హమ్మయ్య అనుకుని ఈ వాల్టికి ఏదైనా రాసి బ్లాగు పోష్టు ముఖం లో పడేసి ఎంచక్కా ముసుగు తన్ని నిదుర పోతే, పోష్టు లు చదివే వాళ్ళు వాళ్ళ తంటా వాళ్ళు పడతారని ఓ నాలుగు వాక్యాలని కత్తిరించి నిలువుగా నాలుగు పదాలు గా పేర్చేసి వావ్ వావ్ నా ఇవ్వాళ్టి కవిత తయారై పోయిందోచ్ అని బుగ్గ న వేలు పెట్టేసుకుని మహదానంద పడి పోయా , నా పద కవిత ని నేనే మెచ్చేసు కుంటూ మళ్ళీ మళ్ళీ చదివేసు కుంటూ !
వెనుక నించి అయ్యరు గారు డ్రాఫ్ట్ పేడ్ లో తలబెట్టి , ఏమోయ్ జిలేబి ఏమి రాస్తున్నావ్ అన్నారు !
ఆయ్ ఇవ్వాళ్టి నా కవిత ! అసలే మీకు తెలుగు అర్థం కాదు . మరి ఇది చదివి ఏమి అర్థమవుతుంది మీకు లెండి అన్నా కొంత వీరిని గీచి చూద్డా మని పించి . అయ్యరు గారిని గోకితే గాని రత్నాలు రాలవాయే మరి జిలేబి కి !
మాత్రా సమకం లేదోయ్ అన్నారు కూడబలుక్కుని చదివేసి !
ఏమి లేదు ?
మాత్రా సమకం !
మాత్ర? బీపీ మాత్రలు ఏమైనా ఎక్కువయ్యా యా ఏమిటి మీకు ? మాత్రలు గట్రా అంటున్నారు ' అడిగా నిజంగా నే వీరం టున్నారా లేక 'గాలి' పీకుతున్నారా అని సందేహ పడి పోయా కూడాను !
అవునోయ్ మాత్రా సమకం లేదు ఖచ్చితం గా .
సరే వీరిని ఒకమారు ఆట పట్టిద్దా మని అక్షరాలని తారు మారు చేసి మళ్ళీ నా కవితా పటిమ ని చూపించా .
ప్చ్ యతి దోష ముందోయ్ అన్నారు ఈ మారు .
అదిరి పడ్డా ! ఈ యతి దోషం గట్రా మనకు తెలియ వాయె !
ఎక్కడ ?
'ఆది అంత్య రెండులో ను ' మళ్ళీ టాం అని రిటార్టు ఇచ్చేరు పరిశీలించి !
'ఇదిగో అయ్యరు గారు యతి గీతి మనకీ జానతా నాయ్ ! ఏదో పదాలని విరగ్గోడితే అదే మా కవిత '
'సరేలే జిలేబి ; నువ్వు రాసే నాలుగు ముక్కలు చదవడానికి టీం పాస్ టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇట్లా బాధ పెట్టడం నీకు తగునా ? ' మళ్ళీ అయ్యరు గారు ప్రశ్నార్థకం గా ముఖం పెట్టేరు .
దీర్ఘ ఉచ్చరిక తో ఓ హ్రస్వ అక్షరం కలిపి హూమ్ అన్నా !
సరెలేవే ! నీ రాతలు కోతలు నీవే ! చెప్పే వాళ్ళు వినే వాళ్లకి లోకువ అని ...
చీర్స్
జిలేబి