అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - ( భాగం రెండు ) - అథర్వ శిర ఉపనిషత్
అథర్వ శిర ఉపనిషత్ లేక అథర్వ శీర్షోపనిషత్ -
అథర్వ వేదీయ శైవ ఉపనిషత్ . అర్థమనర్థ ప్రోచ వాచకం .
"దేవా హ వై స్వర్గ లోక మాయస్తే రుద్రన్ పృచ్చన్, కో భవాన్ ఇతి ?"
దేవతలు రుద్రుని గురించి తెలుసు కోవడానికి కైలాస వాసుడైన రుద్రుని ప్రశ్నిస్తారు - స్వామీ మీరెవ్వరు ?
దానికి సమాధానం గా రుద్రుడు చెప్పడం ఈ ఉపనిషత్ సారం .
"సో బ్రవీద మమ ఏకః
ప్రథమం ఆసన్,
వర్తామి చ ;
భవిష్యామి చ;
న అన్యః కశ్చిన్
మత్తో వ్యతిరిక్త ఇతి !"
"ఆది లో నేనే ఉన్నాను ;
వర్తమానం లో నేనే ఉన్నాను ;
భవిష్యత్తు లో ను నేనే ;
నన్ను తప్పించి వేరెవ్వరూ లేరు "
ఈ ఉపనిషత్తు లో అంతర్యామిన్ ప్రస్తావన మన శరీరం లో హృదయం లో ఉన్నాడన్న ప్రస్తావన ఇట్లా వస్తుంది .
హృది స్థా దేవతా సర్వా హృది ప్రాణాః ప్రతిష్టితాః ! హృది త్వం అసి యో నిత్యం తిస్రో మాత్రాః పరస్తు సః !"
సర్వ దేవతలు హృదయం లో ఉన్నారు; ప్రాణం హృదయం లో ప్రతిష్టిత మై ఉన్నది ; హృదయం లో తను ఉన్నాడు; (హృది త్వం అసి) త్రిగుణా ల కావల ఉన్నాడు "
మరొక్క చోట , వెంట్రుక కొన అంత సన్నగా (అంతర్యామిన్) హృదయం లో ఉన్నాడన్న ప్రస్తావన వస్తుంది .
" వాలాగ్ర మాత్రం హృదయస్య మధ్యే విశ్వం దేవం జాతరూపం వరేణ్యం ! "
తమ్ ఆత్మస్థ యేను పశ్యంతి ధీరాః తేషాం శాంతిహి భవతి న ఇతరేషాం !
(To the wise men , who realize the Deity in Atman, (who is as minute as the end of the hair), in the center of the heart, who is omniscient the best and all, is the eternal tranquility, and not to others. )
అథర్వ శిర ఉపనిషత్ సంస్కృతం
అథర్వ శిర ఉపనిషత్ - ఆంగ్లాను వాదం
శుభోదయం
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteఅంతర్యామి అంటేనే అంతర్యం లో ఉండేవాడు అని కదా!అంతర్యం అంటే ఆలోచన. హృదయం అనేది సెంటిమెంట్ కీ బుధ్ధి అనేది ఇంటెలిజెన్స్ కీ పర్యాయ పదంగా అలంకారిక భాషలో వాడుతున్నారు తప్పితే నూతన జీవ ధర్మశాస్త్రం ప్రకారం ఆ సెటిమెంట్ కు సంబంధించిన ఆలోచనలు కూడా మెదడు లోనే పుడతాయి కదా! మొత్తం శరీర మంతా నాడీ స్పందనల రూపంలో అన్న్ని అంగాలూ ఆలోచనలకి కారణ భూత మవుతాయి.
ReplyDeleteఇన్ని రకాల ఆధ్యాత్మిక గ్రంధాలలో విస్తరించినా దైవానికి సంబంధించిన మూలభావం
ఈశావాస్య మిదం సర్వం నుంచే వస్తాయి కదా!అందులో "యత్కించ జగత్యాం జగత్" అనే భావం చెప్తున్నది దైవం ఈ ప్రపంచాన్నంతా ఒక దుప్పటి లాగా బయటి నుంచి ఆవరించి ఉండదనీ - యెంత చిన్న భాగంగా విదగొట్టినా ప్రతి వస్తు విశేషానికీ లోపలా బయటా కూడా తానె ఉంటాడని కదా!
మరి జిలేబీ గారు దేనికోసం వెతుకుతున్నారు?!
హరి బాబు గారు,
Deleteనెనర్లు మీ కామెంటు జాంగ్రీ లకి !
దేని కోసమూ వెతకడం లేదు ! ఉపనిషత్తులు చదవటానికి ఒక ప్రశ్న ఆధారం గా తీసుకుని సరదా గా చదువుదామని ! ఇట్లా ఒక ప్రశ్న అంటూ కలిగించు కుంటే , తద్వారా చదవడం సౌలభ్యం గా ఉంటుందని కూడాను !
ఇంకా యత్కించ జగత్యాం జగత్ మాట అంటారా ! డానికి ఇక తిరుగు లేదు - ఉపనిషత్తు ల లెక్క ల లో ఈశావాస్య ఉపనిషత్తు కి మొదటి స్థాన మాయే మరి !
చూద్దాం ఈ ప్రయత్నం ఎంత దాకా కొనసాగించ వచ్చో అని ! అంతే
నెనర్ల సహిత
జిలేబి
చూడగలిగే సామర్ధ్యం ఉంటే జిలేబిలో కూడా ఉన్నాడని గ్రహించవచ్చు ..
ReplyDeleteఎస్త్రో జాయడ్ గారు,
Deleteఇందు గలడందు లేదని 'సం' దేహం వలదు - ఎందెందు వెతికినా అందందు జిలేబి కలదు ! జిలేబి సర్వ వ్యాపితం ! చూడ దలిస్తే అది జిలేబి లో కూడా ను ఖచ్చితం గా ఉన్నదే మరి !!
ఇక మీ కో ప్రశ్న - సామర్త్యం వల్ల చూడ గలుగు తారా లేక - అంతర్యామిన్ తనకై తానూ ప్రకాశించ గలిగితే చూడ గలుగు తారా ? అసలు మనిషి సామర్థ్యం విలువ ఉన్నదా ?
చీర్స్
జిలేబి
అది జిలేబీ గారిలో నేనెప్పుడో చూశాను.సారు చేసిన ప్రయాణ మంతా జిలేబీ చుట్ట ల్లాగే కడు రమ్యంగా ఉంది.
ReplyDeleteహరి బాబు గారు,
Deleteనెనరస్య నెనరః !!
చీర్స్
జిలేబి