Thursday, March 6, 2014

మాకు 'ఎలచ్చన్లు' వచ్చేసేయ్-చాయ్ కప్పు కి జిలేబి పోటీ -సవాలే సవాల్


మొత్తం మీద మా సంపత్తు గారు పట్టు పట్టి ముహూర్తం బెట్టేసేరు 'ఎలచ్చన్ల' కి

కాబట్టి శ్రీకారం మొదలయ్యింది కాబట్టి - ఇక మీదట జిలేబి ఎక్కువగా రాజకీయాల గురించి రాయకూడదని నిర్ణయించేసు కుంది !

ఎందుకంటే ఏమి జెప్పను ! అన్న తీరుగా ఈ మధ్య లాలించే చేయి పాలించవా అని సరి కొత్త మీడియా స్లోగన్ మొదలయ్యింది కాబట్టి నేను కూడా చాలా తీవ్రం గా ఆలోచిత్తా ఉండా - మరీ మనం కూడా ఎలచ్చన్ల లో పాల్గొందామా అని !

ఎలచ్చన్ల లో కాంటెస్ట్ జేస్తే ఏమి ప్రయోజనం !?

మరీ ఓట్లు రాక పోయినా , మరో పార్టీ ని దెబ్బ తీయొచ్చు అన్న మాట  - అంతే !

వారణాసి లో సన్నాసి ఎలచ్చన్ల లో నిలబడితే నేనూ కూడా ఎలచ్చన్ల లో అక్కడ నిలబడతా నని అనుకుంటున్నా !
ఎందు కంటే వారణాసి జిలేబి లకి మరీ ప్రసిద్ధి ! తెల్లారి లేచి వేడి టీ పా ల తో జిలేబి నాష్టా లాగిస్తారు కాబట్టి నేను కూడా అక్కడ ఒక టికాణా వేస్తే  ఇక నాకు కనీసం తెల్లారి జిలేబి అమ్మకాలు కాకుండా ఉంటాయా మరి ?

చాయ్ కప్పు కి జిలేబి పోటీ - సవాలే సవాల్ !

చాయ్ కప్పు జిలేబి ఒక పార్టీ అవకూడదా మరి అంటారేమో మరి ! ఊహూ కుదరదు !

తెల్లారి నాష్టా దాకా అయితే కలిసి ఉంటాం కాని పోరాటం వస్తే మీకు మీరే మాకు మేమే ! అంతే అంతే !

కాబట్టి బ్లాగు వీరులారా --> వెంటనే జిలేబి కి ఓటేసి జిలేబి ని పోటీ గా నిలబెట్టడం మీ కనీస కర్తవ్యం !

కుదరదు - జిలేబి రుచి నో గుడ్ ! గులాబి సువాసన ఘుమ ఘుమలు మరీ మరీ బాగున్నాయి అంటారా ! ఇక మీ ఇష్టం ! ఘుమల్ ఘుమల్ తో సరదా గా సాగి పొండి !!


Welcome to the floor !

చీర్స్
జిలేబి

Sunday, March 2, 2014

ఇంతకీ దేశం లో ఏమి జరుగు తోం దండీ ?!



నేను కూడా ఇక మీదట ప్రశ్నలు వేయ దలచు కున్నా !

ఇంతకీ దేశం లో ఏమి జరుగు తోం దండీ ?!

ఏమో అంతా గందర గోళం గా గోల గోల గోల గా ఉంది !

ఈ రాజకీయం అస్సలు అర్థమయ్యి చావదు !

అక్కడేమో చిన్నమ్మ గారు సభలో తెలంగాణా తమ్ముళ్లు చిన్నమ్మ ని మరవకండెం అనే . తెలంగాణా కి సభలో మద్దతు పలికే

మరి స్వామీ మోడీ వారేమో సీమాంధ్ర వాళ్ళ కి సవితి తల్లి తీర్పు లాంటిది జరిగింది వాళ్ళ ని  ఓదార్చ టానికి సీమాంధ్ర వస్తా తప్పక అంటున్నారు !

అసలు ఎవరు ఎవరు ఏ సైడు లో 'గోల్' వేస్తున్నారండీ ! మీ కేమైనా కూసింత అర్థమైతే ఈ మొద్దు జిలేబి బుర్రకి కాస్త వివరించరూ  మరి !??


ఆహా దేశం లో దొంగలు పడ్డారు సుమీ

"శుభాకాంక్షల తో "

జిలేబి
 

Friday, February 21, 2014

జయహో తెలంగాణా !

జయహో తెలంగాణా !
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
జయ జయ హో అంధ్ర ప్రదేశ్ !
 
చీర్స్ 
జిలేబి 
 
(కొత్త రోజులకి స్వాగతం పలుకుతూ )

Wednesday, February 19, 2014

అహో ఆంధ్ర భోజా ! శ్రీ కిరణ్ కుమారా !


అహో ఆంధ్ర భోజా ! శ్రీ కిరణ్ కుమారా !
టీ బిల్లు శిధిలాలో చిరంజీవి ఐనావయా !

పాట పాడేశాం కాబట్టి ఇక గ్రౌండ్ రియాలిటీ కి వస్తాం !

తెలంగాణా ఖరారు బిల్లు లోకసభ లో ఆమోదం అయ్యింది కాబట్టి -

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రపు  ఆఖరి ముఖ్య మంత్రి ఎవరు అన్న ప్రశ్న కి సమాధానం గా శ్రీ కిరణ్ కుమార్ చరిత్ర పుటల్లో నిక్షిప్త మవుతారు .

రాబోయే కాలం లో ఏమి జరుగునో ఎవరూహించెదరూ ! అనగా రాజ్యం వీర భోజ్యం కాబట్టి రాబోవు ఆంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్య మంత్రి ఎవరో మరి !

టీ బిల్లు లో 'సీమాంధ్ర ' అన్న పదం లేదు కాబట్టి ఇక రాష్ట్రం పేరు ఆంధ్ర ప్రదేశ్ అనే అనుకోవాలి . మనకు మనమై కాదు కూడదు ఈ ఒక్క మా కోరికైన మన్నించండి దేవేరి - రాష్ట్రం పేరు సీమాంధ్ర ప్రదేశ్ కావాలి అంటే అవ్వొచ్చేమో  మరి ; అయినా పేరులో ఏముంది !?

ఇక గ్రౌండ్ రియాలిటీ కి వద్దాం !

తెలంగాణా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు లాభాలు ఏమిటి ?

తెలంగాణా ఆవిర్భావం - బిల్లు చదివాక ఈ టపా రాయాలని పించింది.

నష్టాలు తప్పక ఉంటాయి . కాకుంటే ఇక ఇది తేలిపోయింది కాబట్టి - అంటే తెలంగాణా రాష్ట్రం వచ్చేస్తుందని - ఇక లాభాల గురించి తప్పక ఆలోచించి ముందడుగు ఎట్లా వెయ్యాలి అన్నది ఆంద్ర ప్రదేశ్ నిర్ధారించు కోవాల్సిన విషయం లా అనిపిస్తుంది .

మొట్ట మొదటిది - రాజధాని . పదేళ్ళ లోపు మరో రాజధాని అంటే - అందు తో బాటు ఎకనామిక్ డెవలప్మెంట్ . ఇది కీలకమైన లాభం గా భావిస్తే , ఏ వూరు ఇక రాజధాని అవుతుందో ఆ ఊళ్ళో ఇక తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఎక్కువగా పోలో మని ఉండటం ఖాయం - ఇందులో భాగస్వామ్యం అయ్యేవాళ్ళు తప్పని సరిగా రాబోయే కాలం లో మనీ లార్డ్స్ !

రెండవది - ఈ సరి కొత్త రాజధానికి తప్పని సరిగా ఇక మరో 'ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ రాక మానదు ! - మరో మెగా ప్రాజెక్ట్ డబ్బులే డబ్బులు !

మూడు  - NIIMS లాంటి మరో మెగా మెడికల్ ఇన్స్టిట్యూట్ ! మరో మెగా ప్రాజెక్ట్

నాలుగు - చదువు సంబంధించి - మెగా ఎడ్యుకేషనల్ - IIT లాంటివి -

అంటే హైదరాబాదు వదిలి పెడితే ఇక సరైన మార్గం లో ఈ అవకాశాలని ఉపయోగించు కుంటే అంధ్ర ప్రదేశ్ మరో మారు విజయవంతం గా అభ్యుదయం వైపు సాగడం ఖాయం !

కొత్త పార్టీ పెట్టండి రాజ కీయ నేత లారా  - ఆంధ్ర ప్రదేశ్ మీకోసం రా రమ్మని ఆహ్వానం తెలుపు తోంది !

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

ఇక వాటర్ మేనేజ్ మెంట్ - రెండు బోర్డులు - గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ; కృష్ణా రివర్ మేనజ్మేంట్ బోర్డు ! వీరి పని తీరు ని బట్టి రెండు రాజ్యాల మధ్య నదీ ప్రవాహక ప్రాంతాల అభివృద్ధి

అట్లాగే తెలంగాణా కి కూడా ఈ లాంటి మరెన్నో డెవెలప్మెంట్ అవకాశాలు లభ్యం - రాష్ట్రం లో ని ప్రతి ఒక్కటి ఇక ద్విగుణీ కృతం అవ్వాలి కాబట్టి రెండు అసెంబ్లీ లు గట్రా నించి ఇక సందడే సందడి మరి !

ఇక తెలుగు తేజం రెండు వైపులా వెల్లి విరిసి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథం లో సాగుతాయని ఆశిస్తో ...

ఇదే జిలేబి ఇచ్చు సందేశం - అయినదేమో అయినది - ఇక బిగువు ఏల ప్రేయసి !


శుభోదయం
జిలేబి
 

Monday, February 17, 2014

'అరవింద' గింజ - జిలేబి 'మారకం' !


అరవిందుని ఒక మండల డిల్లీ దర్బారు గురివింద గింజ మేళం అయి పోయింది !

కేజ్రివాలు క్రేజీ వాల్ అని ఆ మధ్య మన కష్టే ఫలే వారు కామేంటి తే , శర్మ గారు కూడా 'పద' జాలాల తో భలే ఆడు కుంటారు సుమీ అనుకున్నా

ఇప్పుడు డిల్లీ దర్బారు మూత పడి పోవడం తుగ్లక్ దర్బారు ని తలపిస్తోంది !

సరే దేశ రాజకీయం లో ఏదైనా జరగొచ్చు !

మీదేశం పిజ్జా కి పాపులర్ అయితే డానికి కావాల్సిన పెప్పర్ మా దేశం దోయ్ అని మన వారు నిరూపించేరు లోక్ సభ లో !

పిజ్జా పై టాపింగ్ గా పెప్పర్ బాగుంటుంది కాని కంట్లో పెప్పర్ టాపింగ్ చేస్తే ఎట్లా అని దేశం గగ్గోలు !

మధ్య లో అంబాని వర్సస్ అరవిందుని కేసులు కూడా తయారయ్యేటట్టు ఉన్నది !


ఏమిటో మరి !

ఇవ్వాళ డిల్లీ బావ కూడా ముంబై మరదలు పిల్ల తో లుంగి డాన్స్ చేయించ బోయే దినమాయే మరి !

కాబట్టి ఇవ్వాల్టి టపా ఇంతటి తో సరిబెట్టి రాబోయే 'కాళం' కోసం ఎదురు చూస్తో -

నమో మోడీ నమో నమః !


చీర్స్
జిలేబి

Wednesday, February 12, 2014

ఎల్లమ్మ - ఎకానమీ !


మన ఆర్ బీ ఐ చీఫ్ రాజన్ మానవుడు 'Inflation is a killer for economic growth' అంటే టాట్ టాట్ అని మార్కెట్టు డమ డమ పడి పోయింది ! స్వామీ చిదంబరం వారు కూడా దీనికి కౌంటర్ ఇచ్చేరు - 'టాట్ టాట్ - ఇంఫ్లేషన్ చాలా అత్యావసరమైన ది అని (అదీ ఎక్కడో ఐరోపా లోఅవ్వాళ  కూర్చుని !) రాజన్ మానవుడు వడ్డీ రేపో రేటు క్వార్టర్ పాయింట్ పెంచితే మార్కెట్టు దమాలని 350 నిఫ్టీ పాయింట్లు వదిలించు కుంది - ఇదే కదా సందులో సడేమియా అంటే !

సరే ఇక మన అమెరికా సంగతి చూద్దాం ! 'ఎల్లమ్మ' గారు బెర్నాంకె తరువాయి పదవి ని అలంకరించు కుని నిన్న మొట్ట మొదటి సారి పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చేరు - నేను బెర్నాంకె చూపిన బాట లోనే నడవాలని అనుకుంటున్నా నని ! - స్టిములస్ విత్డ్రా చెయ్యడం అంచెల వారీ గా జరుగు తుంది ఐతే, రేటు మాత్రం బెర్నాంకె వారి అడుగు జాడల్లో అంటే తక్కువగా నే పెడతా నని !
అమెరికా మార్కెట్టు జూమ్మంది 'నా' దమ్' అయ్యింది !

అంతే గాక అమెరికా జాబ్ మార్కెట్టు గ్రోత్ తక్కువగా ఉండ డానికి కారణం వాతావరణం వల్లే అని వక్కాణించి 'అమ్మో వాతావరణా న్ని ఇట్లా కూడా ఉపయోగించు కోవచ్చు అన్న మాట అని పించేలా హాశ్చర్యం లో ముంచెత్తే సేరు కూడాను !

అమెరికా ఎల్లమ్మ చెబితే గొప్ప కాదూ మరి ! హే రాజన్ !

ఇవ్వాళ మన సో కాల్డ్ 'de-coupled' ఇండియా స్టాక్ మార్కెట్టు కూడా తధిగిణత్తొం అని అమెరికా మార్కెట్టు కి 'లుంగి డాన్స్' చేస్తుందేమో మరి !

అదీ గాక - ముంబై మరదలు - డిల్లీ బావ ల సరస మేళం నెల కూడా ఆయే ఈ ఫిబ్రవరీ నెల ! మరదలు పిల్ల ఇంకా ఏమేమి నృత్య భంగిమలు చూపించ బోతోందో మరి !

'భారాత్' నాట్యం !



శుభోదయం
జిలేబి

(సరదా గా - ఫెడ్ కొత్త చీఫ్ జానెట్ ఎల్లెన్ 'హాశ్చర్యం' గురించి చదివాక ! -
Yellen acknowledged she was surprised by the sluggish job gains the past two months. But she suggested that job growth might have been held down by severe weather and was not necessarily a signal of a slowdown.")

Tuesday, February 11, 2014

ఎగిసే అలలు !



వరితో పంచుకోవాలి
గిలిగింతలు ?
సేన్సిబల్ 'కూసంత' హాస్యం
సలెందుకో ఈ క
వరం ? అనుభవా
లు  మూగ వోని  మౌన రాగం !


ఎగిసే అలలు 



శుభోదయం
జిలేబి

Monday, February 10, 2014

సుజన సృజన !


సులభమైన 
నబాహుళ్య మైన   
వ మంజరి  

సృజుడు  లక్కాకుల,వారి  
న ప్రియ బ్లాగు 'e-'కాలపు 
వ నాయిక !

సుజన సృజన !


శుభోదయం
జిలేబి

Wednesday, February 5, 2014

ఎన్నెల - శ్యామ వర్ణ !

ఎన్నెల - శ్యామ వర్ణ !

న్నెల తో టపా వ 
న్నెలు దీర్చిన  తొ  
కరిన   'కానదా ' కబుర్లు !

శ్యామ నీలి మేఘశ్యా 
అంటూ బ్లాగు 
నం లో పాటోళి ! అ  
ర్ణ వం కూడితే మరి 
చిలిపి నవ్వుల జాబిల్లి 

ఎన్నెల - శ్యామ వర్ణ !


చీర్స్ 
జిలేబి 

Tuesday, February 4, 2014

కష్టే ఫలే - శర్మ కాలక్షేపం కబుర్లు !


ర్రున దూసుకొచ్చే వే
ర్వేరు టపా గమకం తో
నాలని ఆకట్టు కొని ఏ
నా టికైనా నిలిచి పోయే
సుమేరు కంటెంట్ అ
ఖిల విజ్ఞానం, మ
నో విహంగ మధురాను 

వ పరిమళానికి
వంకసరకు ఇది అది అన్నీ-
తురంగ వేగ 'టపా'శ్రమం వారిది !


ల 'కాలమ్' మృ
ష్టేరుక మేఘం
లదాయక జ్ఞాన 
లేపనం ! లే లెమ్మని
రవేగం తో భాస్కర శ  
ర్మ  టపా గీతమ్


కాలానికి నిలిచే 
కార ని 
క్షే ప భాండాగారం 
పంచు కునే ఫల వృక్షం !
లం  కితా
బు  ఆరు నూ 

ర్లు పై  కబుర్లు !


కష్టే ఫలే - శర్మ కాలక్షేపం కబుర్లు !


శుభాకాంక్షల తో 
జిలేబి