫెక్ట్ అడిగేడు - దేవీ నీ ఒడ్డాణం బరువెంత అని . జస్ట్ మేటర్ ఆఫ్ ఫేక్ట్ కి ఇంత సిగ్గు మొగ్గై పోవాల్సిన పనే ముంది ఇప్పుడు ?

దేవీ ఇది రిజర్వ్ బ్యాంకు వారి తాఖీదు -సరసానికి అడగ లేదా ప్రశ్న - సీరియస్ మేటర్ - నీ ఒడ్డాణం బరువెంత ?

దేవేరి ఈ మారు ముక్కు పుటాలు ఎగరేసింది .

హు హు ! ఇప్పుడు మా మీదే మీ కన్నులా ! మా ఒడ్డాణం బరువు ఇప్పుడు కావాల్సి ఒచ్చిందా వీరికి ! ఎంత దాకా వచ్చింది విషయం !

ఎందుకో రిజర్వ్ బ్యాంకు వారికి మా ఒడ్డాణం బరువు ? దేవేరి కౌంటరు వేసింది

స్వామీ వారు విసుగ్గా మొగం పెట్టేరు

'ఆ భోళా శంకరుణ్ణి చూడు - ఏమీ పట్టించు కోడు - ఆ పార్వతమ్మ ఏదో అట్లా సాదా సీదా  చీరల తో , పుర్రెల ఆశామి తో గడిపేస్తుంది . మరి  నీవేమో మెడ నిండా నగలు దింపితివి - ఇప్పుడు ఈ తాఖీదు ' స్వామీ వారు 'ఇదేమి ఖర్మ రా బాబు, ఈ రీజర్వ్ బ్యాంకు వారి కొర్రీ ' అని విసుక్కున్నారు

దేవేరి మరో మారు ముక్కు పుటాలెగుర వేసింది - వెంకన్న బాబు వై లచ్చి లేక కుబేరుని స్వామీ వారు వద్ద బకాయి పడ్డ విషయం వారికి గురుతు కి తెద్దామనుకుని  అనుకుని పోనీ లే మన స్వామీ వారే కదా అనుకుని వదిలేసింది దేవేరి .

దేవీ ఇప్పుడేం చేద్దా మను కుంటు న్నావ్ ? స్వామీ వారి ప్రశ్న

'ఒడ్డాణం త్రాసు లో పెట్టి బరువు చూడాలా ? రీజెర్వ్ బ్యాంకు వారి వద్ద సరిఐన త్రాసైనా ఉందా !' అమ్మవారి రిటార్టు

***********

జిలేబి ఉలిక్కి పడి నిద్ర నించి లేచింది !

అమ్మో అమ్మో దేవేరి వారి ఒడ్డాణం బరువే ఎంత అని రిజర్వ్ వారు కొచ్చెనించి నపుడు , ఇక దేశం లో ని జిలేబీ ల గతి ఏమి గాను అనుకుంటూ భోషాణం తెరిచి ఓ మారు తన నగా నటరా అంతా కనుల పండువ గా ఒక్కమారు చూసు కుని 'ప్చ్ ప్చ్ వీటి లెక్కలు కూడా ఎప్పుడో అప్పుడు ఈ రీజేర్వ్ బ్యాంకు వారు అడుగు తారేమో మరి ' అనుకుని వా అని బోరుమంది సగం నిద్ర లో !
అయ్యరు గారు ఉలిక్కి పడి నిద్ర లేచారు !

జిలేబి ఏమయ్యింది ?

మన నగలన్నీ ఇక మనవి కావండి !

అయ్యరు గారు చికాగా మొగం పెట్టి 'చ చ తెల్లారి గట్రా హ్యాపీ గా నిద్ర పోక ఇదేమి గోల్డు మోహమో ఈ ఆండాళ్ళ కు అంటూ మరో వైపు తిరిగి పడు కునేరు !

 జిలేబీ లు ! తస్మాత్ జాగ్రత్త మూడు తలల సింహం పొంచి ఉండి మిమ్మల్ని చూస్తోంది మీ  ఒడ్డా ణా ల ని లగేసు కోవడానికి !!

చీర్స్
జిలేబి
(I like two kinds of gold !- One domestic and the other imported!)

RBI query on temples’ gold stocks sparks protest in Kerala ---> The Hindu Business Line వారి వార్త చదివేక !

17 comments:

  1. Replies

    1. పురాణ పండ ఫణి గారు,

      అంతే అంతే ! కేర్ఫుల్ గా ఉండాలి మరి ! ఇవ్వాళ దేవళం రేపు మన చేతి కబళం !

      జిలేబి

      Delete
  2. http://kastephale.wordpress.com/2013/09/10/

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      బాగు బాగు ! మీరూ టపా పెట్టె సే రన్నమాట ఈ జిలేబీ పుస్తెల మీద !

      ఈ టపా ది హిందూ బిజినెస్స్ లైన్ వారి టపా చదివేక రాసింది !

      "RBI query on temples’ gold stocks sparks protest in Kerala "

      చీర్స్
      జిలేబి !

      Delete
    2. I got ur point. It appears taht they r after the gold of GOD and common women :) I v not seen Hindu article:)

      Delete
  3. phale kastae (in future from now onwords):-)
    p.s:phalmantaa ikaa kastame ani ardham?!

    ReplyDelete
    Replies

    1. హరీష్ బాబు గారు,

      అంతా విష్ణు మాయ ! గోవింద రాజుల వారిది కష్టం తిరగ బడితే ఫలితం దక్కితే గొప్పే !!

      జిలేబి

      Delete
  4. జిలేబి గారు ,

    మన్మోహనుడి కళ్ళు మన ఆడాళ్ళ బంగారం మీద పడటం ఏమీ బాగా లేదు . ఏంటి సోనమ్మకు బంగారం లేదా ? ఆమెను అడిగాడా యిలాగ . మాటి మాటికి అపోజిషన్ పార్టీల వాళ్ళు రేట్లు పెరిగిపోతుణ్ణాయి తగ్గించండి అంటే , వెంటనే ప్రజలమీదకిలా దూకేయడం ఏమీ బాగా లేదు . అసలు సిసలు లోపమెక్కడో పరిశీలించి , ఆదిశగా అడుగులు వేస్తే మన రూపాయి పాపాయి ఆహ్లాదకరంగా పెరగ గలదు . లేకుంటే ఆ సోనమ్మ అడుగులకు మడుగులొత్తుతుంటే పిడుగులు పడ్డా పట్టించుకొనే పరిస్థితులలో వుండరు మన్మోహనుడు . ఆయన ఆయన భార్యకి మదనమోహనుడు , సోనమ్మకి మన్మోహనుడు , మనకు మనమోహనుడు కూడా కాడు యిటువంటి పనుల వల్ల .
    మన ఆడాళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చక్కగా సెలవిచ్చారు .

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు,

      ఈ ఒక్క విషయం లో మన మోహనుల వారిని తప్పు పట్ట కూడదను కుంటా ! ఇది క్రొత్త గోవిందా గోవిందా వారి ది మరి !!

      జిలేబి

      Delete
  5. Replies

    1. రాధిక గారు,

      నెనర్లు

      Delete
  6. జిలేబీయే వడ్డాణంలా మెరుస్తూ ఉంటుంది.
    మళ్ళీ జిలేబీకి వడ్డాణమా?

    ReplyDelete
    Replies

    1. బోన గిరి గారు,

      గిరియే బోన ! మరి బోనగిరి ఏల అంటారా మరి ! ఆయ్ ! జేకే !


      జిలేబి

      Delete
  7. మీ వడ్డాణాలు నా దగ్గర దాచి పెట్టుకుంటే సేఫ్. :)

    ReplyDelete
    Replies

    1. భలే వారండీ గ్రీన్ స్టార్ గారు,

      మీరేమన్నా స్విజ్ బ్యాంకు వారా !

      జిలేబి

      Delete
  8. మా చిట్టిదాని సిగ్గుబిళ్ల దాచేయాలి. రేపు దాని మీద కూడూ చూపులు పడొచ్చు

    ReplyDelete