అహో ఆంధ్ర భోజా ! శ్రీ కిరణ్ కుమారా !
టీ బిల్లు శిధిలాలో చిరంజీవి ఐనావయా !
పాట పాడేశాం కాబట్టి ఇక గ్రౌండ్ రియాలిటీ కి వస్తాం !
తెలంగాణా ఖరారు బిల్లు లోకసభ లో ఆమోదం అయ్యింది కాబట్టి -
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రపు ఆఖరి ముఖ్య మంత్రి ఎవరు అన్న ప్రశ్న కి సమాధానం గా శ్రీ కిరణ్ కుమార్ చరిత్ర పుటల్లో నిక్షిప్త మవుతారు .
రాబోయే కాలం లో ఏమి జరుగునో ఎవరూహించెదరూ ! అనగా రాజ్యం వీర భోజ్యం కాబట్టి రాబోవు ఆంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్య మంత్రి ఎవరో మరి !
టీ బిల్లు లో 'సీమాంధ్ర ' అన్న పదం లేదు కాబట్టి ఇక రాష్ట్రం పేరు ఆంధ్ర ప్రదేశ్ అనే అనుకోవాలి . మనకు మనమై కాదు కూడదు ఈ ఒక్క మా కోరికైన మన్నించండి దేవేరి - రాష్ట్రం పేరు సీమాంధ్ర ప్రదేశ్ కావాలి అంటే అవ్వొచ్చేమో మరి ; అయినా పేరులో ఏముంది !?
ఇక గ్రౌండ్ రియాలిటీ కి వద్దాం !
తెలంగాణా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు లాభాలు ఏమిటి ?
తెలంగాణా ఆవిర్భావం - బిల్లు చదివాక ఈ టపా రాయాలని పించింది.
నష్టాలు తప్పక ఉంటాయి . కాకుంటే ఇక ఇది తేలిపోయింది కాబట్టి - అంటే తెలంగాణా రాష్ట్రం వచ్చేస్తుందని - ఇక లాభాల గురించి తప్పక ఆలోచించి ముందడుగు ఎట్లా వెయ్యాలి అన్నది ఆంద్ర ప్రదేశ్ నిర్ధారించు కోవాల్సిన విషయం లా అనిపిస్తుంది .
మొట్ట మొదటిది - రాజధాని . పదేళ్ళ లోపు మరో రాజధాని అంటే - అందు తో బాటు ఎకనామిక్ డెవలప్మెంట్ . ఇది కీలకమైన లాభం గా భావిస్తే , ఏ వూరు ఇక రాజధాని అవుతుందో ఆ ఊళ్ళో ఇక తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఎక్కువగా పోలో మని ఉండటం ఖాయం - ఇందులో భాగస్వామ్యం అయ్యేవాళ్ళు తప్పని సరిగా రాబోయే కాలం లో మనీ లార్డ్స్ !
రెండవది - ఈ సరి కొత్త రాజధానికి తప్పని సరిగా ఇక మరో 'ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ రాక మానదు ! - మరో మెగా ప్రాజెక్ట్ డబ్బులే డబ్బులు !
మూడు - NIIMS లాంటి మరో మెగా మెడికల్ ఇన్స్టిట్యూట్ ! మరో మెగా ప్రాజెక్ట్
నాలుగు - చదువు సంబంధించి - మెగా ఎడ్యుకేషనల్ - IIT లాంటివి -
అంటే హైదరాబాదు వదిలి పెడితే ఇక సరైన మార్గం లో ఈ అవకాశాలని ఉపయోగించు కుంటే అంధ్ర ప్రదేశ్ మరో మారు విజయవంతం గా అభ్యుదయం వైపు సాగడం ఖాయం !
కొత్త పార్టీ పెట్టండి రాజ కీయ నేత లారా - ఆంధ్ర ప్రదేశ్ మీకోసం రా రమ్మని ఆహ్వానం తెలుపు తోంది !
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
ఇక వాటర్ మేనేజ్ మెంట్ - రెండు బోర్డులు - గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ; కృష్ణా రివర్ మేనజ్మేంట్ బోర్డు ! వీరి పని తీరు ని బట్టి రెండు రాజ్యాల మధ్య నదీ ప్రవాహక ప్రాంతాల అభివృద్ధి
అట్లాగే తెలంగాణా కి కూడా ఈ లాంటి మరెన్నో డెవెలప్మెంట్ అవకాశాలు లభ్యం - రాష్ట్రం లో ని ప్రతి ఒక్కటి ఇక ద్విగుణీ కృతం అవ్వాలి కాబట్టి రెండు అసెంబ్లీ లు గట్రా నించి ఇక సందడే సందడి మరి !
ఇక తెలుగు తేజం రెండు వైపులా వెల్లి విరిసి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథం లో సాగుతాయని ఆశిస్తో ...
ఇదే జిలేబి ఇచ్చు సందేశం - అయినదేమో అయినది - ఇక బిగువు ఏల ప్రేయసి !
శుభోదయం
జిలేబి