అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - ( భాగం రెండు ) - అథర్వ శిర ఉపనిషత్
అథర్వ శిర ఉపనిషత్ లేక అథర్వ శీర్షోపనిషత్ -
అథర్వ వేదీయ శైవ ఉపనిషత్ . అర్థమనర్థ ప్రోచ వాచకం .
"దేవా హ వై స్వర్గ లోక మాయస్తే రుద్రన్ పృచ్చన్, కో భవాన్ ఇతి ?"
దేవతలు రుద్రుని గురించి తెలుసు కోవడానికి కైలాస వాసుడైన రుద్రుని ప్రశ్నిస్తారు - స్వామీ మీరెవ్వరు ?
దానికి సమాధానం గా రుద్రుడు చెప్పడం ఈ ఉపనిషత్ సారం .
"సో బ్రవీద మమ ఏకః
ప్రథమం ఆసన్,
వర్తామి చ ;
భవిష్యామి చ;
న అన్యః కశ్చిన్
మత్తో వ్యతిరిక్త ఇతి !"
"ఆది లో నేనే ఉన్నాను ;
వర్తమానం లో నేనే ఉన్నాను ;
భవిష్యత్తు లో ను నేనే ;
నన్ను తప్పించి వేరెవ్వరూ లేరు "
ఈ ఉపనిషత్తు లో అంతర్యామిన్ ప్రస్తావన మన శరీరం లో హృదయం లో ఉన్నాడన్న ప్రస్తావన ఇట్లా వస్తుంది .
హృది స్థా దేవతా సర్వా హృది ప్రాణాః ప్రతిష్టితాః ! హృది త్వం అసి యో నిత్యం తిస్రో మాత్రాః పరస్తు సః !"
సర్వ దేవతలు హృదయం లో ఉన్నారు; ప్రాణం హృదయం లో ప్రతిష్టిత మై ఉన్నది ; హృదయం లో తను ఉన్నాడు; (హృది త్వం అసి) త్రిగుణా ల కావల ఉన్నాడు "
మరొక్క చోట , వెంట్రుక కొన అంత సన్నగా (అంతర్యామిన్) హృదయం లో ఉన్నాడన్న ప్రస్తావన వస్తుంది .
" వాలాగ్ర మాత్రం హృదయస్య మధ్యే విశ్వం దేవం జాతరూపం వరేణ్యం ! "
తమ్ ఆత్మస్థ యేను పశ్యంతి ధీరాః తేషాం శాంతిహి భవతి న ఇతరేషాం !
(To the wise men , who realize the Deity in Atman, (who is as minute as the end of the hair), in the center of the heart, who is omniscient the best and all, is the eternal tranquility, and not to others. )
అథర్వ శిర ఉపనిషత్ సంస్కృతం
అథర్వ శిర ఉపనిషత్ - ఆంగ్లాను వాదం
శుభోదయం
జిలేబి